కొత్త సీసా లో పాత సారా ? ఫేస్ బుక్ పేరు మార్పునకు కారణం ఇదేనా ?

ఫేస్ బుక్... సోషల్ మీడియా దిగ్గజం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇది అంగీకరంచాల్సిన నిజం. ఈ మీడియా దిగ్గజానికి కోట్లాది మంది ఫాలోయర్లు ఉన్నారు. అంతకు మించి అభిమానులున్నారు. కానీ ఈ  కంపెనీకి  పేరు ఎంత ఉందో అంత ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. ఫేస్ బుక్ వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అరోపణలున్నాయి. యూజర్ల డేటాను ట్రాక్ చేస్తున్నదని కూడా  చెడ్డ పేరుతెచ్చుకుంది. భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో ఈ సంస్థ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోంటోంది కూడా.  తరచుగా  పేస్ బుక్  న్యాయ పరమైన అంశాలకు సంబంధించిన వార్తలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత రీతిలో వెలువడుతున్నాయి. ఈ నేపథ్యం ఫేస్ బుక్ వాడకం దార్ల పై ( యూజర్ల పై) పడుతోందని  ఆ సంస్థ సి ఈఓ  మార్క్  జుకర్ బర్గ్  భావించారు. అంతే కాకుండా  ఫేస్ బుక్  కు అనుబంధంగా పని చేస్తున్న మిగతా కంపెనీలన్నింటినీ ఒకే గొడుగు క్రిిందకు తీసుకురావాలని  అభిలాషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఈ వార్తలను   ఫేస్ బుక్ దృవీకరించింది కూడా. అదే సమయంలో ఫేస్ బుక్ సంస్థ లో కొంత కాలం పనిచేసి వెలుపలికి వచ్చిన ఉన్నత స్థాయి ఉద్యోగి ఒకరు చేసిన పని వల్ల కూడా ఫేస్ బుక్ తీవ్రంగా నష్టపోయింది. ఆ మాజీ ఉద్యోగి ఏకంగా కొన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తాయి.
దీంతో  ఫేస్ బుక్  సి ఈఓ  మార్క్  జుకర్ బర్గ్  కొత్త సాంకేతికత పై దృష్టి పెట్టారు. ఆ దిశగా అడుగులు వేశారు. గతంలో ఆయన ప్రకటించిన మెటావర్స్ సాంకేతిక కు మరింత పదును పెట్టారు. ఇందు కోసం వేలాది మంది సాంకేతిక నిపుణులను  తమ  కంపెనీలో చేర్చుకున్నారు.  నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. అయితే అవి ఇంకా పరిశోధనల దశను దాట లేదు కూడా. ఇంత లోనే  సంస్థ సి ఈఓ  మార్క్  జుకర్ బర్గ్  ఫేస్ బుక్ పేరును  మార్చుతున్నట్లు  ప్రకటించారు.  దాదాపుగా ఆరు నెలల క్రితం పేరును మారుస్తున్నట్లు  జుకర్ బర్గ్ ప్రకటించగానే నెటిజన్ లు పెద్ద ఎత్తున స్పందించారు. నూత న సాంకేతికత ఏంటా ? అని ఆసక్తి కనబరిచారు. ఫేస్ బుక్ పేరును మారుస్తున్నట్లు ప్రకటించ గానే  కొన్ని ఒడిదుడుకులను కూడా ఆ సంస్థ ఎదుర్కోంది.  గత రెండు నెలల్లో ఫేస్ బుక్, దాని అనుబంధ సంస్థల్లో  సాంకేతిక లోపం ఏర్పడింది.   దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా  యూజర్ల పై పడింది.  లక్షలాది మంది  తమ సామాజిక మాధ్యమ ఖాతాలను మార్చుకున్నారు. భారత్ లోనూ  చాలా మంది  ఫేస్ బుక్ అనుబంధ సంస్థ  వాట్సప్ నుంచి టెలిగ్రామ్ యాప్ లోకి మారారు.
ఫేస్ బుక్  తాజాగా మెటావర్స్ సాంకేతికత ను అందిపుచ్చుకుని 'మెటా ' పేరు మార్చుకున్నా... ఖాతా దారులకు కొత్త చేకూరే ప్రయోజనలు ఏంటి అనేది ఇంకా జనబాహుళ్యం లోకి రాలేదు. ప్రస్తుతానికి ఇది కొత్త సీసా లో ఉండే పాత సారా  అన్న సామెతను గుర్తు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: