పోస్ట‌ర్ ఫ్రేమ్ : ల‌వర్ స్టోరీ చూశాను బాగుంది

RATNA KISHORE
శుక్ర‌వారం సంద‌ళ్ల‌లో ఉన్నాను. థియేట‌ర్ కు పోయాను. శుక్ర‌వారం దిగులులో ఉన్నాను. నెలాఖ‌ర‌కు, సినిమా టికెట్ కు జీఎస్టీ తోడు (వందకు మ‌రో 12 రూపాయ‌లు అద‌నం). శుక్ర‌వారం  ఆనందంలో ఉన్నాను. ప్ర‌తి శుక్ర‌వారం ఇండ‌స్ట్రీలో 300 కుటుంబాల‌కు అన్నం పెడుతుంది. మ‌రో 3 ల‌క్ష‌ల కుటుంబాల‌కు అన్నం పెట్టేందుకు స‌హ‌కారం అందిస్తుంది. శేఖ‌ర్ స‌ర్‌, చైత‌న్య పింగ‌ళి, పాట రాసిన మిట్ట‌ప‌ల్లి సురేందర్, శేఖ‌ర్ కూ నాకూ బాగా తెలిసిన వేటూరి(ఈ సినిమాలో పాట రాయ‌లేదు అని అనుకోకండి.. ఆయ‌న ఏం రాయించినా వేటూరిని దృష్టిలో ఉంచుకుని,రిఫ‌రెన్స్ తీసుకుని రాయించ‌న విధంగానే ఉంటాయా పాట‌లు) ఇంకా ఇంకొన్ని. నా స్నేహితులు, ఆర్టిస్టు శేష బ్ర‌హ్మం స‌ర్ కూడా!



మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ పాట రాశారు. మిగిలిన వాళ్ల పాట క‌న్నా ఈ పాట బాగుంది అని అనుకున్నాను. కానీ రీచ్ ఇంకా ఎక్కువ ఉండాల‌ని కోరుకున్నాను. సినిమా చూస్తుంటే చిత్రం చేసిన ప్రేమ, ప్రేమ చేసిన చిత్రం ఇవేవో మెద‌లాడుతున్నాయి. కొన్ని అనున‌య స్వరాలు (ఇంగ్లీషులో ఫాలోయింగ్ నోట్స్) ఎంత బాగున్నాయో పాట ఆలాప‌న అంత బాగుంది. కొన్ని పాట‌లు స‌న్నివేశాల‌కు అద‌న‌పు బ‌లం. రాజా స‌ర్ అలాంటి ప‌నులు ఎన్ని చేశారో..మ‌ణి స‌ర్ అలాంటి ప‌నులు ఎన్నింటిని చేయించారో! ఈ సినిమాకూ ఓ  ప్ర‌జా క‌వి సాహిత్యం బాగా ఉప‌యోగ‌ప‌డింది. బాగుంది. అశోక్ తేజ పాట గురించి నేనెప్పుడో చెప్పాను..క‌నుక ఆ వివాదం గురించి మాట్లాడ‌ను. సింగ‌ర్ కోమ‌ల ఎక్క‌డున్నారో అని టైటిల్స్ లో ఆమె పేరు చూస్తూ చూస్తూ అనుకున్నాను.



సినిమా పరంగా క‌థ‌లు కాక‌ర‌కాయ‌లూ ఉంటాయి. అంటే చేదు తీపి ఉంటాయి. క‌థ తీపి అని చెప్ప‌ను. క‌థ చేదు అని చెప్ప‌ను.అలాంటివి రాయ‌ను. చ‌దువుకున్న‌వాణ్ని క‌దా! ఆ విధంగా రాయడంలో అర్థం లేదు. కొన్ని సున్నిత ఉద్వేగాల‌ను శేఖ‌ర్  బాగా ప‌లికించ‌గ‌ల‌రు. ప‌ద్మారావు  న‌గ‌ర్ పార్కు చూడ‌గానే న‌వ్వుకున్నాను. సికింద్రాబాద్ ప‌ద్మారావు న‌గ‌ర్ చాలా ఫేమ‌స్. నేను ఒక సారి శేఖ‌ర్ తో ఫోన్లో మాట్లాడాను.  గోదావ‌రి త‌రువాత మ‌ళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాంతంలో తిరుగాడిన అనుభ‌వం గుర్తుకు వ‌చ్చింది. ఆ విధంగా శేఖ‌ర్ న‌చ్చుతాడు. అంత బిల్డ‌ప్ ఏమీ ఉండ‌దు. కానీ తాను ఎంచుకున్న క‌థ‌ల‌కు ఇంకాస్త క‌థ‌న రీతి మార్చుకుని సినిమాలు తీయాల‌ని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అమ్మాయి చైత‌న్య పింగ‌ళి ఈ సినిమాకు ప‌నిచేశారు. గ‌తంలోనూ శేఖ‌ర్ సినిమాల‌కు ప‌నిచేశారు ఆమె. నాకు ఈ అమ్మాయి విఖ్యాత జ‌ర్న‌లిస్టు ద‌శర‌థ్ రామ్ గారి అమ్మాయిగానే గుర్తు. సినిమా రైట‌ర్ గా నేను పెద్ద‌గా గుర్తించ‌ను.



సినిమాలో పాట‌లు న‌డ‌వ‌డి నేను బాగా ప్రేమించాను. నాంచార‌య్య స‌ర్ అన్న విధంగా నేనేం అన్ సివిల్ వ‌ర్డ్ వాడ‌లేదు కానీ ఆ పిల్ల‌ను ప్రేమించాను.. క‌నుకనే పింపుల్ పిల్ల అని రాశాను. ఎవ‌రు గొప్ప అన్న మాట ద‌గ్గ‌ర న‌వ్వుకున్నాను. సినిమా చూశాక ఎందుకంటే చై బాగా చేశాడు. తొలిసారి.. సాయి ప‌ల్ల‌వి చాలా బాగా చేసింది మ‌రోసారి. ఈ రెండూ ప్రూవ్డ్ వర్డ్స్. కొత్త పిల్ల‌లు తెర‌పై కొంద‌రు క‌నిపించారు. వాళ్లంతా శేఖ‌ర్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు. ప‌ద్మారావు న‌గ‌ర్ ను చాలా బాగానే వాడుకున్నారు శేఖ‌ర్ .. త‌ను నిరంతరం తిరిగేది, క‌థ‌లు రాసుకునేది, మ‌నుషుల‌ను ప‌రిశీలించేది అక్క‌డే క‌దా! ఏమ‌యినా నాకు చాలా ఆనందం ఇచ్చిన విషయం ఈ సినిమాను మెగాస్టార్ మోశాడు. త‌ప్పు అండ‌గా నిలిచాడు. ప్ర‌భాస్ కూడా మోశాడు.. త‌ప్పు ఆనందంగా త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాడు. ఇద్ద‌రు తారల‌ మ‌ధ్య పొందిన వెలుగు ఇది శేఖ‌ర్..ఆనందించాలి మీరు.. ఆనందించాలి నేను. నాకు మీ సినిమాలు కొన్ని డాక్యుమెంట‌రీల్లా అనిపించేయి. ఈ సినిమా ఆ భావ‌నను కొద్దిగా త‌గ్గించింది. ఇక‌పై పూర్తిగా  తొల‌గిపోయేందుకు మీరు కృషి చేయాలి. మీ సినిమాకు పాట రాయాలి అన్న కోరిక‌నో లేదా మాట స‌హ‌కారం ఇవ్వాలి అన్న తాప‌త్ర‌యమో ఏమీ లేవు  కానీ మ‌రిన్ని మంచి పాట‌లు మీరు రాయిస్తే నేను మీకు త‌ప్ప‌క అండ‌గా ఉంటాను. అవును! నాలాంటి  అండ‌తోనే మీరంతా ఇంకా పెద్ద‌వాళ్లు కావాలి.  చిరు అన్న విధంగానే మీ బ‌క్క చిక్కిన దేహం  మీ న‌వ్వే మీ ఐడెంటీస్ వీటిని మార్చ‌కండి. కానీ మిమ్మ‌ల్ని మీరు మ‌రికొంచెం మార్చుకోండి. లైన్ బాగుంది స‌ర్ సున్నిత భావోద్వేగాలు రాశారు కానీ వాటి కొన‌సాగింపు ముగింపు బాగాలేవు. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టం బాగా చెప్పాల‌న్న త‌ప‌న ఇంకొంత మీలో క‌లిగితే చాలు ఆనందిస్తాను. సినిమాను విమ‌ర్శించ‌డం, ప్రశంసించ‌డం ఇలాంటి ప‌నులు చాలా మంది చేస్తారు బ‌ట్ నా వ‌ర‌కూ తోచిందే రాస్తాను. రంగులు క‌లిపి మీ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయ‌ను. అవును! మీకు న‌చ్చే గ‌ల్లీ క్రికెట్ , వాన ఉన్నాయి కానీ ఈ సారి వాన మీదే ఒక పాట ఉంటే ఎంత బాగుండేది.. శ్రేయా ఘోష‌ల్ లాంటి మంచి సింగ‌ర్ ఆ పాట పాడితే ఇంకెంత బాగుండేదో! ఏమ‌యినా ఈ త‌రం కాస్త నేర్చుకోద గ్గ మంచి డైరెక్ట‌ర్ మీరు కావాలి. ఆల్ ద బెస్ట్ శేఖ‌ర్.



- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: