ప‌ట్టించుకోడు జ‌గ‌న్ ! : కాగ్ గోల కాకి గోల !

RATNA KISHORE
ఒక ప్ర‌భుత్వం ఆదాయాన్ని అంచ‌నా వేయాలి. ఖర్చుకు లెక్క చెప్పాలి. లెక్క‌లో ఉన్న డొల్ల‌త‌నం కార‌ణంగా అవి కాకి లెక్క‌లు అవుతాయి. సంబంధిత ప‌ద్దుల‌కు కార‌ణం చెప్ప‌కుండా ఉంటే అవి నిధుల గోల్ మాల్ వ్య‌వ‌హారం కింద కూడా ప‌రిగ‌ణించి  స్కామ్ కు ఉన్న కార‌ణం ఏంటి అన్న‌ది కూడా తేల్చాలి. ఏపీ లో స్కామ్ ఉంది.కానీ అది ఆర్థిక నేరం అని అనలేం. డ‌బ్బులు ఊర‌కే ఇస్తే అవి నేరాలు కాక ఇంకేం అవుతాయి అంటే ప్ర‌భుత్వం ఉచితం అని చెప్పి పంపిణీ  చేసే ప్ర‌తి  రూపాయీ కూడా నేరం కిందే వ‌స్తుంద‌ని ఎప్పుడో చంద్ర‌బాబు టైంలోనే ఆర్థిక నిపుణులు తేల్చారు. ఆయ‌న‌కు కూడా రుణ మాఫీ వ‌ద్ద‌నే అన్నారు. ఈయ‌న‌కు కూడా ల‌క్ష కోట్ల సంక్షేమ ప‌థ‌కాలా ఎందుకు అనే ప్ర‌శ్నించారు? ఈయ‌న ఇప్ప‌టిదాకా సంక్షేమం పేరిట  రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తే కేంద్రం ఔరా! అన్న‌ది. ఇక‌పై చేసే సాయంలో కోత‌లు ఇవ్వాల‌ని త‌న‌కు తాను నిర్ణ‌యం తీసుకుంది. అందుకే ఉపాధి నిధులు రావు. సంబంధిత బిల్లు పెండింగ్ ఉంది. ఇంకా ఇంకొన్ని రావు ఎందుకంటే కేంద్రంకు ఇలాంటివి న‌చ్చ‌వు క‌నుక‌!

భ్ర‌మ‌లు వీడాక వాస్త‌వాలు అన్న‌వి తేట‌తెల్లం అవుతాయి. ఆదాయం అంతా అప్పులకూ, వ‌డ్డీల‌కూ, పింఛ‌న్ల‌కూ, వేత‌నాల‌కూ, ప‌థ‌కాల‌కూ, వాటి అమ‌లుకూ కేటాయిస్తే దానిని మొత్తం క‌లిపి రెవెన్యూ ఖ‌ర్చు అనే అంటార‌ని, అభివృద్ధి అని వ్య‌వ‌హ‌రించ‌రు అని ఆర్థిక నిపుణులు చెప్పిన విధంగా ప్రముఖ మీడియా ఉటంకించింది ఇవాళ. క‌నుక సంప‌ద కాపాడుకునే దృష్టి కానీ సంప‌ద పెంపొందించేందుకు చేయాల్సిన సృష్టి కానీ సంబంధిత దృక్ప‌థం కానీ మ‌న పాల‌క వ‌ర్గంలో లేవు అని తేలిపోయింది.. అని జ‌గన్ ను ఉద్దేశించి టీడీపీ చెబుతున్న మాట. అయిన‌ప్ప‌టికీ  కొన్ని లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఆర్థిక శాఖ‌లో ఎన్నో ఆంక్ష‌లు ఉన్నా కూడా కాగ్ లెక్క‌లు మాత్రం గ‌తం క‌న్నా ఇప్పుడు ఆదాయం మెరుగుద‌ల‌లో లేదు అని చెప్పినా జ‌గ‌న్ ఒప్పుకోరు. అదంతా అబ‌ద్ధం అని తేల్చి కాగ్ గోల - కాకి గోల అని తేల్చేస్తారు.

ఎవ్వరు ఏమ‌నుకున్నా ఎలా ఉన్నా ఏమ‌యిపోయినా సంక్షేమ ప‌థ‌కాలు ఆగ‌వు. అది తేలిపోయింది. ఇంకేం ఆదాయం ఎలా ఉ న్నా అప్పుల పుట్ట అలానే ఉన్నా మ‌నం ప్ర‌భుత్వం నుంచి ఆశించాల్సిన‌వి త‌గ్గించుకోం అని కూడా తేలిపోయింది.ఇంకేం చేయాలి? ఇంకేం చేయ‌గ‌లం చెప్పండి ? ప్ర‌భుత్వం ఎంత మేర‌కు సంపాదించింది అన్న‌ది మ‌న‌కు అన‌వ‌స‌రం మ‌న డ‌బ్బు మ‌న‌కు అందిందా లేదా అన్న‌ది ముఖ్యం. అప్పుడు అభివృద్ధి అన్న మాట‌ను ఎలా వినిపించ‌గ‌లం? క‌నుక‌నే మ‌న‌కు కాగ్ గోల కాకి గోల అని.. ఆర్థిక శాస్త్రం మ‌న‌కు చిక్క‌దు. అంతు పోల‌దు కాదు అంతు ప‌ట్ట‌దు ఇప్ప‌టికీ మ‌రియూ ఎప్పటికీ! జ‌గ‌న్ మాత్రం త‌న‌దైన పంథాలో వెళ్తున్నారు. అప్పుల ఊసు బ‌య‌ట‌కు చెప్ప‌వద్ద‌ని అధికారుల‌ను ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. బ‌య‌ట నుంచి తీసుకువ‌చ్చే అప్పులు, భూముల అమ్మ‌కం ద్వారా వ‌చ్చిన డ‌బ్బులు ఇవ‌న్నీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధికే కేటాయిస్తున్నారు అన్న భ్ర‌మ నుం చి ఎవ‌రికి వారు బ‌య‌ట‌కు వ‌స్తే అప్పుడు ఏది నిజ‌మో అన్న‌ది ఏది అబ‌ద్ధ‌మో అన్న‌ది తేలిపోతుంద‌ని టీడీపీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: