వై వైవీ ? : అన్న‌మ‌య్య ప్రాజెక్టు అట‌కెక్కిందా?

RATNA KISHORE
ధ‌ర్మాన్ని ర‌క్షించండి
అదే మిమ్మ‌ల్ని ర‌క్షింస్తుంది
అన్న‌ది టీటీడీ మాట.. నినాదం కూడా
కానీ అవ‌న్నీ నిన్న‌టి వ‌ర‌కూ
ఇప్పుడు ఆ అన్న‌మ‌య్య
ఏమైనాడో తెలియ‌డం లేదు వైవీ స‌ర్ !

ఎన్ని చెప్పండి అప్ప‌టిలా టీటీడీ లేదు. ధ‌ర్మ ప్ర‌చారం హైంద‌వ మ‌త విశిష్ట‌త అన్న‌వి ఎప్పుడో వ‌దులుకుంది. అన్నింటికీ ఒకే కా ర‌ణం వినిపిస్తూ ఆర్థిక భారం పేరిట త‌నని తాను నియంత్రించుకుంటుంది. లేదా ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అని కొన్ని వ‌ద్ద‌నుకుం టుంది. చంద్ర‌బాబు మొద‌లుకుని వైఎస్సార్ వ‌ర‌కూ హాయిగా న‌డిచిన ప్రాజెక్టు ఇప్పుడు ఊసే లేకుండా పోయింద‌ని వార్త‌లు విని పిస్తున్నాయి. వీటిపై ఈఓ మాట్లాడితే మ‌నం శ్ర‌ద్ధ‌గా వినాలి.లేదంటే చైర్మ‌న్ చెబితే మ‌నం మ‌రింత శ్ర‌ద్ధ‌గా విని వారి వారి కార‌ణా లేంటో తెల్సుకుంటే స్వామి భ‌క్తులుగా కాస్త‌యినా తేట‌ప‌డ‌తాం. త‌ప్పు ఎవ‌రిది? ఎందుకు ఈ ప‌రిస్థితి? అన్న‌వి తెలుసుకుంటాం.

వెయ్యి కోట్ల‌కు పైగా ప్రాజెక్టు
జిల్లాల‌లో సంకీర్త‌న‌లు  వినిపించే ప్రాజెక్టు
పేద క‌ళాకారుల‌కు అన్నం పెట్టిన ప్రాజెక్టు
ఆగిందో సాగిందో తెలియ‌ని సందిగ్ధం

క‌రోనా రాక కార‌ణంగా ఊళ్ల‌ల్లో ఎన్నో ప‌నులు నిలిచిపోయిన మాట వాస్త‌వం. ఇదే అదునుగా కొన్ని ఆపేసిన మాట కూడా వాస్త వం. అన్న‌మ‌య్య ప్రాజెక్టు అంటేనే ఎంతో గొప్ప‌ది కానీ ఈ గొప్ప‌ల మాట‌లు ఇప్పుడు మ‌నం విన‌కూడ‌దు. ఎందుకంటే ఊళ్లో స్వా మి కీర్త‌న‌లు పాడించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌డం లేదు. స్థానిక క‌ళాకారుల ఊసే లేదు. హ‌రి క‌థా కళాకారులు, వ‌యోలెన్ క‌ళాకారు లు, మృదంగ క‌ళాకారులు ఇంకా ఎంద‌రో పాపం వారంతా ఏవో చిన్న‌, చిన్న ప‌నులు చే సుకుని పొట్ట నింపుకుంటున్నారే త‌ప్ప ఎప్ప టిలా వారికో ప్రోత్సాహం అస్స‌లు అంద‌డం లేదు.


టీటీడీ నేతృత్వంలో ధ‌ర్మ ప్రచారం అన్న‌ది ఒక‌ప్ప‌టి మాట. కానీ ఇప్పుడు అస్స‌లు ఆ సంగ‌తే మ‌రిచిపోయింది సంబంధిత పాల‌క వ‌ర్గం. ఇదీ నేటి విమ‌ర్శ. ఈ విమ‌ర్శ‌కు స‌మాధానం ఎలా ఉన్నా ఎక్క‌డి నుంచి వ‌చ్చినా అది స‌హేతుకం అని అనిపిస్తే త‌ప్ప‌క సం తోషించాలి మ‌నం. క‌రోనా రాక నేప‌థ్యంలో టీటీడీ చాలా ప‌నులు నిలుపుద‌ల చేసింది. దీంతో చాలా మంది పేద సంగీత క‌ళాకారు లు, వాద్య బృందాలు తిండికి లేక అవ‌స్థ‌లు పడుతున్నాయి. ఇది వ‌ర‌కు అన్న‌మ‌య్య ఆధ్యాత్మిక వాహిని పేరిట ఓ ప్ర‌త్యేక కార్య క్ర‌మం న‌డిచేది. కానీ ఇప్పుడు అన్న‌మ‌య్య పాట‌లు పాడేవారు ఉన్నా, స్వామి సంకీర్త‌న‌ల‌తో ఆరాధ‌న చేసే వారు ఉన్నా వీరిని ఎ వ్వ‌రినీ ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. క‌రోనా సాకు తో ఎంద‌రినో టీటీడీ నిలిపివేసింది. ముఖ్యంగా జిల్లాల‌లో అన్న‌మ‌య్య ఆ ధ్యాత్మిక ధార అన్న‌దే లేకుండా పోయింది. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టును చాలా మంది ఈఓలు స‌మ‌ర్థంగా నిర్వ‌హించి మంచి పేరు
తెచ్చుకున్నారు. కానీ జిల్లాల‌లో ఈ ప్రాజెక్టు నిలిపి వేసిన కార‌ణంగా దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ఈఓ జ‌వ‌హ‌ర్ రెడ్డి ఏమంటారో అ న్న‌ది ఇప్పుడిక కీల‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: