మోడీ ని ఫాలో అవుతున్న దేశాధినేత ఎవరు ? ఏం చేశారిద్దరూ ?


గుజరాత్ లోని వడ్ నగర్ నివాసి ఢిల్లీ లోని 7 రేస్ కోర్స్ నివాసిగా పట్టాభిక్షిక్తుడై చాలా కాలం అయింది. భారత దేశ సమిష్టి ఆకాంక్షలకు అచ్చమైన మూర్తీభావంగా  దామోదర్ దాస్ నరేంద్రమోడీని  యావత్ దేశం గుర్తించింది. ప్రపంచ రాజకీయ వేదికపై  భారత దేశం స్థానాన్ని పునః ప్రతిష్టించే నేతగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. హిందూ మాతాధిక్య భావాలున్న వ్యక్తి అనే ఆరోపణలు మొదలుకొని పెట్టుబడిదారులకు ఆత్మీయ బంధువు అనే వరకూ  ఎన్ని నిందులు వచ్చినా, విమర్శకులు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు ఆయన పరిపాలనకు పట్టం గట్టారు. దామోదర్ దాస్ నరేంద్ర మోడీ వారి ఆశలు వమ్ము చేయలేదు. ప్రపంచ వేదిక పై భారత్ స్థానాన్ని ఆయన సుసంపన్నం చేశారు. భారత ప్రధాన మంత్రిని ప్రస్తుతం ఎందరెందరో  దేశాధినేతలు అనుసరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తాజా ఉదాహరణే ఇది.
ఈ ఏడాది క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్-19 నిబంధనలు ఒక వైపు ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి కరుణామయుడ్ని స్మరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తొలిసారిగా  అగ్రరాజ్యాధినేత హోదాలో క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చేశారో తెలుసా ? తన భార్య జిల్ తో కలసి పండుగను విభిన్నంగా జరుపుకున్నారు.  ఈ పండగను బైడెన్ దంపతులు భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ని ఫాలో అయ్యారు.
 భారత్ లో అందరూ సంతోషంగా గడుపుకునే పండుగ దీపావళి.  నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ప్రతి ఏడాది దీపావళిని  దేశ సరిహద్దుల్లోని సైనికులతో గడపడం రివాజు. ఈ చర్య భారత్ లో నూతన శకానికి నాందీ పలికింది కూడా.  ప్రతి ఏటా దీపావళి నాడు దేశం యావత్తూ ... ఈ ఏడాది  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్కడు జరుపుకుంటారనే విషయం పై ఉత్సుకత కనబరుస్తారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఈ దఫా క్రిస్మస్ వేడుకల సందర్భంగా నరేంద్ర మోడీని ఫాలో అయ్యారు.  ఆయన తన నివాసం నుంచి  ప్రపంచం నలుమూలలా ఉన్న అమెరికా రక్షణ సిబ్బందితో మాట్లాడారు. వారితో వర్చువల్ గా కనెక్ట్ అయ్యారు. తన శ్రీమతి జిల తో కలసి అందరితోను మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వేళ మీ రందరూ దేశ సేవలో ఉండటం గర్వకారణమని వారితో చెప్పారు. అమెరికా చరిత్రలో ఒక దేశాధ్యక్షుడు క్రిస్మస్ వేళ సైనిక సిబ్బందితో మాట్లాడటం ఇదే తొలిసారి .

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చర్యలు యావత్ ప్రంపంచాన్నీ ఆకర్షిస్తున్నాయనడానికి ఇది తాజా ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: