బియ్యంలో ఇవి కలుపుతారు... మీకు తెలుసా

బియ్యంలో ఇవి కలుపుతారు... మీకు తెలుసా
మనం రోజూ తినే వరి అన్నంలో ఇక నుంచి ఇతర ఆహార పదార్దాలు కలుస్తాయి. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందజేస్తున్న బియ్యంలో పోషకాలు కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలిపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసే బియ్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. యధావిధిగా ఎప్పటిలాగానే రైతుల వద్ద నుంచి ధాన్యం ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే తిరిగి ప్రజలకు పంపిణి చేసేటప్పుడు మాత్రం పోషకాలు కలుపుతారు. ఇవి అచ్చం బియ్యంలాగే ఉంటాయి. సజ్జలు, రాగులు, జొన్నలు తదితర గింజలను పొడి చేేస్తారు. అదే విధంగా నూకలనూ పొడి చేస్తారు. ఈ రెండింటినీ మిళితం చేసి మరలా బియ్యం లాగా కృత్రిమంగా తయారు చేస్తారు. అచ్చం వరి బియ్యాన్ని పోలి ఉండటంతో చూసేందుకు ఎలాంటి మార్పుు ఉండదు.  ఒక కిలో కృత్రిమ బియ్యాన్ని, ఒక క్వింటాలు వరిబియ్యంలో కలుపుతారు. ఆ తరువాత మాత్రమే సదరు బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేేస్తారు. దేశ వ్యాప్తంగా 2020-21 ఖరీఫ్ సీజన్ లో సేకరించే ధాన్యం పంపిణీ నుంచి ఈ మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. తప్పని సరిగా ఈ సూచనలు అమలు చేయాలని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15 న ప్రసంగంలో దేశ ప్రజలందరికీ బలవర్దకమైన ఆహారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. దీంతో అధికార గణం ప్రధాని సూచలను అమలు చేసే పనిలో  పడింది.  తదనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పు చేసింది.  భారత్ లో ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నల పోషకాహారాన్నితయారు చేసే మిల్లులున్నట్లు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: