కృష్ణాష్ఠ‌మి : న‌ల్ల‌ని రంగు విశిష్ట గుణం

RATNA KISHORE
వందే అని చెప్ప‌డం అర్థం
వివేకంలో ఉంది..
గురువు జ‌గ‌త్తుని ఏలిన సంద‌ర్భంలో
విశ్వ త‌త్వం ఉంది
మ‌రి! న‌ల్ల‌ని వ‌స్తువుకూ న‌ల్ల‌ని రూపాల‌కూ
మ‌ధ్య తెల్ల‌ని కాంతుల ప్ర‌స‌ర‌ణ‌ను
ఏమ‌నుకోవాలి..తెలుపు న‌లుపుల వాకిట
కృష్ణ‌య్య‌కు ఆపాదించిన త‌త్వం నాలో మీలో
క‌లిగే వేళ‌కు వంద‌నం

ఇవ్వ‌డంలో యుద్ధం లేదు..యుద్ధం అడ‌గ‌డంలో అస్స‌లు లేదు..న‌ల్లని దేహాల‌కు కాంతుల‌ను ఇవ్వ‌డం ఇచ్ఛ‌కు కార‌ణం అయి ఉంటుంది. కాంతులను పొందాక జీవితం ఓ వివ‌క్ష‌ను ఆపాదిస్తుంది. అక్క‌డే కోపం.. భ‌గ‌వ‌త్ త‌త్వంలో కోపాల‌కు తావులేదు అని అంటారే! కోపం అంటే విరుద్ధం అని అర్థం తీసుకోండి. తెలుపు న‌లుపున‌కు విరుద్ధం ఈ కాంతి ఆ చీక‌టి ల‌య‌ల‌కు విరుద్ధం..అయి నా విరుద్ధం దైవికం..అంగీకారం మ‌నిషి గుణం. అంగీకారంలో కొన్ని సార్లు వివ‌క్ష కూడా ఓ భాగం కావ‌డం అన‌ర్హం అన‌ర్థం కూడా! కాంతికి వివ‌క్ష, దేహానికి వివ‌క్ష,కొంత కాంతుల దారుల్లో పొదిగిన జీవితాల‌న్నీ పొందాల‌నుకున్న శాంతినీ సామరస్యాన్నీ హాయిగా అందించ‌డంలో ఉందొక బాధ్య‌త..అన్యం అని తోచిన ప‌నులు చేయ‌కూడ‌దు. భగ‌వ‌త్ సారంలో అన్యం అని ఉంటుందా ఏమో! ఇత రుల‌కు సంబంధించిన ప‌నుల‌కు వివ‌ర‌ణాత్మ‌కత అన్న‌ది అవ‌స‌రం.. మ‌న‌కు మ‌నం సృష్టించుకున్న ప‌నుల‌కు కార్య ద‌క్ష‌త అన్న ది ఓ ఆలంబ‌న. ఇత‌రులు అంటే నువ్వు కాని నువ్వు.. నీకు నువ్వు కొన్ని సార్లు ఇత‌రం ఇహం ప‌రం ఇదే అనుకోవ‌డంలో  ఇత రం..ఇలాంటి ఎన్నో ఇత‌రాల‌ను వ‌ద్ద‌నుకుని జీవించ‌డంలో వెతికే త‌త్వం క‌న్నా పాటించే బాధ్య‌తే మేలు. త‌త్వం కేవ‌లం ఒక జీవి తానికి ఊర‌ట. బాధ్య‌త ఒక జీవితానికి ఆశ‌య నెర‌వేర్పు.. ఆశ‌యానికి త‌త్వం ఓ వెన్నంటి న‌డిపే నీడ..



న‌ల్ల‌ని దేహాల చెంత నీడ‌ల‌ను అనున‌యిస్తే బాధ్య‌త.. నీడ‌ల సృష్టి క‌ర్తవ్యం.. నీలి వ‌ర్ణ సోయ‌గాలు పూసుకున్న అక్ష‌రాల చెంత  ఇ త‌రం అన్న‌ది లేదు అనుకోవ‌డం అవివేకం.. నాది కానిది ఇత‌రం నాది అనుకున్న‌ది ఏదీ లేన‌ప్పుడు ఇత‌రంలో ఉన్న కొన్న‌యి నా ఇత‌రుల‌కు వ‌ర్తింప‌జేయాలి.. లేదా వారికి అంద‌జేసి బాధ్య‌త పూర్తి చేయాలి.. ఇత‌రంలో ఏముంది ప్రేమ ఉంది..అందించాక బా ధ్య‌త ఉంది.. అందాక నెర‌వేర్పు అన్న‌ది ఓ క‌ల.. క‌ల‌ల నెర‌వేర్పు బాధ్య‌త. న‌ల్ల‌ని దేహ కాంతుల ఉద్బోధ‌ను అంగీక‌రించ‌డ‌మే బా ధ్య‌త... గురువు అయితే వాడు బాధ్య‌త.. స్నేహం అయితే వాడు ప్రేమ.. జీవితం అయితే వాడు జ్ఞాప‌కం. న‌ల్ల‌ని రేఖ‌ల చెంత కృష్ణ తత్వం ఇదే!


పైకి న‌వ్వుల‌కు న‌ప్పేవి..లోప‌ల న‌వ్వుల‌కు న‌ప్ప‌నివి..అన్నింటికీ రంగులు పులిమి వెన్నెల చెంత విడిపోవ‌డంలో అర్థం ఉంది. అ స‌లు త‌త్వం అష్ఠ‌మితో మొద‌లిడి న‌వమితో ఎదిగి ద‌శ‌మితో ముగిసిపోయింద‌ని అనుకోవాలి..మాతృగ‌ర్భంలో ఈ త‌త్వ సారాన్ని నేర్పిన వాడు ఎక్క‌డ‌ని ఎవ్వ‌ర‌యినా ఒక్క‌సారి అయినా నిలదీయాలి. ప్రేమ నిండి ఉన్న స్వ‌రాల‌కు అమ్మ నిలిపి పంపిన గొంతుక ల్లో కొన్ని భాగ‌వ‌త సారాలు  ఈ నేల‌పై నిక్షిప్తం అయి ఉన్నాయి. న‌ల్ల‌ని రాయి నుంచి న‌ల్ల‌ని కోయిల వ‌ర‌కూ కృష్ణ‌య్య‌ను దాచు కుని త‌మ‌ని తాము ప్ర‌కృతికి కొత్తగా ప‌రిచ‌యం చేసుకోవ‌డంలో అర్థం ఉంది. న‌ల్ల‌ని నీళ్ల కు కొత్త  రాగాల జ‌త ఇచ్చాక ఉర‌వ‌ళ్ల‌లో కృష్ణ‌య్య వేణుగానాల విల‌సితం ఒక‌టి వినిపించింది. విల‌సితం అని రాయ‌డం క‌న్నా విక‌సితం అని రాయ‌డం మేలు.

మ‌నుషులు ఎవ‌రిని తయారు చేశారు
దేనిని విలీనం అని చెప్పి త‌మ‌ని తాము
అర్థం చేసుకున్నారు..సుఖం విలీనం
జీవితంలో దుఃఖం ఆవ‌లి తీరం
అవునో కాదో!  


భౌతికంగా క‌నిపించేవి ప్రేమించి, అభౌతికంగా క‌నిపించ‌న‌వి వ‌దిలి నీ త‌త్వాన్ని నీ సారాన్ని భ‌గ‌వ‌త్ ద‌ర్శనంలో అర్పించే  గుణం ఉం దా లేదా అన్న‌ది సిస‌లు ప్ర‌శ్న. ప్ర‌పంచాన్ని పీడిస్తున్న రంగుల్లో జీవితం ఉందా లేదా..? రంగుల్లో  జీవితం విశిష్టం అని చెప్ప గ‌లనా ? విశిష్ట త‌త్వం నుంచి వికాస గుణం ఆపాద‌న చేయ‌డం మ‌నిషి నేర్చుకోవాల్సిన పాఠం. మొద‌లు క్రీడ‌ల్లో మ‌ట్టి త‌త్వం ఒం టికి పూసి న రోజు ద్వైతం ఏమ‌యింది..రెండుగా ఉన్న‌వి రెండుగా ఉండిపోయాయి. ద్వైతం అంటే నేను,నువ్వు..రెండు గుణాల స మాక‌ల‌నం అని రాయాలి. కూడిక‌లకు ఈ న‌లుపు రంగు ప‌నికి రాదా.. హా వ‌స్తుంది..న‌ల్ల‌ని రంగుల్లో ఎన్నో ఐక్యం అయిపోయాక నే కొత్త జీవితం సృష్టి సాధ్యం అయిందేమో! అంద‌రికీ జ‌న్మాష్ఠ‌మి శుభాకాంక్ష‌లు.
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: