ఓవర్ టు ఓటీటీ : ఇకపై స్టార్లు ఉండరు? భ‌లే మార్పు!

RATNA KISHORE
కొన్ని మాత్రం ప్ర‌తిబంధకం అవుతాయి. కొన్ని ప్ర‌వాహాలు అయ్యాయి. ప్ర‌వాహం కొన్ని సార్లు ముంచెత్తి పోయింది. కొన్నిసార్లు నేల‌ను సార‌వంతం చేసి పోయింది.. కానీ ఊహ అలాంటి ప్ర‌వాహాల‌ను ఎన్నింటిని నిలిపిందో ! ఇంకెన్నింటిని కొట్టి పారేసిందో! ఏ దేమైన‌ప్ప‌టికీ అంద‌మైన ఊహ‌కు రంగు సినిమా రూపం సినిమా...రంగు రూపం వ‌చ్చేక దాచే స్థలం ఓటీటీ ఇప్పుడు.. ఒక‌ప్పు డు ప్ర‌ద‌ర్శించే స్థ‌లం థియేట‌ర్. క‌నుక అదృష్ట వ‌శాత్తూ న‌టులు రానున్నారు. ఆనందించాలి మీరు. ఆ విధంగా సినిమా జీవితం ఇప్పుడు మార‌బోతోంది. గుర్తుపెట్టుకోండి  సినిమా వాళ్ల జీవితం కూడా! ఇప్ప‌టికే రెండూ వేర్వేరు. ఇక‌పై ఒక్క‌టే!


త‌ప్పు ఎక్క‌డో  జ‌రిగిపోయాక హీరోలు దిద్దుకుంటున్నారు. ఆ కార‌ణంగానే అకార‌ణంగానో కొన్ని సినిమాల‌కు ప్లాట్ ఫాం మేం అవుతాం అని పెద్ద హీరోలు పెద్ద మ‌న‌సుతో చెబుతున్నారు. అంతా బాగుంది అని చెప్పి కొంత వ‌ర‌కూ సినిమాను నిల‌బెడుతున్నారు. థియేట‌ర్ పోయాక కాదు కాదు ఏదో ఓ విధంగా త‌న మ‌నుగ‌డ‌పై నీలి నీడ‌లు క‌మ్మేసుకున్నాక  ఓటీటీ వ‌చ్చి ఎంద‌రినో ఆదుకుంది. ఇంకొంద‌రికి అన్నం పెట్టొచ్చు అన్న సందేశం ఇచ్చి పోయింది. కనుక సినిమా కు స్టార్లు అవ‌స‌రం లేదు.
మంచి న‌టులు కావాలి, స్టోరీ కావాలి అని పాత కాలం రోజుల‌కు ఆధునిక టెక్నాల‌జీ ప‌ట్టుకుని పోయి మ‌రీ చెప్పింది. నేర్పింది. క‌నుక ఇక‌పై స్టార్లు ఉండరు. న‌టులు త‌యారు అవుతారు. ఇప్ప‌టిదాకా అలాంటివారు లేరు. ఉంటే ఉండొచ్చు కొన్ని ప్ర‌మాణాల వ‌ర‌కూ!




న‌టుడు అనే ప‌దం ద‌గ్గ‌ర మ‌న హీరోలు ఆగిపోవాలి. కొన్ని ఎక్స్ ప్రెష‌న్స్ వ‌రకే వీరంతా అని తేల్చారు కొంద‌రు. అవును! నిజ‌మే వీటిని ఫైనెట్ ఎక్స్‌ప్రెష‌న్స్ అంటారు. అనాలి. అలా సినిమా కూడా కొన్ని లిమిటేష‌న్స్ లోనే ఉంది. కాదు ఉంచారు. దాస‌రి, రాఘ‌వేంద్ర‌రావు ఉంచారు. ఉంచ‌డం మూలంగా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్స్ వ‌చ్చి ఆడాయి. వ‌చ్చి పోయాయి. మేం ఇదే చూస్తాం అని అరిచిన హీరోల అభిమానులు  ఉన్నారు. ఏదైయినా  చేయండి మేం చూస్తాం అని అర‌వ‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఉన్నాడు.
మ‌రి! ఏ టేస్ట్ లేని లేదా తెలియ‌ని లేదా తెలుసుకోని  ఆడియ‌న్స్ ఉన్నారా?

 
నాలుగు పైస‌లు తీసుకువ‌చ్చే సినిమా నాలుగు కాదు న‌ల‌భై రూపాల‌లోకి మార్పు చెందుతోంది. ఎప్పుడో  మాట‌లు రాని ద‌శ నుంచి మాట‌లు వ‌చ్చి, డీటీఎస్ లో కూత‌లు నేర్చుకుని, త‌రువాత త‌రువాత వృద్ధి చెందిన సినిమాకు వ్యాపారం ఎంతో ముఖ్యం.వ్యాపారం అంటే ఇది క‌ళ క‌దండి క‌నుక క‌ళాత్మ‌క వ్యాపారం అని రాయాలి అని చెప్పారు. పోనీ అలానే అనుకుందాం. ఆ లెక్క‌న చూసుకున్నా నాలుగు డ‌బ్బుల కోసం నాలుగు కాదు న‌ల‌భై త‌ప్పులు చేస్తున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మంచి క‌ళ కాస్త త‌ప్పిపోయింది. మంచి క‌థ కాస్త మారిపోయింది. ఏమీ లేకుండానే సినిమాలు ఫార్ములాల‌తో న‌డిచిపోయాయి. త‌రువాత అవి దిద్దుబాటుకు నోచుకున్నాయా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: