రైతు గుప్పిట్లో : ఆంక్షల సంకెళ్ల లోకి..

ప్రజలు, ముఖ్యంగా రైతుల ఆకాంక్షలను నిజాయితీగా  రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయా ? వారికి నిజంగా చిత్తశుద్ధి ఉందా ?. ఈ ప్రశ్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే తలెత్తక మానదు. అటు కేంద్రం లోనూ, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ పార్టీలు రైతుల ఆకాంక్షలకు విలువ ఇస్తున్నాయా ? వారికి ఆంక్షల సంకెళ్లు వేస్తున్నాయా?
రాజకీయ పక్షాలు ప్రజా వ్యతిరేక అంశాలపై పోరాటం చేయాలి. చట్ట సభల్లో  రైతులకు వ్యతిరేకంగా జరిగే బిల్లలను అడ్డుకోవాల్సి ఉంది. రైతు సంక్షేమం పై  చట్టసభల్లోనూ, వెలుపలా చర్చలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అవేమీ జరగడం లేదు. ప్రజా సంక్షేమమే  తమ ధ్యేయం అని పదే పదే ప్రకటిస్తున్న నేతలు, వారి వారి పార్టీలు చేస్తున్న దేమిటి ? ప్రజలకు నష్టదాయకంగా, ఉన్న అంశాలపై  కనీసం ఆలోచించాలి,  కానీ వారు అలా చేయడం లేదు.  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులుపోరాటం చేశారు.  వీరి పోరు బాట ఆధునిక యుగంలో ఓ చరిత్కాత్మక అశం.
 రైతులకు దిగుబడులు పెంచాలని చెప్పేది ఎవరు ? రైతు శాస్త్రవేత్తలా ? ఎరువులు, పురుగు మందులు విక్రయించే వ్యాపార సంస్థలా ?  తరతరాలుగా తాము అనసరిస్తున్న  వ్యవసాయ సరళి నుంచి రైతులు  ఎప్పటికీ మారరు. ఒక గ్రామంలో  అధిక దిగుబడి సాధించిన రైతు అదే ఊరి వాళ్ల దృష్టిలో హీరో. పక్కూరోళ్లకి  సూపర్ హీరో. ఒక టీచర్ లాంటి వాడు కూడా.  పక్క గ్రామంలో వేరుశనగ పంట లో చేసిన ఓ చిన్న ప్రయోగం ఫలిస్తే.. అధిక దిగుబడి వస్తే. పక్క గ్రామం వారు వేరుశనగ పంటను సాగు చేస్తారు. పక్క గ్రామం వారి వలే తమ భూమినీ చదును చేస్తారు. అదే విధంగా సత్తువ పెట్టి సారవంతం చేస్తారు. కళ్ల ముందు కనిపించే వాటినే భారత్ లో రైతులు నేటికీ ఆచరిస్తున్నారు. కంటికి కనిపించే దానినే వాళ్లు ఇది వాస్తవం రా అని గ్రామాల అరుగుల వద్ద అంటూ ఉండటం మనం నిత్యం చూస్తుంటాం.
కానీ ప్రస్తుతం పాలకుల తీరు మారింది. రైతులపై ఆజమాయిషీ చేస్తున్నారు. ఏ కాలంలో ఏ పంట వేయాలో వారే నిర్దేశిస్తున్నారు. అలా చేయకుంటే మీకు ప్రభుత్వం నుంచి  ఎలాంటి సాయం అందదని పరోక్షంగా  బెదిరిస్తున్నారు. ఇలా రైతులపై ఆంక్షల సంకెళ్లు పడుతున్నాయి.
ఎవరికి సంకేళ్లు వేసినా అవి నా జాతి ప్రజలందరికీ వేసిన సంకెళ్లే... అన్న నెల్లన్ మండేలా మాటలను గుర్తు చేసుకుంటూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: