సీరియ‌ల్ డ్ర‌గ్ : ఈ ఎపిసోడ్ ఆగ‌దు ?

RATNA KISHORE
డ్ర‌గ్స్ కేసులో గ‌తంలో మాదిరిగా ఇప్పుడు ఏడుపులు లేవు. ఏంటో నవ్వులు విన‌ప‌డుతున్నాయి. త‌ప్పు చేశాం అన్న భావ‌న‌లో సెల‌బ్రిటీలు లేని కార‌ణంగా వీరంతా బాగున్నారు. లేదా బాగుండేందుకు వీరికి రాజ‌కీయ శ‌క్తుల అండ‌దండ‌లు ఉన్నాయి. గ‌తంలో మాదిరిగా విచారం లేని న‌టీన‌టులంతా ఒకేసారి ఈడీ ఆఫీసుకు వ‌చ్చి పోయి, బండ్ల గణేశ్ లాంటి వారంతా వేసే జోకుల‌కు న‌వ్వుకుని పోతున్నారు. ఇంకేం ఉంటుంది ఇంత‌కుమించి..మీరు ఏమీ ఆశించ‌కండి. స్టార్లంతా ఇలానే ఏవో త‌ప్పులు చేసి ఏ చీక‌ట్లోనో పోలీసుకు క‌న‌ప‌డినా ఏం చేయ‌లేం. ఎందుకంటే అది చీక‌టి.. మీరు అలా వెళ్లిపోండి ప‌క్క‌దోవ నుంచి! పోలీసు అరిచినా,
ఈడీ అరిచినా కొన్ని ప‌నులు ఆగ‌డం లేదు ఈ దేశాన‌! ఇదే ధోర‌ణి ఉన్నంత కాలం ఈ కేసు సీరియ‌ల్ మాదిరి కొన్నేళ్లు న‌డిచి విసిగించ‌డం త‌ప్ప సాధించే పురోగ‌తి ఏమీ ఉండ‌దు.

కొద్ది రోజుల‌లో కెల్విన్ చెప్పేవి అన్నీ నిజాలే అని చెబుతుంది ఈడీ. ఇంకా ఇంకొన్ని సాంపిల్స్ సేక‌రించి ఈ కేసులో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది అని కూడా అంటుంది ఈడీ. ఈ రెండూ జ‌రిగి నిందితులు త‌మ త‌ప్పును ఒప్పుకున్నా కేసు త్వ‌రిత‌గ‌తిన తేల‌దు. త‌ప్పు మీదే కానీ త‌ప్పు చేసేందుకు జ‌రిగిన లావాదేవీలు ఏంటి అని మ‌రో సారి చూసుకోవాలి అని ఈడీ చెబుతుంది. అప్ప‌టి నుంచి ఈ క‌థ మ‌రోసారి మొద‌ల‌యి ఇంకోసారి అంత‌మైపోతుంది. ఈ విధంగా ఈ క‌ళ రాణిస్తూనే ఉంటుంది.

గంగ‌లో ప‌రువు క‌లిసిపోయినా లేదా మిన్ను విరిగి మీద ప‌డినా కొన్ని ఆగ‌వు. టాలీవుడ్ లో డ్ర‌గ్ కేసు అలాంటిది. దీనిని ఎవ్వ‌రూ ఆప‌రు. ఆప‌లేరు. వ్య‌క్తుల బాధ్య‌త గురించి, వారి బాధ్య‌తాయుత న‌డ‌వ‌డి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
టాలీవుడ్ లో డ్ర‌గ్ కేసు కూడా ఇలాంటి వాటికి మిన‌హాయింపు కాదు. కొద్ది రోజులుగా న‌డుస్తున్న లేదా న‌డిపిస్తున్న కేసు విచార‌ణ అన్న‌ది ఏ విధంగా నడుస్తున్నా ఈ కేసు ఇప్ప‌ట్లో ముగియ‌దు. మ‌రో ఈడీ రంగంలోకి వ‌స్తుంది. మ‌రోసారి ఛార్మీ,పూరీ ఇలా అంతా తెర‌పైకి వ‌స్తారు.
ఇంత పెద్ద దేశంలో ఈ కేసు విచార‌ణ కార‌ణంగా విచారించే మ‌నుషులు కూడా త‌క్కువ అయిపోయారు అని బాధ‌ప‌డ‌కండి ఎవ్వ‌రూ? ఈడీ  కేసు మ‌రో సారి తెర‌పైకి వ‌చ్చేలోగానే ఇంకొంద‌రు డ్ర‌గ్ అనే పెద్ద వ్య‌వ‌హారానికి, మ‌నీ ల్యాండ‌రింగ్ అనే పెద్ద నేరానికి ఎప్పుడో అల‌వాటై వెలుగులోకి వ‌చ్చేందుకు సిద్ధం అయిపోతారు. ఎప్పుడో ప్రారంభం అయిన కొన్ని నేరాల‌ను మ‌నం ఇప్పుడు మాట్లాడి నియంత్రించాలి. ఇక ఇప్ప‌టి నుంచి జ‌రిగే లేదా నెల‌కొనే వివాదాల‌కు ఎవ‌రు బాధ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: