టి.డి.పి కి , జనసేనలకు మరో ఎదురు దెబ్బ

టి.డి.పి కి , జనసేనలకు మరో ఎదురు దెబ్బ
తెలుగుదేశం పార్టీకి  మరో సారి గట్టి  ఎదురు దెబ్బ తగిలింది. వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ  పార్టీకి తాజాగా తగిలిన దెబ్బ ఎంతకు దారి తీస్తుందో వేచి చూడాలి.  నష్ట నివారణ చర్యలు ఎలా ఉంటాయి అన్నది తాజాగా పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ.తెలుగుదేశంం పార్టీ జాతీయహోదాను రద్దు చేస్తూ, ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. టిడిపి ని కేవలం ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది.  ఇది సహజంగానే తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ లో  ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్ర ఎన్నిక ల సంఘంలో నమోదు చేసుకోవాలి.  ఏ రాజకీయ పార్టీ అయినా స్వయంగా తమది జాతీయ పార్టీనా అన్నది ఎన్నిక ల సంఘం ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక సారి నమోదు చేసుకుని మిన్నకుండి పోతే కుదరదు. ప్రతి ఏటా నమోదు తప్పని సరి.  పార్టీ అధినేత కాని, అధినేత తరపున  వకాల్తా పుచ్చుకున్న వాళ్లు గానీ ఎన్నికల సంఘంలో సవివరంగా  అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చాలా ఉంటాయి.  ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ఎన్నికల సంఘం తాకీదులు ఇస్తుంది.
 ఈ సీ తాజాగా భారత్ లో నమోదయిన పార్టీల వివరాలు, వాటి స్థాయిని వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం కొన్ని ప్రాంతీయ  పార్టీలకు జాతీయ హోదా లభించగా, మరి కొన్నిపార్టీల జాతీయ హోదాని తగ్గించి ప్రాంతీయ పార్టీలుగా గుర్తిస్తున్నరట్లు తా జా పేర్కొంది. హోదా కొల్పోయిన జాబితాలో  రెండున్నర సంవత్సరాల క్రితం వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో  అధికారం వెలగబెట్టిన టిడిపి కూడా ఉండడం గమనార్హం. 1983్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలోకూటమిని ఏర్పాటు చేశారు. నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి , కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కేంద్రంలో అధికారం వచ్చేలా తనవంతు కృషి చేశారు. ఆ తరువాత  పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్న  మాజీ ముఖ్యమం్రతి నారా చంద్రబాబు నాయుడు కూడా దేశ రాజకీయలాను ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయనే ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పుత్రరత్నం లోకేష్ టిడిపికి  జాతీయ ప్రధాన కార్యదర్శి.  వీరి హోదాలు ఎలా మారుతాయో చూడాలి.
గుర్తింపు లేని పార్టీగా జనసేన
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉంటే  జనసేన పార్టీ పరిస్థితి మరోలా ఉంది.   జనసేనను గుర్తింపు లేని పార్టీగా ఎన్నికల సంఘం ప్రకటించీంది.  అంతేకాదు ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ను కూడా ఫ్రీ సింబల్  జాబితాలోకి మార్చింది. అంటే ఈ  గుర్తును ఏ స్వతంత్ర అభ్యర్థి అయినా కోరుకోవచ్చు.
 దేశంలో గుర్తింపు లేని రాజకీ పార్టీలు 2,796 ఉన్నాయి. ఆ జాబితాలో జనసేన కూడా చేరింది. భారత్ లో 27 రాష్ట్రాలలో 57 ప్రాంతీయ పార్టీలున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎం.ఐ.ఎంలకు  ప్రాంతీయ పార్టీ హోదా ఉన్నట్లు ప్రకటించింది.  కాగా  ఇప్పటి వరకూ జాతీయ పార్టీలుగా ఉన్న సి.పి.ఎం., సిపిఐ,  కాంగ్రెస్, ఎన్.సి.పిలు  తమ జాతీయ పార్టీ హోదాను నిలబెట్టకున్నాయి. పశ్చిమ బంగాల్ లో అధికారాన్ని తిరిగి దక్కించుకుున్న తృణముల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హోదాను  దక్ఖించు కోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: