హమ్మయ్య: చంద్రబాబుకు జ్ఞానోదయం..?

తెలుగు దేశం పేదల పార్టీ.. తెలుగు దేశం సామాన్యుడి పార్టీ.. తెలుగుదేశం కార్మిక, కర్షక, బడుగు జీవుల పార్టీ.. ఇదీ తరచూ ఎన్టీఆర్ చెబుతుండేవారు.. కానీ.. ఆ తర్వాత టీడీపీ రూట్ మారిందన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలో ధనవంతులకే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారవేత్తలకు చంద్రబాబు పెద్దపీట వేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

ఇప్పుడు చంద్రబాబు తన తప్పు తెలుసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ఇకపై పార్టీలో పని చేసేవారికే ప్రయారిటీ అంటున్నారు చంద్రబాబు.. పార్టీలో ఇక కష్టపడిన వారికే టికేట్స్ ఇస్తానంటున్నారు. షో చేసే వారిని పక్కన పెట్టేస్తానంటున్నారు చంద్రబాబు.. కొంతమంది పార్టీలో కర్చీఫ్ వేసుకుని కూర్చుంటున్నారని.. కొంతమంది పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిచడం లేదని.. ఇదేంటి అని ఆడితే మేము చూసుకుంటాం అంటున్నారని ఇక అలాంటి వాళ్లకు కాలం చెల్లిందని చంద్రబాబు అంటున్నారు.

రాజకీయలు మారాయంటున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగా మనం మారాలంటూ పార్టీ శ్రేణులకు బోధిస్తున్నారు. ఎంత చెప్పినా మారక పోతే పక్కన పెట్టేస్తానని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా.. కొంతమంది నాయకులు దూకుడు గా మాట్లాడంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పార్టీ బలపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ఆత్మ గౌరవ సభలు నిర్వహించాలి అని టీడీపీ నిర్ణయించింది.

ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇంకా దూకుడుగా వెళ్ళాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మహిళల పై దుష్ప్రచారం, అసెంబ్లీ లో జరిగిన ఘటనలు క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ పొలిట్ బ్యూరోలో వరదల్లో ప్రభుత్వ వైఖరిపైనా చర్చ జరిగింది. వరద నష్టం.. ప్రభుత్వ చర్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో  నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: