హస్తిన చంద్రుడు : కెసిఆర్ తో ఆ సినీ నటుడు కలుస్తాడా ?

 బెంగళూరు సమీపంలోని పద్మనాభపురం. అక్కడ  నివాసం ఉన్నది  రాజకీయ కురువృద్ధుడు. జనతాదళ్ ( సెక్యూలర్) అధినేత మాజీ ప్రధాన మంత్రి  దేవగౌడ.  ఆయన నివాసానికి  మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో  హఠాత్తుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, చడీ చప్పుడూ లేకుండా విచ్చేశారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హోరు, జోరు , పోరు హోరా హోరీగా సాగుతున్న కాలమది.  తేదీ బహుశా  2018 ఏప్రిల్  పన్నెండవ తారీకు అయి ఉండవచ్చు. అనూకోనీ అతిథి తన ఇంటికి రావడంతో దేవగౌడ ఒకింత విస్మయానికి గురయ్యారు.అంతలోతెరుకుని  ఆ అతిథికి స్వాగతం పలికారు. వెంటనే తన కుమారుడు, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా తన గృహానికి రావలసిందిగా కోరారు.  కుమారస్వామి హుటా హుటిన తన తండ్రి వద్దకు విచ్చేశారు. ఈ సమావేశం అటు దేవగౌడ కానీ, కుమార స్వామి కానీ ఊహించినది కాదు.  అనుకోని అతిథితొ ఏం మాట్లాడాలి అన్న విషయం లో తండ్రీ కుమారులిద్దరూ కొంత తడబాటుకు గురయ్యారు.  అందరూ రాజకీయ వేత్తలే కదా ! సందర్భాను సారం ఎలా ప్రవర్తించాలో అందరికీ ఎరుకే కదా. సమావేశం ఏకాంతంగా, సజావుగా సాగింది,  ఈ సమావేశానికి  చెప్పాపెట్టకుండా హాజరైన వ్యక్తి   తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. ఆయన వెంట వెళ్లింది, సమావేశానికి సంధాన కర్తగా వ్యవహరించిన వ్యక్తి  దక్షిణ భారత దేశంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నటుడు  ప్రకాశ్ రాజ్. అప్పటికే ప్రకాష్ రాజ్  దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పైన, ఆయన పాలన పైన విమర్శల జడివాన కురిపించే వ్యక్తిగా  ప్రకాశ్ రాజ్ పేరుగాంచారు. ఆయన మీడియాలోను, వివిధ సభల్లోనూ మోడీ పై చేసిన విమర్శలు వివిధ వర్గాల మేథావులను ఆలోపించజేశాయి. దీంతో నటుడిగానే కాకుండా,  బిజేపి వ్యతిరేకిగా ముద్రపడి ఉన్నారు. కెసిఆర్, కుమారస్వామి, దేవేగౌడ,  ప్రకాశ్ రాజ్ లు ఏకాంతంగా ఏమేమి మాట్లుడుకున్నారు ? అన్న విషయం ఆ నలుగురికే తెలుస్తుంది.  సమాావేశానంతరం అందరూ విలేఖరులతో మాట్లాడారు.  కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్లు, ముఖ్యంగా తెలంగాణ వాళ్లు జనతా దళ్ కు ఓటు వేయాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభ్యర్థించారు,  స్వాతంత్య్రం వచ్చి న  తరువాత కాంగ్రెస్, బిజేపిలు దేశాన్ని పాలించాయని, ఈ రెండు పార్టీలకు ప్రత్యా మ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని కెసిర్ పేర్కోన్నారు.
ఇదంతా నాటి ముచ్చటగా కొట్టి పారెయలేం. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పు డు  ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కెసిఆర్  ప్రస్తుతం దేశ రాజకీయాలపై దృష్టి సారించి నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. నాడు ఆయన వెన్నంటి ఉండి నడిచిన నటుడు ప్రకాశ్ రాజ్  తాజాగా కేసిఅర్ వెంట నడుస్తారా ?  కెసిఆర్ ఉప ఎన్నిక ఓటమి తరువాత  తన వ్యూహం మార్చారు. దూకుడు పెంచారు. అదే సమయంలో ఇటీవలి మా ఎన్నికల్లో పరాయజయం పాలయిన ప్రకాశ్ రాజ్ కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఇద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకులే. వ్యవసాయ చట్టాలను  వ్యతిరేకించిన వారే. ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న తరువాత  ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని సారి చెబితే సరిపోతుందా ? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.  ఆయన మోడీ పై చేసిన వ్యాఖ్యలు విస్తృత ప్రచారం పొందాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: