ఇది ప్రభుత్వ పోరాటం

ఇది ప్రభుత్వ పోరాటం
తమిళనాడు చరిత్రలో ఇది మరో కీలక మలుపు.  సుధీర్ఘకాలం జరుగుతూ వచ్చిన సాగతీతకు ముగింపు పడిన సందర్భం. పాలక వర్గ ముఠా ప్రయోజనాలను ఎదుర్కోంటూ, ప్రభుత్వ ఆస్తిని పరిపక్షించిన అధికార గణం సాధించిన  విజయం.  ఒక విధంగా చెప్పాలంటే తన అస్థిత్వం నిలుపుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం చేసిన పోరుబాట. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు రెండు దశాబ్దాలపాటు జరిపిన న్యాయ పోరాటం.


చెన్నై మహానగర శివార్లలో సెంజేరి ప్రాతంలో అన్యక్రాంత మైన 91 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని చివరకు అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాన్ని కాపాడేందుకు అధికారులు దాదాపు 20 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఈ స్థలం విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయల పై చిలుకే. ఈ విజయంతో తమిళనాడులోని అధికార యంత్రాంగంలో ఒక్త ఊపు వచ్చింది. చెన్నై- మహాబలిబలిపురం రహదారి ( ఓ.ఎం.ఆర్ రోడ్డు)లో సెమంజేరి వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాల్లో జెపిఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ 91 ఎకరాలకు పైగా ఆక్రమించింది. పలు నిర్మాణాలను చేపట్టింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు సంస్థకు నోటీలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రంగమే న్యాయపోరాటానికి దిగింది. ఆక్రమణదారుగా ఉన్న ట్రస్టు కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం చేసిన న్యాయం పోరాటం సరైనదేనని చెంగల్ పట్టు జిల్లా కోర్టు తీర్పు నిచ్చింది. ప్రభు త్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వివిధ పై కోర్టుల్లో అభ్యంతరాలను దాఖలు చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. రెండు దశాబ్దాల కాలంలో తమిళనాడులో రాజాకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రులు మారారు, మంత్రులు మారారు. గవర్నర్లూ మారారు,. ఇక కలెక్టర్లయితే చాలా మందే మారారు. కాని అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి ఒత్తిడికి తలఒగ్గకుండా న్యాయపోరాటం చేసిం విజయం సాధించింది. 2012లోనేే అన్యక్రాంతమైన ఈ స్థలం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు. మారిన కాలానికి అనుగుణంగా ప్రస్తుత ధర రెండు వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.


కాంచీపురం జిల్లా పరిధిలోకి వచ్చే  సెమంజేరి  ప్రాంతం లో  గత కొన్ని సంవత్సరాలుగా పలు ఐటి హ బ్  లు వెలిశాయి.  లక్షలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.  చాలా చాలా టౌన్ షిప్ లు కొొత్తగా  రూపుదిద్దుకున్నాయి.  ఆక్రమించిన ప్రాంతంలో ట్రస్టు  కళాశాలలకు అనుబంధంగా  హాస్టళ్లను నిర్మించి ఉంది. వీటిల్లో విద్యార్ధినులు ఉంటున్నారు. వీరందర్నీ ఖాళీ చేయించేందకు  అధికారులు ట్రస్టుకు సమయం ఇచ్చారు. నగరంలో పలు చోట్ల ఖాళీగా ఉన్న భవనాలను విద్యార్థినులకు కేటాయించారు. సదరు  స్థలంలో ప్రభత్వ యంత్రాంగ  ఆక్రమణదారులు శిక్షార్హులని  బోర్డు కూడా ఏర్పాటు చేసింది. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలాన్ని  చూసి రావాలని  తన మంత్రి వర్గ సహచరులకు  సూచించారు. అంతే కాక ఈ  ప్రభుత్వ పోరాటాన్ని కలెక్టర్లందరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు.  అన్యక్రాంతమైన ప్రభత్వ స్థలాల జాబితాను సిద్ధం చేయలన్నారు. వాటిని తిరిగి  ప్రభుత్వం ఖాతా లోకి  రాబట్టు కునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి స్థాలిన్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: