ఆ రంగంలో మోదీ.. చైనాకు షాక్ ఇవ్వబోతున్నారా..?

దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్ వినియోగం మన దేశంలో చాలా ఎక్కువ. దీని విషయంలో మనం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నందువల్ల జనంపై భారం భారీగానే పడుతోంది. అంతే కాదు.. ఈ పెట్రోల్‌, డీజిల్ వినియోగంతో పర్యావరణం కూడా బాగా పాడవుతోంది. ఈ సమస్యలకు విరుగుడుగా ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకొస్తున్నాయి. అయితే.. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకోవడం లేదు.

అయితే.. ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉండటానికి ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోవడం ఓ కారణం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను మనం చాలా వరకూ దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు మోడీ సర్కారు ఈ బ్యాటరీల తయారీ పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు ఈ రంగం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మోడీ సర్కారు దీనిపై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత వరకు పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మోదీ సర్కారు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలొ అడ్వాన్సుడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ బ్యాటరీలను తయారు చేసే 20 సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ 20 సంస్థలూ కూడా మన దేశానికి సంబంధించనవే. వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో ఈ 20 సంస్థల ద్వారా బ్యాటరీల ఉత్పత్తి గణనీయంగా చేపట్టాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఈ బ్యాటరీల రంగంలో చైనా అత్యధిక సరఫరాదారుగా ఉంది.

ఇప్పుడు ఇండియా ఈ రంగంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ రంగంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే అవకాశం పుష్కలంగా ఉంది. వచ్చే పదేళ్లలో బ్యాటరీ తయారీ రంగంలొ భారత్ ఒక అత్యుత్తమైన దేశంగా మారాలనే సంకల్పంతో ఉంది. ఈ రంగం ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: