'సారాయి' వీర్రాజు ను కాపాడేందుకేనా ఈ జిన్నా గొడవ?

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. మొన్న విజయవాడలో ప్రజాగ్రహ సభలో చేసిన చీప్ లిక్కర్‌ వ్యాఖ్యలు చాలా కలకలమే సృష్టించాయి. ఏకంగా బీజేపీని జాతీయ స్థాయిలో చులకన చేసేశాయి. ఇతర రాష్ట్రాల నాయకులు కూడా సోము వీర్రాజు వ్యాఖ్యల వీడియోలను షేర్ చేస్తూ బీజేపీ విధానం ఇదేనా అంటూ తూర్పారబట్టారు. నేషనల్ మీడియాలోనూ సారాయి వీర్రాజు.. సారీ.. సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అంతే కాదు.. సోషల్ మీడియాలోనూ సోము వీర్రాజును ట్రోలర్స్‌ మామూలుగా ఆడుకోలేదు.

ఈ చీప్ లిక్కర్ కామెంట్లు పార్టీని బాగా డేమేజ్‌ చేశాయన్న విషయం బీజేపీ బాగానే గ్రహించినట్టుంది. మరి ఎలా.. ఈ డేమేజ్‌ ను కంట్రోల్ చేయడం ఎలా అని బీభత్సంగా ఆలోచించినట్టు ఉంది. ఇంకేముంది.. పెద్ద గీత చిన్న గీత ఐడియా గుర్తొచ్చేసింది.. అంటే తెలియదా.. ఏ గీతనైనా చిన్నగా చేయాలంటే  దాని పక్కన మరో పెద్ద గీత గీయాలన్నమాట. ఇప్పుడు బీజేపీ చేసింది అదే.. అందుకే ఉదయం నుంచి బీజేపీ నేతలంతా ఇప్పుడు గుంటూరులోని జిన్నా టవర్‌ పై పడ్డారు. దశాబ్దాల తరబడి గుంటూరులో ఠీవీగా నిలబడిన ఆ జిన్నా టవర్‌ను కూల్చేయాల్సిందే అంటూ రంకెలు వేయడం ప్రారంభించారు.

ఎవరో ఒక నాయకుడు కాదు.. నాయకులంతా కూడబలుక్కున్నట్టుగా ఈ జిన్నా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దశాబ్దాల తరబడి ఉన్న జిన్నా టవర్‌పై ఇవాళే ఎందుకు గొడవ వచ్చింది అంటే సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్ల నుంచి ప్రజల దృష్టినీ.. మీడియా దృష్టినీ.. సోషల్ మీడియా దృష్టినీ దారి మళ్లించడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.

లేకుంటే ఇన్నాళ్లుగా గుర్తు రాని జిన్నా టవర్ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది.. అందులోనూ చివరకు తెలంగాణ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ కూడా ఆ జిన్నా టవర్‌ను కూల్చేస్తా అంటూ ఎందుకు రంకెలు వేస్తాడు.. ఇదంతా పక్కా పథకం ప్రకారం నిర్వహించిన డైవర్షన్ డ్రామా అన్న అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: