మార్నింగ్ రాగా : దేశాన్ని ప్రేమిస్తూ నేను...........

RATNA KISHORE
ఫ‌స్ట్ కాజ్ :  నేడు మ‌హాక‌వి గుర‌జాడ జ‌యంతి.. ఆయ‌న ప్ర‌బోధాత్మ‌క గీతాల ఆవ‌ర‌ణ‌లో..ఒక స్మ‌ర‌ణ
అకడిమిక్ గా ఈ రోజు గురజాడ జయంతి అని తొలి వాక్యం సంధించలేను..కనుక ఏవో తోచిన మాటలు కొన్ని ఈ మార్నింగ్ రాగా లో..అయినా! అలాంటి స్థలం కాలం విశేషం..పూర్వ వ్యాకరణ ధర్మం నేపథ్యం ఇవన్నీ వివరిస్తే. అది మార్నింగ్ రాగా కాదు కనుక అలా రాయను.. ఆనందిస్తూ నేను.. ప్రవచిస్తూ నేను.. అనంత అవధి బిందువు చెంత.. ప్రాగ్దిశ కాంతి రేఖ స్పర్శల్లో పునీతుడ్ని నే ను..పులకిత శోభితం కూడా నేనే! మట్టి ని తాకాకే ఈ చైతన్యం మీలో..! అని ఎవ్వరన్నా పొంగిపోతాను.. మా ఊరి గాలులకు ఆ గుణం ఇచ్చిన దైవిక శక్తికి సామాజిక వ్యుత్పత్తులకూ, సంబంధిత శక్తులకూ వందనాలు చెల్లించే వేళ ఇది.. భాష మరింత విస్తృతి లో ఉంటే దేశం అంటే ఏంటన్నది ఎవరికి వారు పొందే నిర్వచనం. అలాంటి వేళకు ఆహ్వానం. గురజాడకు వందనం.

ఏమీ తెలియని చోటు దేశం ఎలా ఉంది.. నిగర్వంగా ఉంది. అన్నీ ఉన్న చోట కాంతి ఎలా ఉంది.. కొన్ని తలవొంపులను వదులు కుంటే మేలు అని అనుకునేలా ఉంది. సర్.. దేశం అంటే..మీరిచ్చిన జ్ఞానం కాదు అనుకుంటాను..మేం పొందని అజ్ఞానమే ఈ దే శం.. అవధి నేను అయితే అంతర్థానం అవ్వనివి ఏమయి ఉంటాయి. అంతరార్థ భావంలో  స్నేహం, ప్రేమ, మట్టి, మనిషి ఈ నాలు గూ నాలుగు అర్థాలు పోగేసుకున్నాయి. అంటే నవ్వు  ఒక అర్థం అయితే ఏడుపు అనర్థం అయి తీరాలి! అని అనుకుంటూ నవ్వు కున్నాను నేను. నేను పొందిన ఈ కొద్ది పాటి ఆనందాలే నా దేశం. నా విస్తృతి అని కూడా నిర్థారించాను. ఈ మార్నింగ్ రాగా నుంచి నేర్చుకున్నవారంతా పెద్దవాళ్లయ్యారు. నేర్పేవాడు మాత్రం ఇంకా ఎన్నటికీ చిన్నవాడే! అవును! ప్రాంతం ఒక స్పృహ భాష..ఓ.. సస్యందన వీచిక..అని రాయాలి. బాగా చదువుకున్న వాడు రాజుల ప్రాపకంలో ఉంటే గురజాడ అవుతాడా?

తెలియదు కానీ ఎక్కడో చదివేనే అయితే అవ్వాలి. అందుకే అడిగాను మంచి పూలనే ప్రేమించానా సర్ అని! అవును మంచి పూ లను ప్రేమించి గమనంలో మీరున్నారు అని చెప్పారు. నేను గమనం మాత్రమే గమ్యం గురజాడ కావొచ్చు., ఇంకొకరు అవధి కావొ చ్చు. అవధిని నిర్ణయించే శక్తి ఈ దేశానికి లేదు. ఈ ప్రపంచానికీ లేదు. గురజాడ తన అవధిని తాను నిర్ణయించుకుని ఉంటారా? జీవితావధి అన్నది నిర్ణయం కానీ జ్ఞానం సంబంధిత ఆలోచన, ప్రతిపాదన అన్నవి అవధికి ఆవల.. ఆ తీరానికి ఆవల..
గురజాడ నా ప్రాంత ఆత్మ గౌరవం.. మా ఇంటి పెద్ద. పెద్ద దిక్కు రాయాలి. దిక్కులు తేల్చాక మాత్రమే ప్రయాణం సౌలభ్యం అన్నవి తెలుస్తాయి చదివేను. ఉరుములు, మెరుపులు జీవితాన దిక్కులు తేల్చాయి..దారులు తేల్చాయి అని కూడా చదివేను. అవును! దిక్కు గురజాడ.. దారి దీపం ఇప్పటి నాలో వెలుగు.. ఇవి అఖండం అని రాయను తప్పు సర్! కానీ అఖండం అయిన చోట నేనుంటాను. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురించి చెప్పాడు.. పొంగిపోయాను.. నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి.. ఎప్పుడో చదివేను ఎందుకనో ఈ మాటలే ఎన్నడూ జ్ఞప్తిలో ఉంటాయి. రెండు వాదాలు ఉంటాయి అని చదివేను..
సంస్కరణ వాదం. రెండు సంస్మరణ వాదం.. ఈ రెండూ జీవితాన్ని నడిపిస్తాయి.. సంస్కరణకు నోచుకున్న వేళ మార్పు నినాదం..సంస్కరణ పూర్వం జీవితం ఓ చీకటి వివాదం.. అవును! దేశాన్ని నిర్వచించే క్రమాన  ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. వాటిని దా టితేనే దేశం ఔన్నత్యం కానీ సమగ్ర తత్వం కానీ అర్థం అవుతాయి. అప్పటిదాకా మంచి పూలనే ప్రేమించాలి మీరు.. ఆ వేళ పలక రిస్తే ఆనందించాలి నేను.. ఆనందించాలి మీరు..

ఉషోదయ విజ్ఞానంలో మార్నింగ్ రాగా రాస్తున్నాను. విజ్ఞానం అంటే ఏమీ తెలియదు చెప్పకపోవడం. అంతా తెలుసు అని ఒప్పు కోక పోవడం. దీనిని సుకృతం అని చెప్పండి. మీరేం చెప్పినా అది సుకృతమే కదా! అవును! పండిత జనం చెంత గెలిచిన వాడు.. పామర జనం దగ్గర పేరొందిన వాడు.. మా ప్రాంతంలో ఈయన ఎవ్వరు? ఈ దేశానికి ఏమిచ్చారు అని అడిగితే.. ప్రబోధాత్మక గీతం లో ఒక స్వరం వచ్చి తట్టిలేపింది. చైతన్యం చివరి కొన ఒకటి పాద స్పర్శలకు కొత్త అడుగులు నేర్పింది. నేర్పడం అంటే విజ్ఞానం.. అది విజ్ఞాన దాయకమా? తెలియదు! నేర్పడం ముళ్ల దారి నేర్చుకోవడం పూల దారి.. ముళ్లను ప్రేమించాక మనుషులు పూలను ఏరి కోరి నెత్తిన పెట్టుకుంటారు.
నా దారిలో దేశమంటే ఏంటి అన్న ప్రశ్న నుంచి ఉత్పాతం వరకూ..ఉత్పతనం వరకూ నేనే ఉన్నాను. కొన్ని మాత్రమే శ్వాసకు కొ త్త ఊహలు అందిస్తాయి. ఊహా శ్వాస.. నిశ్వాస.. నిర్ఝరి.. ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్తుంటే శబ్దం లేని చోటు అర్థగతం..అర్థం లేని చోటు భావగతి అయి ఉంటుందా అని నాలో ప్రశ్న. మహనీయుల పాదాలను తాకిన స్పర్శ రేఖ మహిమాన్వితం అవుతుందా! అని అనుకుంటాను. వీరుల ఊపిరి నీది.. నీవు వెనక్కు చూడకు అని చెప్పారు ఒకరు ఎంత ఆనందించానో.. మా ప్రాంతం నుంచి కవిత్వం వస్తుంది సర్.. అది మాత్రమే నా జీవ ధార అని చెప్పానా సర్.. కానీ నా గుండె లయలకు అవి కొన్ని అర్థాలు చెప్పి పో యాయి.. రెండుగా ధ్వనించాయా అవి.. అంటే శ్లేషార్థం అని భావించాలి నేను.. సాధ్యమా? కొన్ని సార్లు నివాళి కొన్నింటికి ఆరంభ సూచిక. స్మరణ నుంచి చేసే ప్రయాణంలో పొందే ఆనందం..జాతి జాగృతికి వినియోగం అయితే మేలు. అప్పుడొక యోగం సము న్నతి.. ఒక వాదం సంస్కరణ కావొచ్చు. కాగలదు.
- రత్నకిశోర్ శంభుమహంతి  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: