విరాట్ కోహ్లీ చిల్లర వేశాలు వేస్తున్నాడా?

Mekala Yellaiah
అగ్రవర్ణాల చెప్పుచేతల్లో ఉంటూ, వాళ్ల రహస్య ఎజెండా అమలుచేస్తుంటారని భావిస్తున్న భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లూ అదే పైశాచికాన్ని ప్రదర్శిస్తున్నారు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహార శైలి అందుకు అద్దం పడుతోంది. ఆయన మైదానంలో ఎన్నోసార్లు వెకిలి చేష్టలు చేస్తూ ఎందరినో ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాడు. నాలుక బయటకు చాపుతూ, గంతులు వేస్తూ కెప్టెన్ హుందాతనాన్ని దిగజార్చుతున్నాడు. స్థాయికి తగినట్టుగా వ్యవహరించకుండా  విచిత్రమైన భావోద్వేగాలతో చర్చల్లో నిలుస్తున్నాడు. 

తాజాగా ఇంగ్లండ్ పై విజయం సాధించిన నేపథ్యంలో ఓవల్ మైదానంలో కోహ్లీ సంబరాలు మళ్లీ అసహ్యించుకునేలా చేశాయి. గ్రౌండ్ లో ఇంగ్లండ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన చేసిన ఒక సంజ్ఞ విమర్శలకు దారి తీస్తోంది. ఇది సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఆయన తీరును విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లండ్ లో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు, మూడు, నాలుగు టెస్టుల్లో భారత జట్టు గెలిచింది. మెదటి టెస్టు వర్షం పడడంతో డ్రాగా ముగిసింది. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆల్ ఔట్ అయింది. వంద వరకు పరుగులు వెనుకబడిన జట్టు రెండో ఇన్నింగ్స్ లో పుంజుకుంది. 466 పరుగులతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. వికెట్ పడిన ప్రతిసారీ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అభిమానుల సంఘం బార్మీ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని ఆయన ఒక సంజ్ఞ చేశాడు. వారిని గేలి చేస్తూ ఇలా చేశాడు. 

ఒక కెప్టెన్ అయి ఉండి చిల్లరగా వ్యవహరించడమేమిటని చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది తన దురహంకారాన్ని తెలుపుతోందంటున్నారు. తన సహచరులంతా వికెట్ తీసినందుకు సంబరాలు చేసుకుంటుంటే, కెప్టెన్ అయిన వ్యక్తి ఇంగ్లండ్ అభిమానులను గేలి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటంటున్నారు. ఒక అగ్రశ్రేణి ఆటగాడు మ్యాచ్ గెలిచినందుకు, ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఆడినందుకు సంతోషపడాలి. అందుకు విరుద్ధంగా అభిమానులను వెక్కిరించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: