మా పోరు : నాన్నే గెలిచాడు!

RATNA KISHORE
ఇండ‌స్ట్రీలోకి వెళ్లాలి..అంద‌రిలానే క‌ల‌లు.. చిరు కూడా ఇలాంటి క‌ల‌ల‌తోనే వ‌చ్చాడు. మంచు ఇంటి వార‌సుడు కూడా ఇలాంటి క‌ల‌లే క‌న్నాడు. సీమ కుర్రాడు క‌దా ! కొంచెం దూకుడు. చిరు నెమ్మ‌ది. నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఇద్ద‌రూ హీరో విలన్ క్యారెక్ట‌ర్ల‌ల్లో ఇర‌గ దీశారు. ఆ విధంగా మోహ‌న్ బాబు అనే పేరు క‌లెక్ష‌న్ కింగ్ అనే బిరుదు ఇండ‌స్ట్రీలో స్థిరం అయి పోయి కొన్నేళ్లైంది. ఇన్నేళ్లుగా వ‌ర్గ పోరాటం కూడా చేస్తున్నాడు మోహ‌న్ బాబు. మ‌ధ్య చిరుతో క‌య్యం ఆడినా అవేవీ ప‌ట్టించుకోకుండా మెగాస్టార్ అనే కిరీటాన్ని ఆయ‌న మోస్తూనే ఉన్నాడు. కానీ క‌లెక్ష‌న్ కింగ్ అన్న పేరు కొన్ని త‌ప్పిదాల కార‌ణంగా పోయింది. ఇవ‌న్నీ అటుంచి ఆలోచిస్తే స్వ‌యం కృషీవ‌లుడు చిరు..అలానే స్వ‌శ‌క్తిన‌మ్ముకున్న మోహ‌న్ బాబు కూడా ఎన్నో పాత్ర‌ల‌తో మెప్పించాడు.


త‌న పంతం నెగ్గించుకోవాల‌న్న ఒకే ఒక్క కార‌ణంతో నిన్న‌టి వేళ త‌న వాళ్ల‌నంద‌రికీ పిలుపు ఇచ్చి, పోలింగ్ సెంట‌ర్ కు ర‌ప్పించి., త‌న కొడుకు గెలుపున‌కు అన్నీ తానే అయి  నిలిచాడు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా, నిర్మాత‌ల స‌పోర్టు లేకున్నా ఇవాళ్టికీ అదే పంతంతో బండి లాగుతున్నాడు. ఆ బండి ని ముందుండి న‌డిపే శ‌క్తి కొడుకుల‌కు ఇంకా రావ‌డం లేదు. అదే ఆయ‌న‌కు పెద్ద త‌ల‌నొప్పి. ఉన్న ఆస్తులు క‌రిగిపోయినా, విద్యా సంస్థ‌లు న‌ష్టాలు చ‌విచూస్తున్నా ఆయ‌న మాత్రం పాత పొగ‌రును, కొత్త కోపాన్ని వ‌ద‌ల‌డు. మంచు విష్ణు ఇంకా ఆ స్థాయి చేరుకోలేదు. చేరుకున్నంత వ‌ర‌కూ నాన్న ఇచ్చిన గెలుపును త‌న గెలుపు అని అనుకోవ‌డం ఓ విధంగా ఆయ‌నకో ఉప‌శ‌మ‌నం కావొచ్చు. కానీ అదే ప‌ర‌మావ‌ధి కాకూడ‌దు. పెద్ద రాయుడు చెప్పిన మాటల్లో కొన్ని మంచివి ఉన్నాయి.. వాటిని పాటించే ఆస‌క్తి విష్ణుకు ఉందో లేదో?


చిత్తూరులో ఓ చిన్న ఊరు.. దాని దాటి వ‌చ్చిన ఓ కుర్రాడు.. ఆయ‌న కూడా వేషాల కోసం వేళాపాళాలేకుండా తిరిగాడు. త‌ల్లీ తండ్రీ వ‌ద్ద‌న్నా కొన్ని ప‌నులు చేసి, న‌టుడిగా స్థిర‌పడ్డాడు. దాస‌రి శిష్యుడు మోహ‌న్ బాబు. ఈవిధంగా  మీరు ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ల‌కండి. పొంగిపోతాడు. ఇండ‌స్ట్రీలో ఉన్నంత మంచి, ఉన్నంత చెడు అన్నీ అంద‌రిలోనూ ఉంటాయి. మంచి చెడుల‌లో ఏ గుణం ఒకింత ఎక్కువ‌గా ఎవ్వ‌రిలో ఉంటే వారు వార్త‌ల్లో నిలుస్తారు. మోహ‌న్ బాబు వార్త‌ల్లో నిలిచాడు. కొడుకు ను మా అధ్య‌క్షుడ్ని చేయాల‌న్న ఆశలో భాగంగా బ‌రిలో దిగాడు. ఆయ‌న‌ను విజేత‌ను చేయాల‌న్న తంల‌పుతో ఆఖ‌రు దాకా పోరాడాడు. త‌న ప‌రిచ‌యాలు అన్నింటిని వినియోగించుకున్నాడు.


ఇండ‌స్ట్రీని వ‌దిలిపోయిన హీరోయిన్ల‌ను ర‌ప్పించాడు. మాలాశ్రీ ఎవ‌రికి గుర్తు. జెనీలియా వ‌స్తుంద‌ని అనుకున్నారా. పోనీ! జ‌య‌ప్ర‌ద. ఇవేవీ జ‌రిగే ప‌నులు కావు. రికార్డు స్థాయి పోలింగుకు ఇవ‌న్నీ స‌హ‌కారం అందించాయి. పోలింగ్ అయిపోయాక కూడా రిలాక్స్ కాలేదు. కౌంటింగ్ సాఫీగా సాగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్న‌మేదో సీనియ‌ర్ న‌టులు ముర‌ళీ మోహ‌న్ తో క‌లిసి చేశారు. మోహ‌న్ బాబు గ‌తంలో కొన్ని త‌ప్పులు చేశారు. కానీ కొడుకు గెలిచే వ‌ర‌కూ పెద్ద‌గా నోటికి ప‌ని చెప్ప‌లేదు. మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు. రెండు టెలివిజ‌న్ షోల‌కు వెళ్లారు. అలీలోనూ, ఆంధ్ర‌జ్యోతి ఆర్కేతోనూ ఎంతో ప‌ద్ధ‌తిగా మాట్లాడి వ‌చ్చారు. ఇవి త‌ప్ప ఆయ‌న పెద్ద‌గా ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. స‌హ‌జ సిద్ధం అయిన ఆవేశంలో భాగంగా ఆయ‌న కొంద‌రు స‌భ్యులపై అరిచారు. మ‌రి! ప్ర‌కాశ్ రాజ్ అంత ఘోరంగా ఎవ్వ‌రిపైనా కామెంట్లు విస‌ర‌లేదు. నోరు పారేసుకోవ‌డం అన్న‌ది ప్ర‌కాశ్ రాజ్ లాంటి వారే చేస్తే, మోహ‌న్ బాబు లాంటి సీరియ‌స్ మ‌నుషులు, సీనియ‌ర్ న‌టులు చేయ‌డంలో త‌ప్పేం లేదు. ఇప్పుడు పెద‌రాయుడు ప‌రిశ్ర‌మ‌కు దొరికాడు. ఆ  రాయుడి రూలింగ్ ఎలా ఉంటుందో మ‌రి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: