జగన్‌@49: ప్రతి అడుగూ.. పేదల వైపే.. !

ఇవాళ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు.. 49 ఏళ్లు పూర్తి చేసుకున్నజగన్.. మరో ఏడాదిలో అర్థ శతకం పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు దాటి పోయింది.. సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పాలనను సమీక్షించుకుందాం. జగన్ అధికారంలోకి రాకముందు తన ఎన్నికల సభల్లో చెప్పినట్టుగా రాజన్న రాజ్యం మళ్లీ తెస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో నవరత్నాల హామీల ద్వారా ప్రజల మనసుల్లోకి వెళ్లేలా ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన ప్రధమ ఎజెండా ఆ నవరత్నాలే అయ్యాయి.

జగన్ ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసినా.. ఎన్ని కొత్త సంస్కరణలు తెచ్చినా ఆయన గురి ఎప్పుడూ పేదలవైపే.. ఆయన వేసే సంక్షేమం అడుగులు అందుకునేది ఎక్కువగా పేదలే. నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యమే జగన్ నిర్ణయాల్లో కనిపిస్తోంది. సమాజంలోని అత్యంత నిరుపేద కూడా ఆనందంగా జీవించాలన్న ఉద్దేశ్యం ఆయన పథకాల్లో కనిపిస్తుంది. అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా ఆయన నవరత్నాల హామీలను అమలు చేయడం ప్రారంభించారు.

జగన్ సర్కారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ.. నగదు పంపిణీ పథకాలు కానీ.. సంపూర్ణ గృహ హక్కుపథకం కానీ.. పేదలకు ఇళ్లు పథకం కానీ.. రైతు భరోసా కేంద్రాలు కానీ.. అన్నీ పేదలు, గ్రామీణులను ఉద్దేశించి రూపొందించినవే. వాస్తవానికి ఏపీ సర్కారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. కరోనా వల్ల ఏపీ ఆదాయం దారుణంగా పడిపోయింది. అయినా సరే.. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించలేదు. ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ సర్కారు ఏమాత్రం రాజీ పడటం లేదు.

ఏపీలో దాదాపు వంద‌కు పైగా సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు రెండున్నరేళ్ల పాల‌న‌లోనే 96 శాతం వరకూ అమలు చేశామని వైసీపీ చెబుతోంది. ఏదేమైనా జగన్ పాలనలో హీరో మాత్రం పేదవాడే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: