శ్రీ కృష్ణ జననం ఓ మహా అద్బుతం ...!!!

Sravani Manne
దేవకీ వసుదేవులకి బహుళ పక్షం అష్టమి రోజున పుట్టిన ఎనిమిదో సంతానం గా ఓ బిడ్డ జన్మిస్తుంది.ఆ బిడ్డే శ్రీ కృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు. శ్రీ కృష్ణుడి జననం,ఆయన జీవితం అంతా ఓ అద్బుతం. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.అప్పుడే యశోద,కంసుడికి పెళ్లి అవుతుంది.పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తునప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం” అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగృడవుతాడు.

పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్ధిస్తాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లిని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు” అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు.అలా వాళ్ళకి పుట్టే పిల్లలను ఒక్కోకరిని చంపుతూ ఉంటాడు కంసుడు.ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది.

వసుదేవుడు నదిని దాటి యశోద,నందల ఇంటికి వెళ్తాడు.యశోదకు పుట్టిన ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. “నిన్ను చంపుతాడు అనుకుంది మగ బిడ్డ కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు” అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు.కాని ఆ పాపని చంపలేకపోతాడు కంసుడు.ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు.అలా శ్రీ కృష్ణుడు జన్మించిన రోజును జన్మాష్టమిగా ప్రజలు పండుగలా జరుపుకోవడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: