డ‌బ్బున్నోడి డ్ర‌గ్ : ఆర్య‌న్ క‌థ ఏం చెబుతోంది?

RATNA KISHORE

స్టార్ అయిన షారుక్ త‌న కొడుకును ఉద్దేశించి  ఏమీ మాట్లాడ‌డం లేదు. స్టార్ అయిన శ్రీ‌దేవి త‌న కుమార్తె ను ఉద్దేశించి ఏమీ మాట్లాడ‌లేదు.. ఒక‌టి వ‌ర్త‌మానం.. రెండు గ‌తం.. గ‌తం, వ‌ర్త‌మానం మ‌ధ్య కాలం కూడా ఇలానే ఉంది. అర్థ‌ర‌హిత కాలం అని రాయాలి. ఇప్పుడు డ‌బ్బులున్నాయి క‌నుక కాలాన్ని కొన‌లేరు క‌దా! కానీ వ్య‌క్తిత్వం అన్న‌ది ఒక‌టి నిలుపుకుంటే చాలు. బాగా డ‌బ్బున్న బిడ్డ‌లు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారంటే వార్త‌ల కోసమా..లేదా త‌ప్పిదాల దిద్దుబాటు కోస‌మా?



బాగా సంపాదిస్తే కెరియ‌ర్ వ‌స్తుంది. క్యారెక్ట‌ర్ వ‌స్తుందా లేదా అన్న‌ది త‌రువాత‌. అమ్మానాన్న సంపాద‌న‌తోనే కెరియ‌ర్ బాగు ప‌డుతుంది కూడా! కొంద‌రికి. పుట్టుక మ‌న చేతిలో లేని నిర్ణ‌యం క‌నుక డ‌బ్బు అన్న‌ది త‌రువాత వ‌చ్చి యాడ్ అవుతుంది.


డ‌బ్బులు మ‌న జీవనాన్ని ప్ర‌భావితం చేస్తాయి. వ్య‌క్తిత్వంలో మార్పులు తెస్తాయి. డ‌బ్బులు కార‌ణంగా ప‌బ్బు క‌ల్చ‌ర్లు వ‌స్తున్నాయి. డ‌బ్బులు కార‌ణంగానే పిల్ల‌ల‌కు తెలియ‌ని నేరాలు కూడా ప‌రిచ‌యం అవుతున్నాయి. డ‌బ్బులు త‌మ ద‌గ్గ‌ర ఎంతుండాలి అన్న‌ది ఓ వ్య‌క్తిత్వ సంబంధ విలువ‌. డ‌బ్బులు దాచుకోవ‌డం, విసిరేయడం కాదు ఏ విధంగా పిల్ల‌ల‌కు వాటిని పంచ‌గ‌ల‌గాలి అన్న‌ది కూడా తెలియాలి. దానం, ధ‌ర్మం అన్న‌వి  ఎవరెవ‌రి ఇష్టంపైనో ఆధార‌ప‌డి ఉంటాయి.. అవి కాదు కానీ వ్య‌క్తిత్వం అన్న‌ది నిర్మాణంలో ఉన్న త‌ప్పులను ఎలుగెత్తుతుంది. క‌నుక డ‌బ్బులు అన్న‌వి జాగ్ర‌త్త‌. ప్ర‌ముఖుల పిల్ల‌ల‌కు విదేశీ చ‌దువులు వ‌స్తాయేమో కానీ భార‌తీయ‌త మాత్రం అల‌వ‌డ‌డం లేదు.



ఇండ‌స్ట్రీ అంటే అస్స‌లు కోపం లేదు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అన్న‌ది అన్ని ఇండ‌స్ట్రీల్లాంటిదే అన్న చిన్న కన్స‌ర్న్ నాలో ఉంటుంది. ఉండాలి కూడా! కానీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ గా నిలిచి, మంచి పేరు తెచ్చుకోవాల్సిన వాళ్లు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. డ‌బ్బులు ఉండ‌డ‌మే ఇంత‌టి నేర‌మ‌య జీవితానికి ఓ కార‌ణం అని చెప్ప‌డం ఉద్దేశం కాదు కానీ ఒక క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కార‌ణంగానే వీళ్లంతా చీక‌టి రాజ్యంలో మ‌గ్గిపోతున్నారు.  ముంబ‌యి దారుల్లో త‌మ విలువ‌లు లేని జీవితాల‌ను గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డుతున్నా రు.

డ‌బ్బులుంటే షారుఖ్ ఖాన్ లు రారు. ఆమీర్ ఖాన్ లు రారు..కేవ‌లం డ‌బ్బుంటేనే ఇవి సాధ్యం కావు. డ‌బ్బుతో పాటు ప్ర‌తిభ కూడా ఓ తోడు. ఆర్య‌న్ క‌థ కూడా ఇలాంటిదే. ఆయ‌న బాగా చ‌దువుకున్న వాడు. చ‌దువు ప‌ని నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్క‌డి క‌ల్చ‌ర్ కు అనుగుణంగా డ్ర‌గ్ క‌ల్చ‌ర్ ను అల‌వాటు చేసుకుని, ఇండియాకు వ‌చ్చాడు. మ‌రి! ప్రముఖుల పిల్ల‌ల‌కు ఈ స‌మాజానికి ఏం నేర్పుతున్నారు. ఏం నేర్చుకుంటున్నారు. వివాహ బంధాల్లోనూ, న‌డ‌వ‌డిలోనూ ఇత‌ర త‌గాదాల్లోనూ బాగా డబ్బున్నోళ్ల పేర్లే ఎందుకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే డ‌బ్బు కొన్ని విలువ‌ల‌ను నేర్పదు. కొన్ని విలువ‌ల‌ను వ‌దులుకునేలా చేస్తుంది క‌నుక‌!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: