పెద్దాయ‌న అంటే ప్రేమ : సామాన్యుల కష్టాలు వీరికి అర్థం అయ్యాయా?

RATNA KISHORE

సామాన్యుడు అనే పదాన్ని గ్లోరిఫై చేసి చూపించడం కొన్ని మీడియా సంస్థలకు చేతనైన పని. కొన్ని మీడియా సంస్థలకు చేతకాని పని. సామాన్యుడు అనే పదం విస్తృతంలో గొప్ప అర్థాన్ని  పొంది ఉంది. కానీ నాయకులకు నాలుగు ఓట్లు రాల్చే యంత్రాలు పరిచయం అయ్యాక వీరికి సామాన్యుడు మరింత చేరువ అయ్యాడా? బ్యాలెట్ బాక్సులు దగ్గర నుంచి ఈవీఎంల వరకు సామాన్యుడు వాడి ప్రభావం అనన్య సామాన్యం మన నాయకులకు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తున్న నాయకులకు సామాన్యు డు అనేవాడు ఓట్లు రాల్చే యంత్రం. రాజశేఖర్ రెడ్డి ఉన్నత కుటుంబం నుంచి వచ్చి సామాన్యుడికి చేరువైన నాయకుడు. పేదల క‌ష్టాల‌ను చూసి చ‌లించిన నాయ‌కుడు. కొన్ని సంద‌ర్భాల్లో తానే చెప్పుకున్నాడు తాను ప‌రివ‌ర్త‌న‌కు నోచుకున్న నాయ‌కుడ్ని అ ని! అంత‌టి స్థాయి ఆయ‌న బిడ్డ‌ల‌కు రాలేదు. రాదు కూడా!

రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలు చేశాకే మంచి నాయకుడు అనే ఒక పరివర్తనకు దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి, రాజశే ఖర్ రెడ్డి స్థాయిలో రాజకీయాలు చేయగలరేమో కానీ ఆయన స్థాయి నాయకులు ఎన్నటికీ కాలేరు. కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ నేచర్ ఒక‌టి తెచ్చిపెట్టుకున్న నైజం మాదిరి ఎన్నడూ ఉండకూడదు. రాజశేఖర్ రెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం ఒక‌టి ముం దు నుంచి చేసినా, పాద‌యాత్ర‌ల స‌మ‌యంలో ఆయ‌న వాటిని పూర్తిగా ఆక‌ళింపు చేసుకున్నారు. ఓ విధంగా ప్ర‌జ‌ల క‌ష్టం త‌న క ష్టం అనే భావ‌న‌కు వ‌చ్చేశారు. రూపాయి డాక్టరుగా రాయలసీమ పరిసర ప్రాంతాలలో మంచి పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ పీపుల్స్ పల్స్ పాద‌యాత్ర‌లో నే ప‌ట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కారణంగానే ప్రేమ గుణాన్ని పెంపొందించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాన్న ఆశయ సాధన గురించి మాట్లాడతారే కానీ ఆయన సామాన్యులకు చేరువయ్యేలా చేస్తున్న పనులు ఏమంత ఫలితాలనివ్వవు. అదేవిధంగా షర్మిలారెడ్డి ఇప్పుడు ప్రజలకు చేరువ కావడానికి తెలంగాణ దారుల్లో పార్టీని నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయ త్నాలు సఫలీకృతం కావాలి అంటే ఆమె మరింత ప్రజలను అర్థం చేసుకోవా లి. ఆత్మ గౌరవ నినాదం ఎన్టీఆర్ విషయంలో రాజశేఖ ర్ రెడ్డి విషయంలో పని చేసినంతగా ఇతర నాయకులకు పని చేయలేదు. ఇక‌ముందూ చేయ‌దు కూడా!

కాస్తో కూస్తో జగన్ విషయంలో ఈ ఆత్మ గౌరవ నినాదం అన్నది పొలిటికల్ స్ట్రాటజీ గా ఆ పని చేసి ఉండవచ్చు గానీ అదేమంత తీ వ్ర ప్రభావాన్ని ముందు ఉన్న కాలంలో చూపే ఆస్కారమే లేదు. పాదయాత్ర ద్వారా షర్మిల కానీ జగన్ కానీ తెచ్చిపెట్టుకున్న ప్రే మలు కురిపించారు అని టీడీపీ ఈనాటికీ విమర్శలు చేస్తోంది. అందులో వాస్త‌వం ఉన్నా లేక‌పోయినా జ‌నం  మ‌ధ్య ఉన్న‌ప్పుడు మాత్ర‌మే జ‌నం స‌మ‌స్య‌లు విని, త‌రువాత వ‌దిలేయ‌డం అన్న‌ది ఏ నాయ‌కుడికీ స‌బ‌బు కాదు. ప్రేమ‌లూ, అభిమానాలూ ప‌థ‌కా ల అమ‌లుతో పెంపొంద‌వు. నిబ‌ద్ధ‌త‌తో కూడిన కార్యాచ‌ర‌ణ ఒక్క‌టి అందుకు ప్రాముఖ్యం వ‌హించే అంశం. ఈ నేప‌థ్యంలో రాజ‌శేఖర్ రెడ్డి బిడ్డ‌ల‌కు కేవ లం పాదయాత్రల ద్వారానే వీరికి సమస్యలు అర్థం అయ్యాయి అని అనుకోవడమే అసలు సిసలు అవివేకం. తె లంగాణా దారుల్లో షర్మిల తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలన్న తలంపు ఒక‌టి చేస్తున్నప్పటికీ సామా న్యుడే తన పార్టీకి ఐకాన్ అని చెప్పుకున్న దాఖలాలు లేవు ఆ మాటకొస్తే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నేతల ప్రేమలు నీటి మూటలే డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉంది అనుకోవడం అసలు సిసలు అవివేకం. అ వన్నీ తాత్కాలిక భావోద్వేగాలే!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: