క్వాడ్ సదస్సుకు ముందే...?

క్వాడ్ సదస్సుకు ముందే...?
క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్.. క్వాడ్ గా పిలిచే ఈ స్ట్రాటజిక్ ఫోరం మరోసారి భేటీ కానుంది. సెప్టంబర్ 24 న భేటీ జరగనున్ననేపథ్యంలో అంతకు ముందుగాన్ అమెరికా ప్రభుత్వం , భారత్ పై తన ఒత్తిడిని పెంచింది. కోవిడ్-19 ను ఎదుర్కోనేందుకు అవసరమైన వ్యాక్సిన్లను తమ దేశానికి అధికంగా ఎగుమతి చేయాలని, ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించాలని అమెరికా మనదేశాన్ని అభ్యర్థిస్తోంది. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో పలు మార్పులు తీసుకువచ్చారు. అవి  ప్రవాస భారతీయులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా, వ్యాక్సిన్ల సరఫరా విషయంలో పట్టుపడుతోంది.
ఐక్యరాజ్య సమితి కోవాక్స్ కార్యక్రమానికి భారత్ ఇప్పటికే 8.6 కోట్ల టీకాలను పంపిణీ చేస్తోంది. వర్దమాన దేశాల ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే టీకాల కొరతను అధికమించాలన్నది భారత్ వాదన. అందుకు అనుగుణంగానే దేశంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయితే స్వదేశంలో అవసరాలు తీరకుండా, విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయరాదన్నది కేంద్ర ప్రభుత్వం పెద్దల వాదన.  ఇందుకు అనుగుణంగా వ్యాక్సిన్ ఎగుమతులపై కొంత నిషేధం ఉంచింది. ప్రస్తుతం అగ్ర రాజ్యం అమెరిగా భారత్ పై ఒత్తిడిని పెంచింది. తమ దేశంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉండటం, చట్టాలను సరిగా అమలు చేయలేక పోవడం జరుగుతున్నదని, ఫలితంగా కోవిడ్ బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతున్నదని అమెరికా పేర్కొంటోంది. తమ దేశంలో జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తి తమ అవసరాలకు తగినంతగా లేదని కూడా అగ్రరాజం ప్రతినిధులు భారత్ కు తెలిపారు.


ఈ క్వాడ్ లో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాలుగు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 2007 లో అప్పటి జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే  ఈ నాలుగు దేశాలు సభ్యులుగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు క్వాడ్ ని ఏర్పరిచే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో చైనా ఒత్తిడితో ఆస్ట్రేలియా కాస్త వెనుకంజ  వేసింది. చివరకు అమెరికా ఒత్తిడికి తలవోగ్గి సభ్యదేశమైంది. కాలగమనంలో  ఈ దేశాధినేతలు సమావేశమయ్యారు. విశ్వమానవాళి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని పదే పదే తన ప్రసంగాలలో సెలవిస్తుంటారు. అదే సమయంలో భారతీయుల యోగ క్షేమాలే తన మొదటి ఫ్రాధాన్య అని కూడా సెలవిస్తుంటారు. ప్రస్తుతం అమెరికా ఒత్తిడికి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి మరి !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: