చైనాకు షాక్ : గల్వ‌న్ లోయ‌లో శ్రీ‌కాకుళం సైనికుడికి నివాళి ! మేరా భార‌త్ మ‌హాన్!

RATNA KISHORE
నా శ్రీ‌కాకుళం గ‌ర్విస్తుంది స‌ర్
గ‌ల్వ‌న్ లోయ‌లో మీరు వ‌దిలిన ఆఖ‌రి శ్వాస
వృథా కాలేద‌ని!
లాన్స్ నాయ‌క్ లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు గారూ!
మీరు విన్నారా ఈ శుభ‌వార్త.. ఆ రోజు ఘ‌ట‌న త‌రువాత2020 జూలైలో జ‌రిగిన ఘ‌ట‌న త‌రువాత
మ‌న దేశం మ‌ళ్లీ చైనా ఆక్ర‌మిత లోయ‌ను గ‌ల్వ‌న్ లోయ‌ను
తిరిగి స్వాధీనం చేసుకుంది.. మీరు సంతోషించాలి స‌ర్..
మీరు అందించిన స్ఫూర్తితో కొత్త సైనికులు నా నేల నుంచి వ‌స్తున్నారు
వారంతా ఈ దేశ భ‌ద్ర‌త‌కు అనునిత్యం శ్ర‌మిస్తారు. ప్రాణాలిస్తారు
గ‌ర్విస్తున్నా నా సిక్కోలు నేల నుంచి వీరులు మాత్ర‌మే పుడ‌తారు అని
వీరుడా నీకు వంద‌నం..


వ‌ణికించే చ‌లి గాలులు చెంత,మైన‌స్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల చెంత ఒక లోయ‌లో ఒక సైనికుడు నా దేశ సైనికుడు బాంబ్ స్క్వాడ్ లో ప‌నిచేస్తూ విస్ఫోట‌న ప‌దార్థాల‌ను నిర్వీర్యంచేస్తూ చ‌నిపోయాడు.మా శ్రీ‌కాకుళం న‌గ‌రానికి చెందిన లావేటి ఉమామ‌హే శ్వ‌రరావు 2020 ఆగ‌స్టులో అసువులుబాశాడు.ఇద్దరు ఆడ‌బిడ్డ‌లున్న కుటుంబం.అనా రోగ్యంతో ఉన్న భార్య..ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం..ఇవ‌న్నీ చూసి క‌రిగి క‌న్నీర‌యిపోతున్న దేశం.అప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నుంచి ఏ సాయం లేదు.ఊరు ఊ రంతా క‌రోనా భ‌యాల‌తో వ‌ణికి పోతోంది.నేను మాత్ర‌మే స్పందిస్తానా..మా ఊరి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కు ఫోన్ క‌లిపి విషయం చెప్పాను..మీరు సాయం చేస్తున్నారు క‌దా! ఆ కుటుంబానికి మీతో పాటు మేం కూడా అని ప‌దివేల రూపాయ‌లు మా సంస్థ త‌ర‌ఫున అప్ప‌టిక‌ప్పుడు అనుకుని వెళ్లి ఆ వీరుని బిడ్డ‌ల‌కు అందించి వ‌చ్చాము..ఆ త‌ల్లి క‌న్నీళ్లు పెడుతోంది..నేను అక్క డ ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నాను. ఆ రోజు ఎంపీ రామూ స‌ర్,  నేను, ఇంజినీరు మ‌హంతి, నాతో మా స్నేహితుడు రామ‌కృష్ణ..మేం చేసిన సాయం చాలా చిన్న‌ది..ఆ కుటుంబానికి ఎంపీ రామూ ఇంకా ఇంకొంద‌రు నైతికంగా మ‌ద్ద‌తు ప‌లికారు. నేను క‌థ‌నం రాశాను.త‌రువాత ఘ‌ట‌న జ‌రిగిన ఏడాదికి డి ప్యూటీ సీఎం వెళ్లి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సాయం చేసి వ‌చ్చారు.అది కూడా వ‌రుస క‌థ‌నాలు నాతో పాటు ఇంకొంద‌రు రాయ‌గా రాయ‌గా..ఇదండీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరు.. ఇక ఇవాళ గల్వాన్ లోయ‌లో నా దేశ వీరుడికి ప్ర‌ణ‌మిల్లుతున్నాను.. నా దేశ సైనికులు మళ్లీ ఆ లోయ‌ను శ‌త్రు మూక‌ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.అక్క‌డ త్రి వ‌ర్ణ ప‌తాక  రెపరెప‌లు చూసి పొంగిపోతున్నాను..మ‌రి!ఆ రోజు నేనేం రాశానంటే...
(ఆగస్టు 13,2020)
త్యాగ‌ధ‌నుడికి వంద‌నం : సైనికుడా! నీకు నేను అండ
- అమ‌రుని కుటుంబానికి ఆర్థిక చేయూత
- ఇచ్చిన మాట ప్ర‌కారం యువ ఎంపీ కార్యాచ‌ర‌ణ
- లాన్స్ నాయ‌క్ ఉమామ‌హేశ్వ‌ర‌రావు స్మృత్య‌ర్థం
- విగ్ర‌హం ఏర్పాటూ త్వ‌ర‌లోనే..
- క‌లెక్ట‌ర్ తో సంప్ర‌తింపులు..యువ‌త‌కు స్ఫూర్తి ఇచ్చేలా నిర్మాణం

వ‌ణికించే చ‌లి గాలులు..ప్రాణాలు ఫ‌ణంగా పెట్టించే జ‌టిల స‌మ‌స్య‌లు..గాలుల తీవ్ర‌త‌లు పెరిగే కొద్దీ..యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొనే కొ ద్దీ..స‌వాళ్లు పెరుగుతూనే ఉంటాయి. గ ల్వాన్ వ్యాలీలో పేలుడు ప‌దార్థాలు నిర్వీర్యం చేస్తూ అసువులు బాసిన లాన్స్ నాయ‌క్ లావేటి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇందుకు మిన‌హాయింపు కాదు. ఆయ‌న త్యాగ ఫ‌లం ప్ర‌తి ఒక్క‌రికీ స్ఫూర్తిదాయ‌కం.ఆయ‌న కు టుంబాన్ని ఆదుకోవ‌డం, వారికి నైతిక మ‌ద్ద‌తు ఇవ్వ‌డం బాధ్య‌త. ఈ బాధ్య‌త‌ను ప్ర‌భుత్వాలు నిర్వ‌ర్తించి, ఆచ‌రించి చెప్పిన మాట లు నిల‌బెట్టుకుని తీరాలి. ప్ర‌భు త్వం నుంచి స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న రాని త‌రుణంలో యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు త‌న‌వం తుగా ముందుకు వచ్చారు. బాధిత కు టుంబానికి యాభై వేల రూపాయ‌లు అందించారు. త‌న త‌ర‌ఫున లాన్స్ నాయ‌క్ ఉమామ ‌హేశ్వ‌ర‌రావు విగ్ర‌హం ఏర్పాటుకూ ముందుకువ‌చ్చారు.యువ‌త‌కు స్ఫూర్తిని చ్చేలా ఈ విగ్ర‌హం నెల‌కొల్ప‌నున్నామ‌ని,త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను త‌మ భ‌వానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున అమలు చేయ‌నున్నామ‌ని యువ ఎంపీ తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌జాస‌ద‌న్ కార్యాల‌య వ‌ర్గాల ద్వారా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్ర‌జాస‌ద‌న్ (శ్రీ‌కాకుళం న‌గ‌రి): భార‌త్ - చైనా స‌రిహ‌ద్దుల్లో గ‌ల్వా‌న్ వ్యాలీకి స‌మీపాన పేలుడు ప‌దార్థాలు నిర్వీర్యం చేస్తూ అసువు లు బాసిన లాన్స్ నాయ‌క్ లావేటి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కుటుంబానికి యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు చేయూత నిచ్చారు.ఆయ‌న ఇరువురి కుమార్తెల పేరిట చెరొక 25 వేల రూపాయ‌ల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, సంబంధిత ప‌త్రాల‌ను త న కార్యాలయ వ‌ర్గాల ద్వారా ఉమామ‌హేశ్వ‌ర‌రావు భార్య నిరోష‌కు గురువారం అందించారు. అనంత‌రం యువ ఎంపీకి, ఆ య‌న కార్య‌వ‌ర్గానికి నిరోష కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ప‌లు విష‌యాలు పొందుప‌రిచారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం నుంచి వీరికి ద‌క్కాల్సిన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు వెంట‌నే అందించాల‌ని,కుటుం బంలో ఒక‌రికి నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉద్యోగ అవ‌కాశం ద‌క్కించాల‌ని కోరారు. ఉమామ‌హేశ్వ‌ర‌రావు చ‌నిపోయి దాదాపు నెల రోజులు దాటుతున్నా ఇప్ప‌టికీ ఆ కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎటువంటి ఆర్థిక సాయం అంద‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ న్నారు.ప్ర‌భుత్వ ప‌రంగా నిబంధ‌న‌ల అనుసారం వారికి ఇవ్వాల్సిన భూమి,అందించాల్సిన ప‌రిహా రం, అదేవిధంగా కుటుంబంలో ఒక‌రికి ఉద్యో గం సాధ్య‌మ‌యినంత త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని కోరారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తో కాలం వెళ్ల‌దీయ‌క మాన‌వతా దృక్ప‌థంతో వారి ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ప‌దే ప‌దే విన్నవించారు.

త్యాగాలకు విలువ ఇదేనా!
దేశం కోసం అమ‌రులు అయిన కుటుంబాల విష‌య‌మై అంతా ఏక‌తాటిపై నిలిచి,వారికి మ‌నో స్థైర్యం పెంపొందించిన‌ప్పుడే సంబం ధిత సైనికుల,సైనికాధికారుల త్యాగాల‌కో వి లువ ఉంటుంద‌ని చెప్పారు.ఈ విష‌య‌మై అల‌స‌త్వానికి తావేలేద‌ని,త‌న వంతుగా ఆ కుటుంబానికి అన్ని వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.త‌న స్ఫూర్తిని అందుకుని ఆ కుటుంబానికి అండ‌గా నిలిచే వారెవ్వర ‌యినా స‌రే ఓ గొప్ప సంక‌ల్పాన్ని కొన‌సాగించిన‌వారేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేవ‌లం కొన్ని ఘ‌ట‌న‌ల‌కు,ముఖ్యంగా మీడియాలో ప్రము ఖంగా విని పించే, క‌నిపించే వాటికే ప్ర‌భుత్వాలు ప్రాధాన్యం ఇవ్వ‌డం త‌గ‌ద‌ని, ఇలాంటి వేళ‌ల్లో కాస్త చొర‌వ చూపి మాన‌వ‌తను చాటుకుంటే సైనికుల ప్రాణ త్యాగాల‌కో గౌర‌వం ద‌క్కుతుంద‌ని హిత‌వు పలికారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అమ‌రుడి కుటుంబానికి మ‌నో ధైర్యం ఇచ్చేలా ప్ర‌తి ఒక్క‌రూ మ‌ద్ద‌తుగా నిలవాలని,ఈ విషాద స‌మయంలో నైతి కంగా వారి వెంట నిలిచామ‌న్న ఆలోచనే బాధితుల‌కు కొండంత నిబ్బ‌రం అవుతుంద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమామ‌హేశ్వ‌ర‌రావు విగ్ర‌హం ఏర్పాటుకు సైతం తాను క‌లెక్ట‌ర్ నివాస్‌తో మాట్లాడాన‌ని, త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి స్ప‌ష్ట‌మయిన ప్ర‌క‌ట‌న త‌న నుంచి వ‌స్తుంద‌ని తెలిపారు.  

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: