కృష్ణాష్ఠ‌మి : ల‌వ్ గురూ కృష్ణుడే క‌ద‌రా!

RATNA KISHORE
మ‌న్ను తిన‌డం ప్రేమ
మిన్ను వ‌ర‌కూ ఎద‌గ‌డం ప్రేమ
పంచ‌డం ప్రేమ పంచే స్థాయిలో
ఆర్జించ‌డం లేదా సంపాదించ‌డం ప్రేమ
ప్రేమ ఎన్నో మ‌న‌సుల‌కు చేరువ
క‌న్నియ‌ల ప్రేమ కృష్ణ‌య్య‌కు చేరువ
ఆయ‌నే ల‌వ్ గురూ!
ఆయ‌న చెంత ఉన్న క‌థల ద‌గ్గ‌ర
ఈ డిజిట‌ల్ ప్రేమ‌లు చిన్న‌బోతాయి
కాదండి వెల వెల బోతాయి అని రాయాలి

 
ఎన్నో ప్రేమ క‌థ‌లు.. ఎన్నో క‌న్నీటి క‌థ‌లు జీవితం ఇచ్చిపోయింది. ఒక జీవితం స‌ముద్రం ఒక జీవితం కన్నీటికి ప‌ర్యాయ ప‌దం.. ఒక జీవితం దుఃఖ సాగ‌రం.. ప్రేమ త‌త్వాలు అన్నీ ఇలానే ఉంటాయి. ఉండాలి కూడా! ఓడిపోయిన చోటు ఒక‌టి ఉంటుంది..అక్క‌డ అం తా ఒంట‌రి. త‌న‌ని తాను ప్రేమించ‌డం లోకాన్ని ప్రేమించ‌డం వేర్వేరు అయి ఉంటుంది. లోకాన్ని ప్రేమించ‌డంలో దేశాన్ని ప్రేమించడంలో కూడా భ‌క్తే  ఉంది. భ‌క్తి అంటే ధూపం దీపం కాదు ధుని ధ్వ‌ని కాదు..భ‌క్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవ‌డం అంటారు అదే నిజం కూడా! ప్రేమ త‌త్వంలో నిన్ను నువ్వు తెలుసుకోవ‌డం అన్న‌ది ఎంతో ముఖ్యం. 16వేల గోపిక‌ల ప్రేమ త‌త్వం నేర్పిందే ఇది.

ఆధునిక కాలంలో ప్రేమ ఎన్నో పైశాచిక క్రీడ‌ల‌కు కార‌ణం అవుతోంది. ఎంద‌రెంద‌రి అభాగ్యుల‌నో ఒంట‌రిని చేస్తుంది. ఇదంతా ప్రేమే నా అనే ప్ర‌శ్న‌కు తావిస్తుంది. కానీ ప్రేమ త‌త్వంలో ఉన్న మాన‌వ‌త్వం వీళ్ల‌లో లేదు. అందుకే ప్రేమ పేరిట ఇన్నిఅకృత్యాలూ ఘోరాలూ ఘోష‌లు.. ప్రేమ కృష్ణ‌య్య పంచాడు.. ప్రేమ రాధ‌మ్మ పంచింది.. ప్రేమ పంచాకే య‌శోద నంద‌నుడు అయినాడు.. ప్రేమ పొందాకే దేవ‌కీ నంద‌నుడు రారాజ‌య్యాడు.. హృద‌య విజేత అయ్యాడు. ఆధునిక కాలంలో ప్రేమ రెండు అక్ష‌రాల యుద్ధంలా ఉంది.

ఉన్మాదాల‌కు ఆన‌వాలులా ఉంది. కృష్ణయ్య నేర్పిన ప్రేమ‌లో ప‌రాక్ర‌మ త‌త్వం ఉంది.. ప్ర‌భుతత్వం ఉంది. నిన్ను ఒంట‌రి చేయ‌ని గుణం ఉంది. నిన్ను విజేత‌ను చేసిన ల‌క్ష‌ణం ఉంది. రాస‌లీల‌ల సారంలో ఆ చీక‌టి వేళ పొందిన సాహ‌చ‌ర్యంలో నీడ‌ల తార్లాట‌ల్లో  
ఎన్నింటిలోనో మ‌రిచిపోని భావ‌న‌లు ఉన్నాయి. దేహ క్రీడ‌లు కావు అవి మ‌నో ర‌మ్య‌త‌కు ఆన‌వాలు ఆ ప్రేమ. ప్రేమ నిజాయితీతో ..ప్రేమ స్మార‌కంలో .. ప్రేమ అవ‌ధిలో లేని ఆనందంలో.. ఆనందాన్ని ప‌ర‌మాత్మ త‌త్వానికి అనువుగా అనుగుణంగా మార్చిన కృష్ణ‌య్య‌కు మ‌నం ఏమిచ్చి రుణం తీర్చ‌గలం. మిన్నూ మ‌న్నూ- నాదే అని చెప్పిన వాడి ద‌గ్గ‌ర మీరూ- నేనూ చిన్న‌వారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: