కృష్ణాష్ఠ‌మి : ఫెమినిస్టు కృష్ణుడు

RATNA KISHORE
లోకాన్ని న‌డిపించే దేవుడు
అమ్మ ప్రేమ‌కు బానిస
లోకాన్ని న‌డిపించే దేవుడు
ప్రేయ‌సి ద‌గ్గ‌ర ఎంత చిన్న‌వాడో
స్త్రీని గెలిపించి వారి ఔన్న‌త్యం చాటి
తాను గెలిచాడు
శివుడు క‌మ్యూనిస్టు కృష్ణుడు ఫెమినిస్టు
ఇంకా చెప్పాలంటే
కృష్ణ త‌త్వం అద్వైత సారం..
స్త్రీ పురుష‌ల స‌మాన‌త్వాల‌కు సంకేత రూపం
ల‌వ్ యూ క‌న్న‌య్యా...

దేవుడు ఎవ్వ‌రు అయినా గెలిచేది మాత్రం మ‌గువ రూప‌మే..దేవుడు ఎవ్వ‌ర‌యినా గెలిపించేది కూడా ఆ రూపాన్నే..ప్రేమ, ద‌య‌, శౌర్యం, ప‌రాక్ర‌మం నిండిన స్త్రీ మూర్తుల విజ‌యాలు అంతిమ రూపాలు ఎన్నో! వీటిని గెలిపించిన వాడు దేవుడు. న‌డిపించిన వా డు దేవుడు..కృష్ణుడికి ఇద్ద‌రు అమ్మ‌లు.. ఒక అమ్మను అయినా బాధ‌పెట్టాడా లేదు క‌దా! ఇద్ద‌రి త‌ల్లుల‌కూ ప్రేమ పంచాడు. ఇద్ద రి త‌ల్లులకూ గొప్ప ఆద‌ర్శం ఏంట‌న్న‌ది వివ‌రించాడు. త‌ల్లికి బిడ్డ చిన్న‌వాడా పెద్దవాడా అన్న‌ది అన‌వ‌స‌రం క‌దా! స్త్రీ గెలిచిన ప్ర‌తి చోటా కృష్ణుడే గెలిచాడు.. చెల్లెలను గెలిపించాలి అనుకున్న ప్ర‌తిసారీ గెలిపించాడు. సుభ‌ద్ర‌ను గెలిపించాడు ద్రౌప‌దిని గెలిపించాడు ..

ఇలా స్త్రీ మూర్తుల గెలుపులో తానున్నాడు. అహాన్ని అణిచే వేళ‌లో తానున్నాడు. స‌త్య భామా దేవీ రౌద్ర రూపంలో తానున్నాడు. నర‌కాసుర వ‌ధ‌లో తానున్నాడు...రుక్మిణి దేవి ప్రేమ‌లో తానున్నాడు. ప్రేమ‌ను పంచి ప్రేమ‌ను పెంచిన గోకులంలో అంద‌రి గోపెమ్మ ల ప్రేమ‌లోనూ తానే ఉన్నాడు.. క‌నుక ఆ యుమునా తీరం గాలులు కృష్ణయ్య మాట వింటాయి. ప్రేమ త‌త్వం నింపి  అంద‌రికీ అ వి చేరువ అవుతాయి. అయినా కృష్ణుడ్ని మించిన ఫెమినిస్టు ఎవ‌రున్నార‌ని? ఇంకా చెప్పాలంటే మ‌నం ఆధునికులం క‌నుక స్త్రీ వాదం పురుష వాదం అన్న‌ది వినిపిస్తూ కొట్టుకుంటాం క‌నుక మ‌రో మా చెప్పాలి స‌మాన‌త్వ భావ‌న కృష్ణ‌య్య‌లో ఉంది. కానీ మ గువల గెలుపుతో ప్ర‌పంచం వృద్ధి ఉంద‌ని, స్త్రీ శ‌క్తి అజేయం అని నిరూపించేందుకు తాను చేసిన ప్ర‌తి ప్ర‌య‌త్నంలోనూ క‌డివెడు ప్రే మ ఉంది.. అది దుఃఖ‌సాగ‌రాల‌ను దాటించేందుకు ఉప‌యోగ‌ప‌డింది.

ప్రేమ త‌త్వంలో మునిగాక క‌ర్త‌వ్యం మ‌రిచిపోకు అని అర్జునుడికి చేసిన హెచ్చ‌రిక‌లో ఉంది. కోపాల‌ను జ‌యించే శ‌క్తి నీలోనే ఉంది అని బోధించిన త‌త్వంలో మ‌నం ప్రేమ‌ను వెతుక్కుని, అజేయ శ‌క్తిగా మారిపోయి ఈ ప్ర‌పంచానికి విజేత‌గా మిగ‌లాలి. కృష్ణుడు ఫె మినిస్టు. ఆయ‌న గెలిచి ఇంద‌రు స్త్రీ మూర్తుల‌ను గెలిపించాడు. అమ్మ ప్రేమ గొప్ప‌ద‌నం చాటాడు. ఓ క‌వి అన్న విధంగా క‌న్నె ప్రే మకూ క‌న్న ప్రేమ‌కూ బానిస అయ్యాడు.. ప్రేమ కు బానిస అని రాయొచ్చా రాయొచ్చు.. ఆధునిక లోకానికి ప్రేమ‌కు బానిస కావ డం చేత‌గాదు.. ఆ క‌న్న‌య్య‌ను చూసి ఆ లీల‌ల‌ను చూసి నేర్చుకోండి.. ప్రేమ లీల కాదు మాయ కాదు మ‌న‌స్త‌త్వ రూపాల‌కు సాం త్వ‌న..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: