థాంక్ యూ కేసీఆర్ స‌ర్ : జై జై గ‌ణేశ్ .. పోతున్నా ఖైర‌తాబాద్ కు!

RATNA KISHORE

దేవుడంటే న‌మ్మ‌కమో విశ్వాస‌మో

ఏదో ఒక‌టి ఆ గొప్ప రూపం

 

ఆ నైరూప్య చిత్తం ఎదుట క‌ళ్లెదుట

 
సాక్షాత్కారం అయ్యే వేళ చ‌వితి చంద్రుడి క‌థ

 
వినే వేళ.. బుజ్జాయిల దేవుడు బొజ్జ గ‌ణ‌ప‌య్య

 
ఒద్దిక‌గా ఉండే వేళ..అదిగో వ‌స్తున్న‌ద‌దిగో!


జేజేలు తండ్రీ.. వంద‌నాలు చెల్లిస్తున్నాను అమ్మ‌నాన్న‌ల‌కు
భాగ్య‌న‌గ‌రి వీధుల్లో..వెలుగుల్లో..వెలుగు వెల్లువ‌ల్లో.. తారా దీప తోర‌ణాల్లో క‌ళ‌క‌ళ‌లాడే మండ‌పం..ఖైర‌తాబాద్ విఘ్నేశుడి మండ పం..ప్ర‌త్యేక‌త‌ల‌కు నిల‌యం.. ఏటా జ‌రిగే సంబరాల‌కు ఎన్నో అవంత‌రాలు ఎదుర‌వుతాయ‌ని ఈ సారి భావించారు. అలా కాకుండా ఉండాల‌ని మొక్కుకున్నారు. మ‌ట్టి మ‌నిషి  మ‌ధ్య బంధం తెగ‌దు. నిజంగానే ఈసారి దేవుడు శాసించాడు.. కేసీఆర్ స‌ర్ అనుమ‌తి ఇచ్చారు. ఆంధ్రా మాదిరి కాదు. ఆయ‌న ఈ సారి  కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వేడుక‌లు జ‌రుపుకోమ‌ని ఆదేశాలు ఇచ్చారు. దీంతో న‌ల‌భై అడుగుల విగ్ర‌హం కొలువు దీరేందుకు స‌న్న‌ద్ధ‌మ‌యింది. చ‌వితి పూజ‌ల వేళ నింద‌లు పోయి నిజాలు నిలిస్తే చాలు అంటా రే! అదే జ‌ర‌గాలి. కానీ కేసీఆర్ స‌ర్ కు ఉన్నంత చొర‌వ జ‌గ‌న్ స‌ర్ కు లేద‌న్న‌ది ఓ విమ‌ర్శ. జ‌గ‌న్ స‌ర్ త‌ప్ప‌క మండ‌పాల‌కు అను మ‌తి ఇవ్వాలి.. పండుగ‌ల‌కు అనుమ‌తి ఇవ్వాలి..పండుగ అంటే సంతోషాల‌కు అనుమ‌తి ఇవ్వాలి.


కానీ దుర‌దృష్టం విగ్ర‌హ త‌యారీ దారుల‌ను ఆయ‌న అరెస్టు చేయిస్తున్నారు. పాపం! అప్పులు చేసి విగ్ర‌హాలు త‌యారు చేసిన ఆ రాజ‌స్థానీ కుటుంబ స‌భ్యుల‌కు జీవ‌నాధారం ఇదే క‌దా! మ‌రి! వారిని ఆదుకోవాలి లేదా ఆప‌న్న హ‌స్తం అందించాలి. కానీ అన్నం దూరం చేయ‌డం ఏంటి స‌ర్.. రంగులు దిద్దే వేళ వారికి ఈ రంగులు మార్చే రాజ‌కీయం అర్థం కావ‌డం లేదు. పోలీసులు వ‌చ్చి త‌మ ను ప‌ట్టుకుని వెళ్తుంటే క‌న్నీరు త‌ప్ప ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారు. ఊరు కాని ఊరు.. ప్రాంతం కాని ప్రాంతం..అయినా ఏదో ఆశ బ‌తికితే చాలు.. ఆశ‌లు స‌జీవం అయితే చాలు..అందుకు జ‌గ‌న్ స‌ర్ ముందుకు వ‌స్తే ఎంతో మేలు. స‌ర్ ! మీరు వారిని ఆదుకోవా లి. అరెస్టులు మాత్రం చేయ‌కండి ప్లీజ్ ప్లీజ్.. ! ఈ విష‌యంలో కేసీఆర్ స‌ర్ ఎంతో ఉన్న‌తంగానే ఉన్నార‌న్న ప్ర‌శంస‌లు తెలంగాణ వాకిట నుంచి వ‌స్తున్నాయి.. మీ అన్న‌య్య కేసీఆర్ అని అంటారు.. ఆయ‌న బాట‌లోనే మీరూ వెళ్లండి జ‌గ‌న్..మీరు వేడుక‌ల‌ను
ర‌ద్దు చేసి ఏం సాధిస్తారు.. విమ‌ర్శ‌లు త‌ప్ప‌! ఆలోచించాలి మీరు.. మా వేద‌న‌ల‌ను గుర్తించాలి మీరు..అవ‌ధులు లేని ఆనందాలు అందించ‌గ రావ‌య్యా గ‌ణేశా! ఓ బొజ్జ గ‌ణ‌ప‌య్య నీ బంటు నేన‌య్యా! సిద్ధి బుద్ధి సమేత గ‌ణ‌ప‌య్య‌కు తొలి వంద‌నం.
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: