తెలంగాణా దారి : జీవితాన్ని మార్చిన మెట్ల పాట

RATNA KISHORE
వినే గీతం నీ జీవితం అని నేర్పారు కొంద‌రు
ఆర్ధ్ర‌త నిండిన జీవితం  
ఒక గొప్ప ప్ర‌యాణానికి సంకేతం అని చెప్పారు కొంద‌రు
విశ్వ‌నాథ కిన్నెర సాని న‌డ‌కలు చెప్పారు
అది కిన్నెర పాట‌లు అల‌సిసొల‌సిన న‌ది చెంత
ఓ గానం ఎలా ఉంటుంది?
వాగు వంక‌ల వ‌య్యారాలు పోయిన
ఆ కిన్నెర చెంత ప‌లుకు ఏ విధంగా
ఉంటుంది?

మొగుల‌య్య‌ను అడ‌గండి జీవితం ఏంటో నేర్పుతాడుసంతల్లో పాడుకునే పాట‌ను అర్థ‌వంతం చేశాడు
అవును! ఆయ‌న స్వ‌చ్ఛ‌మ‌యిన చ‌దువు చెప్పాడు.. స్వ‌చ్ఛ‌మ‌యిన స‌ర్కారు చ‌దువుకు గొప్ప‌ద‌నం ఏంట‌న్న‌ది  నేర్పాడు. పొంగి పోయాను నేను.. 12 మెట్ల పాట.. వింటూ ఆనందిస్తే జీవితం త‌రిస్తుంది. మ‌రి! ఆక‌లి..క‌న్నీరు..వీటిపై కూడా వాడొక చింత‌న‌లో ఉన్నాడు. ఇవి సంత‌ల్లో పాడితే తీర‌వు..వీధుల్లో పాడితే తీర‌వు.. వీరుల గాధ‌ను గానం చేస్తే తీర‌వు..మెట్ల పాట పాడుతూ పోతున్నాడు మొగుల‌య్య.. మొగుల‌య్య కు ఇంటి చుట్టాలు క‌ష్టాలు.. మొగుల‌య్య లింగాల వీడి వ‌చ్చిండు.. కానీ
మ‌ట్టి మోస్తూ మోస్తూ పాట‌ను మాత్రం మ‌రువ లేదు.



మ‌హారాష్ట్ర‌లో ప‌నికి పోతాడు.. పాల‌మూరులో ప‌నికి పోతాడు.. ప్రేమ అనురాగం అన్న‌వి పాట‌లలో కుమ్మ‌రించినంత సులువు కా దు..ఇప్పుడు చాలా మంది ప్రేమ, అనురాగం కుమ్మ‌రిస్తున్న‌రు..విని న‌వ్వేను.. ఆయ‌న‌కు మామిడి హ‌రికృష్ణ సర్ అండ‌గా నిలి చారు. (వీరు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సార‌థి), ఆయ‌న‌కు దాస‌రి రంగా అనే ప‌రిశోధ‌కుడు అండ‌గా నిలిచారు. ఇంకా ఓ ఐదేళ్ల కింద‌ట పోసాని కృష్ణ ముర‌ళి అనే స్టార్ రైట‌ర్ ఆయ‌న‌ను ఆదుకున్నారు. తాజాగా ప‌వ‌న్ ఆయ‌న‌ను పిలిచి పాడించుకుని, రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు అందించారు. పాట వినే సంస్కృతిని మార్పును కోరే సంస్కృతిని ఇంకాస్త పెంపొందిస్తుంది.. న‌దీ ప్ర‌వా హాల చెంత నేనున్నాను..తెలంగాణ పాటల ఏరులో నేనున్నాను. వెన్నెల క‌రిగిస్తే న‌వ్వు అవుతుంది..ఆయ‌న న‌వ్వు అలానే ఉం టుంది.


వీరుల క‌థ చెబితే అమ‌రత్వం ఇంటి  చుట్టం ఎందుక య్యిందో తెలుస్తుంది. మ‌ట్టి రేణువుల చెంత..ఆడే పాట.. పాడే పాట.. ప‌దు గురు కూడే పాట..కూడు పెట్టే పాట.. పాల బువ్వ‌ల పాట.. ప‌సిడి కంకుల పాట..కూడిక‌లకు అంద‌ని పాట..ఈ పాట తెలంగాణ‌లో నాలుగు జిల్లాలో ఉంద‌ని చ‌దివేను.. కిన్నెర పాట ఒక్క మొగుల‌య్యదే కాదు ఆ పాట తెలంగాణది..పాల‌మూరు జిల్లాది.. వ‌న‌ప‌ర్తి ది.. నాగ‌ర్ క‌ర్నూల్ ది..మ‌రొక్క జిల్లా ఏదో ఉంద‌ని విన్నాను.. ఆ ఊరిది కూడా! పాట న‌డ‌యాడు వేళ.. పాట క‌ద‌లాడు వేళ కిన్నె ర తీగ‌ల స‌వ‌రింపు వేళ విన‌వ‌చ్చే స్వ‌రం ఆయ‌న.. ఇంకాస్త ఆదుకుంటే రేకుల ఇంటికి రూపం మారుతుంది.


ఇంకాస్త ఆదుకుంటే జీవితం మ‌రో కొత్త ఆనందాన్ని అందుకుంటుంది.. మొగుల‌య్య బిడ్డ‌ల‌లో ఒక‌రికి మూర్ఛ వ్యాధి ఉంది. నెల కు  నాలుగు వేల రూపాయ‌లు మందుల‌కే వెచ్చిస్తాడు. పాట‌లు పాడుకునే మొగుల‌య్యకు నాలుగు వేలు ఓ పెను భారం. ఆయ న రెండో కొడుకు అత‌డు.. పెద్ద కొడుకుకూ పెద్ద‌గా ప‌నే దొర‌క‌దు. మొత్త ప‌ది మంది కుటుంబం.. ప‌దిమందికీ సంతోషాలు పంచే కుటుంబం క‌న్నీరుకు చేరువ.. క‌న్నీటి న‌దాల చెంత తెలంగాణ పాట కొత్త గుర్తింపు కోరుకోవ‌డం లేదు కాస్త ఆద‌ర‌ణ‌ను ఆర్థిక భ రోసాను కోరుకుంటుంది. సాయం చేసి శ‌భాష్ మొగుల‌య్యా అనండి మ‌రోసారి! జై తెలంగాణ జై కిన్నెర పాట జైజై మొగుల‌య్యా!
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: