కృష్ణాష్ఠ‌మి : క‌ర్త‌వ్యం నీ వంతు మ‌రువ‌కు!

RATNA KISHORE
దేవుడ‌యినా యుద్ధం ఆప‌లేదు అని ఒక‌రు ప్ర‌శ్నించారు. న‌వ్వుకున్నాను. దేవుడే చేయించిన యుద్ధంలో గెలుపు ఎవ‌రిది? ఓ ట‌మి ఎవ‌రిది? అయినా ర‌క్త‌పుటేరుల‌ను పారించ‌డం అన్న‌ది అంతిమం అయి ఉందా అని కూడా అన్నారు. వైదిక సారంలో కృష్ణ య్య కొండంత దేవుడు.. కొండ‌నే ఎత్తిన దేవుడు.. ర‌క్తం పారించ‌డం దేహాల‌ను నిర్జీవం చేయ‌డం అన్న‌వి కూడా అన్నీ అన్నీ జీవ కాండ‌లో భాగం. లీల లో భాగం మాయ‌లో భాగం.. ఒక యుద్ధం నుంచి మ‌రో యుద్ధం వ‌ర‌కూ మ‌నుషులు నేర్చుకోవాల్సిన పాఠా లు ఎన్నో నేర్పాడు. క‌ర్త‌వ్య దీక్ష‌లో ఎన్న‌డూ వెనుకంజ వేయ‌కూడ‌ద‌ని నేర్పాడు. క‌ర్త‌వ్య దీక్ష‌లో త‌ప్పులు చేస్తే దిద్దుకోవాల్సిన బా ధ్య‌త కూడా నీదే అని నేర్పాడు. ఇన్ని మాట‌లు మ‌న గీతాసారం నేర్పుతుంది క‌దా! వాటిని ప‌ట్టించుకోకుండా మ‌న దైనందిన జీవి తాల‌కు ఓ అర్థం ఇవ్వ‌కుండా ప‌ర‌మార్థం వెత‌క్కుండా నిర్జీవ శ‌క‌లాలుగా మారుతున్నామే! నిజంగానే క‌ర్త‌వ్యం పాటించే శ‌క్తి మ‌న లోనే ఉందా?

ఆనందం పుట్టుక - ఆనందం గెలుపు - ఆనందం మ‌రొక రూపు..ఓడిపోయిన తీరాల చెంత మ‌నుషులంతా అచేత‌నంగా ఉంటారు. ఉద్యోగం లేద‌నో, భ‌రోసా లేద‌నో ఏదో ఒక‌టి నిరాశలు నింపిన కాలం చెంత నీ స్నేహితుడు నీ స‌న్నిహితుడు నీ హితైషి ఆయ‌నే! యుద్ధానికి మ‌రో రూపం వెతికితే ఎవ‌రు ఎవ‌రిపై పోరాడాలి. కాలానికి ఎదురెళ్లి చేసిన ప్ర‌యాణంలో ఓ దేశం ఓ వ్య‌క్తి ఓ సంక‌ల్పం ఏ మ‌యి ఉన్నాయి. బంధు గ‌ణం స్నేహిత గుణం అన్న‌వి ఏ విధంగా ఉన్నాయి ఇవ‌న్నీ ఎవ‌రికి వారు వెతుక్కోవాలి. కృష్ణ త‌త్వం లో అంతిమ పాఠం గెలిచే గుణంలో ఓడే ల‌క్ష‌ణంలో ఎవ‌రికి వారు త‌మ‌ని తాము నిర్వ‌చించుకోవాలి.

ఏ ఓట‌మీ అంతిమం కాన‌ప్పుడు ఏ గెలుపు అయినా అంతిమం అవుతుందా అని ప్ర‌శ్నించుకోవాలి. ఆధునిక కాలానికి కృష్ణుడు చేరువ అయిన గురువు. చేరిక‌ల్లో ఉన్న గురువు.. మ‌న గుంపున‌కు అత‌డొక బాస్.. అత‌డే ఓ  సైన్యం మ‌రియూ  సేనాని.. ర‌క్ష అ ని కోరడంతో నీ ప‌ని పూర్త‌యిపోదు..అని హెచ్చ‌రించే శ్రేయోభిలాషి. భ‌గ‌వ‌త్ సారం కేవ‌లం చ‌దివి వ‌దిలేయ‌డంలో ప్ర‌యోజ‌నం లే దు..ఓ గొప్ప ఆచ‌ర‌ణకు తూగేలా ఎవ‌రి జీవితాల‌ను వారు సంస్క‌ర‌ణ‌కు దగ్గ‌ర చేస్తే అవి వెలుగుల మ‌యం అవుతాయి..

అనుక‌ర‌ణ‌కు తూగ‌ని ఆచ‌ర‌ణ కావాలి.. ఆద‌ర్శం అంటే ఇది. భారం మోయడం ఆద‌ర్శం కాదు బాధ్య‌త.. భారాన్ని త‌గ్గించ‌డం బా ధ్య‌త అనే క‌న్నా క‌ర్త‌వ్యం అన‌డం ఆ పాటింపులో  చూపించే గుణాన్ని మాన‌వ‌త్వం మ‌నిషి త‌త్వం అన‌డం స‌బ‌బు. యుద్ధం తరు వాత కూడా ఒంట‌రిత‌నమే ఉంటుంది. నిరాశ ఉంటుంది.. వాటిని కూడా మ‌నం ప్రేమించాలి. మ‌న అనుకున్న శ‌క్తుల‌ను నిలుపు కోవ‌డంలో దైవం తోడు పొందాలి..దైవం సాయం పొందాలి.. దేవుడు అన్నింటా ఉంటాడు అన్నారా? ఏమో ఉన్న‌చోటున మ‌నిషి గె లిచి వ‌చ్చి ఆయ‌న‌కు చేసే ప్రార్థ‌న ఈ లోకం తీరును మార్చ‌గ‌లిగితే చాలు. అమానుషం అనుకున్న‌వి త‌గ్గితే చాలు.. పైశాచికం త‌గ్గి తే చాలు..ఆత్మ శ‌క్తిని - నిగ్ర‌హ శ‌క్తిని - ఇంద్రియ శ‌క్తిని - ఇంద్రియాల‌కు అతీతం అయిన శ‌క్తిని అందించే దైవ గుణం నీదే అయి తే మేలు. ఈ బొమ్మ‌లాట‌లో గెలుపు నీదే అయితే ఇంకా మేలు. యుద్ధం ర‌క్త త‌ర్ప‌ణాల‌ను కోరుకుంటుంది కానీ కొన్ని అరాచ‌క శ క్తుల నీడ‌ల‌ను సైతం త‌ప్ప‌క చెరిపి పోతుంది. అనండిక కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: