దేవుడా! : వైసీపీలో స్వామిభ‌క్తి హ‌ద్దు దాటుతోందా?

RATNA KISHORE
ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వింత రాజ‌కీయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పి పెట్టేందుకు చాలా మంది రం గంలోకి  దిగుతున్నారు. ఈ క్ర‌మంలో వీరంతా లెక్క‌కుమించి స్వామి భ‌క్తి చాటుకుంటున్నారు. గ‌తంలో బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ లాంటి వారు ఇలాంటి స్వామి భ‌క్తినే చాటుకున్నారు. త‌రువాత కాలంలో టీఆర్ఎస్ గూటికి చేరి ఇప్పుడు ఆయ‌న ఆర్టీసీ చైర్మ‌న్ అయిపో యారు. ఇదే త‌రుణంలో జూపుడి గురించి చెప్పుకోవాలి.

ఆయ‌న కూడా అంతే గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున తొలుత వైసీపీ త‌ర‌ఫున మ‌ళ్లీ ఇప్పుడు జ‌గ‌న్ త‌ర‌ఫునే మాట్లాడ‌డం ఇదంతా స్వా మి భ‌క్తిలో భాగం అనుకోవ‌డం త‌ప్ప ఏం చేయ‌లేం. గతంలో స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించిన వారిలో రోజా కూడా ఉన్నారు. ఆఖ‌రికి ఆమె కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. అసెంబ్లీ వేదిక‌గా ఆమె చంద్ర‌బాబు వ‌య‌సును కూడా చూడకుండా ఎన్నో మాట‌లు, అవ‌హేళ‌న‌లు చేశారు.

ఇదంతా విప‌క్షంలో ఉండ‌గా ఆమె చేసిన ప‌నులు. అధికారంలోకి రాగానే ఆమె హ‌వాను పూర్తిగా త‌గ్గించేశారు జ‌గ‌న్. పెద్దిరెడ్డి త గాదాలు కార‌ణంగా ఆమె మున‌ప‌టి వేగాన్ని చూపించ‌గ‌లేక అవ‌స్థ పడుతున్నారు. జ‌గ‌న్ కేటాయించిచ‌న ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద వీ కాలం కూడా అయిపోయింది. కొత్త‌గా ఆమెను వ‌రించిన ప‌ద‌వులు ఏమీ లేవు. ఉండ‌వు కూడా! క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగినా పె ద్దిరెడ్డిని త‌ప్పిస్తారేమో కానీ ఆ స్థానాన్ని రోజాతో భ‌ర్తీ చేయ‌రు. ఇప్పుడు ఇదే కోవ‌లో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, జోగి ర‌మేశ్ లాంటి నాయ‌కు లు చేరుతున్నారు. వీరంతా అయ్య‌న్న‌పైనా, చంద్ర‌బాబుపైనా క‌య్యానికి కాలు దువ్వుతున్నారు. గ‌తంలో జ‌గ‌న్ త‌ర‌ఫున బ‌ల‌మై న గొంతుక వినిపించిన నెల్లూరు లీడ‌ర్ అనీల్ కూడా ఇలానే అసెంబ్లీ వేదిక‌గా వీరావేశాన్ని ప్ర‌ద‌ర్శించి త‌రువాత త‌గ్గిపోయారు. ఇ ప్పుడు చంద్ర‌బాబును తిట్టి స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తాం అనుకునే వారికి మంత్రి ప‌దువులు ద‌క్కుతాయా లేదా తిట్ల‌కే వీరు ప‌రిమిత మా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: