కోవాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి రాకపోవచ్చు

కోవాక్సిన్ కు  ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి రాకపోవచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ  (డబ్ల్యూ హెచ్ ఓ)భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈ యుఎల్)  అత్యవసర వినియోగం అనుమతి మంజూరులో జాప్యంపై పలువురు ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకాలం ఎందురు అనుమతులు లభించ లేదని , ఎక్కడ బ్రేక్ పడుతోందని వారు ఆరా తీస్తున్నారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో సహకరించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్) మాత్రం ఈ విషయంలో కీలక ప్రకటన చేసింది. ఈ సమస్య డబ్ల్యూ హెచ్ ఓ కు , భారత్ బయోటెక్ మధ్య ఉందని పేర్కొంది.
టీకాను అభివృద్ధి చేయడంలో కౌన్సిల్ సహాయం చేసినప్పటికీ, ఈ సమస్యడబ్ల్యూ హెచ్ ఓ కు  టీకా తయారీ కంపెనీ మధ్య ఉందని ఐసిఎంఆర్ ఎపిడెమియాలజీ , ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ సమీరన్ పాండా అన్నారు. "ఇది శాస్త్రీయ,  నాణ్యత-సంబంధిత సమస్యలను పరిశీలించే ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఏదో తప్పు ఉందని మేము నిర్ధారణలకు వెళ్లకూడదు," అని  ఆయన అన్నారు.
సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ గిరిధర బాబు మాట్లాడుతూ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ విధివిధానాలు,  డాక్యుమెంటేషన్ సహేతుకమైన ప్రమాణాలతో ఉన్నాయని నిర్ధారించడానికి వారు నిర్మాణాత్మకంగా  వ్యవహరిస్తారు. అందుకోసం  మరి కొందరు సబంధికులతో కలసి కలిసి పనిచే స్తారన్నారు
"కోవాక్సిన్‌తో టీకాలు వేసిన లక్షలాది మంది ఆశలు ఇక్కడ ప్రమాదంలో ఉన్నాయి,  ప్రపంచ ఆరోగ్య సంస్థ కు అనుబంధంగా ఉన్న నిపుణుల కమిటీ నిర్వహిస్తున్న వరుసవెంబడి సమావేశాలు చాలా  పకడ్బందీగా ఉన్నాయి. ఈ ప్రక్రియ  ప్రక్రియపై చాలా కీలకమైంది. వేగవంతమైన ఆమోదం పొందడం కోసం కంపెనీ ట్యాగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని నేను  భావిస్తున్నాను," అని అతను చెప్పారు.
కోవాక్సిన్  విస్తృత ఉపయోగం కోసం తుది  ఈయూఎల్ ప్రమాద ప్రయోజన అంచనాల  వివరాలను డబ్ల్యూ హెచ్ ఓ కోరింది. ఆ సంస్థ సాంకేతిక సలహా కమిటీ గతవారం భారత్ బయోటెక్ నుండి అదనపు డేటాను కోరింది.
 కోవాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్‌లో ట్రయల్ డేటా మరియు రెడ్ ఫ్లాగ్‌లలో "అస్థిరతలు"గా పేర్కొన్నదానిని సమగ్రంగా సమీక్షించడంలో ఆశ్చర్యం లేదనిఆల్ ఇండియా డ్రగ్స్ యాక్షన్ నెట్‌వర్క్ కో-కన్వీనర్ మాలినీ ఐసోలా తెలిపారు. కొంతమంది నిపుణులు ఇంతకుముందు జనవరిలో కోవాక్సిన్‌కు హడావుడిగా మంజూరు చేసిన ఆమోదంపై ప్రశ్నలు లేవనెత్తారనికూడా ఆమె చెప్పారు. భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి వ్యాక్సిన్‌కు ఆమోదం లభించినప్పుడు అనేక సమస్యలు తలెత్తాయి. వాటిని విస్మరించలేం అని మాలినీఐసోలా స్పష్టంగా  చెప్పారు.. "కేవలం కొన్ని సమస్యలకు  అడ్డుకట్ట వేయడానికి  ఫేజ్-1 ట్రయల్‌ జరిగింది. ఎక్కడ ఎలా ప్రయోగాలు జరిగాయి. అందులో పాల్గోన్న వారి సంఖ్య. దీనిని ఎస్ఈసి కి అందించారా? అది స్పష్టంగా ఉందా ? లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక ఫేజ్ -2 పరీక్షలు వేగవతం చేయడంలో కూడా చాలా మార్పులు చేశారు,  ఇందులో  కంట్రోల్ ఆర్మ్ పడిపోయింది. వాస్తవానికి ఫేజ్-2  పరీక్షల ఫలితాలు అన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఫేజ్-3  పరీక్షల సమయానికి కూడా  ఫేజ్-2 ఫలితాలు సిద్ధం కాలేదు అని అమె వివరించారు.


కాగా భారత్ బయోటెక్  అతి త్వరగా ప్రపంచ ఆరోగ్యసంస్థ అడిగిన అన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నవబంర్ 3వ తేదీ డబ్ల్యూ హెచ్ ఓ సాంకేతిక సలహా మండలి మరోసారి సమావేశం అవుతుంది. ఆ లోపు అన్ని వివరాలు మండలికి అందితేనే అనుమతి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: