జనసేనలో తెలుగు దేశం విలీనం..?

తెలుగు దేశం మళ్లీ జనసేన వైపు చూస్తోంది.. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి పనిచేయబోతున్నాయా.. ఇటీవల పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ పరిణామాలకు సంకేతాలుగా భావించాలా.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లో వినిపిస్తున్న డిస్కషన్‌ ఇది. జగన్‌ను ఎదుర్కోవాలంటే.. తెలుగు దేశం, జనసేన విడివిడిగా సాధ్యం కాదన్న విషయం రెండు పార్టీలు కూడా గ్రహించాయన్న వాదన వినిపిస్తోంది. తాజాగా బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి రెండు పార్టీలూ జంకిన విషయం మరోసారి దీన్ని రుజువు చేస్తోంది.

ఇదే సమయంలో ఈ రెండు పార్టీల దోస్తీపై వైసీపీ మంత్రులు అప్పుడే విమర్శలు ప్రారంభించారు. తెలుగు దేశాన్ని జనసేనలో కలిపేయాలని మంత్రి కొడాలి నాని చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. చంద్రబాబునాయుడు ఏది చెబితే దానికి గంగిరెద్దులా తలూపుతూ, ఆయన నేర్పే మాటలు వింటూ, వాటినే చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటున్న కొడాలి నాని.. జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేయాలని సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు వల్ల, ఆయన పుత్రుడు లోకేష్‌ వల్ల, ఆ పార్టీని నడుపుతున్న రెండు మూడు ఛానళ్ల అధిపతుల వల్ల కావడం లేదని కొడాలి నాని సెటైర్ వేశారు.

అందువల్ల తెలుగు దేశాన్ని జనసేనలో విలీనం చేస్తే కమ్మవారికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కొంత మంది వ్యక్తులకు పవన్‌కళ్యాణ్‌వల్ల మేలు జరుగుతుందేమో అంటున్నారు. అందుకని దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేయండి.. దాంతో దరిద్రం వదులుతుంద అని సెటైర్లు వేస్తున్నారు కొడాలి నాని. దత్తపుత్రుడు పవన్ ప్రసంగాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు నాని.

ఎవరైనా పార్టీ పెడితే అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు అండగా ఉంటామంటారని.. కానీ జనసేన పవన్‌కళ్యాణ్‌ మాత్రం కమ్మ వారికి అండగా ఉంటానని చెబుతున్నాడని కొడాలి నాని అంటున్నారు. మా కమ్మవాడు చంద్రబాబునాయుడు సన్నాసి అని చెప్పి పవన్‌కళ్యాణ్‌ డిసైడ్‌ అయినట్లు ఉన్నాడన్న నాని.. మా రాధాకృష్ణగారు, మా బీఆర్‌ నాయుడుగారు.. మా కమ్మ వాళ్లను ఉద్ధరించడానికి ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు, పేపర్లలో, టీవీల్లో  కమ్మవారిని ఉద్ధరించడానికి రాష్ట్రంలో చాలా బలంగా పని చేస్తున్నారని.. కానీ వాళ్ల వల్ల కావడం లేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: