పొలిటికల్ అడ్వైజ్ : ఒక విశ్వాసి చిత్తం

RATNA KISHORE
మత విశ్వాసాలు కొన్ని
మనిషి విశ్వాసాలు కొన్ని  
ఉంటాయి..


రాజకీయం రెండింటినీ పరిగణిస్తుంది
నా మతం నా ఇష్టం నీకెందుకు అని
షర్మిల క్వశ్చన్ చేసినంత ఈజీ కాదు
ఏదయినా విశ్వాసం పరులకు అనగా
ఇతరులకు మేలు చేస్తుందా లేదా
కీడు చేస్తుందా అన్నది ముఖ్యం


ఇప్పుడు సోనియా తనకు మేలు చేసే
విశ్వాసం ఏ మూల ఉన్నా అంగీకరించాలి
విశ్వాసపాత్రులయిన నాయకులను
రాహుల్ కు అప్పగించి తాను  పక్కకు తప్పుకుపోవాలి
ఇదీ ఇవాళ్టి విశ్వాస చిత్తం.


సుదీర్ఘ చరిత్ర మనుషులపై తీవ్ర ప్రభావం ఇస్తుంది. సుదీర్ఘ చరిత్ర కొత్త వారిని ఎందుకు మనం ఎంచుకోకూడదు అన్న ఆలోచన నూ ఇస్తుంది. ఓ విధంగా పదేళ్లు మోడీది.. అంతకుముందు పదేళ్లు కాంగ్రెస్ ది.. ఇదేమంత సుదీర్ఘం కాకున్నా.. కూటమి నుంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వరకూ దేశం చాలా కోరుకుంది. కాంగ్రెస్ కు కూటమి తలనొప్పులున్నాయి. అందులో భాగంగానే స్కాములూ ఉన్నాయి. బీజేపీకి కూటమి తలనొప్పులు లేవు. స్కాముల విషయమై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం. ఆ విషయాలు అమిత్ షా చెప్పాలి. ఆయన చెబితే వివరం విజయవంతంగా వెల్లడిలో ఉంటుంది. లేదా మోడీ అయినా చెప్పాలి ఆయన చెబితే విషయం వికాస వంతం అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఇవి తేలవు. కాంగ్రెస్ మాత్రం కొత్త విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటి మార్పు. కేవీపీ కూడా ఇలాంటి మార్పే కోరుకుంటున్నారా లేదా అన్నది మొన్నటి ఇంటర్వ్యూలో తేలిపోయింది. నిప్పు అయితే ఉంది అది ప్రశాంత్ కిశోర్ రూపాన అని చెప్పారు కేవీపీ. అది నిజమే అయితే పార్టీకి కొత్త విశ్వాసం  ప్రశాంత్ కిశోర్ .. అదే విధంగా కొత్త నిర్ణయం అనుసారం రాహుల్ జగన్ కు చేరువ అవుతారా? ఇది కూడా తెలియాలి. కాంగ్రెస్ కు పాత రోజులు కావాలి. పాత సీసాలో కొత్త నీరు కాదు కావాల్సింది.


పాత రోజులు అంటే ఏపీలో పాత రోజులు, తెలంగాణలో పాత రోజులు. ఏపీ పాలన పగ్గాలు నల్లారి కిరణ్ కు అప్పగిస్తారని టాక్ . అయితే ఆయనొక పాత తరం నుంచి వచ్చిన కొత్త విశ్వాసి కావొచ్చు. రేవంత్ ఉన్నాడు సరే.. సీతక్క సరే.. ఈ కాంబోను పటిష్టం చేయాలన్నది కొత్త విశ్వాసం. పనిలో పనిగా కొందరిని తప్పించాలన్నది రాహుల్ ఎంచుకున్న మరో అవకాశం. ఆ మాటకు వస్తే ఈ అవకాశం కారణంగా రాహుల్ బలపడొచ్చు లేదా నాలుగు తిట్లు తినొచ్చు. ఏదేమయినా ఆయన సడలని విశ్వాసం కారణం గానే ఆయన బలపడడం లేదా బలహీన పడడం అన్నది ఆధార పడి ఉంటుంది అన్నది ఒప్పుకోదగ్గ నిజం.


వచ్చేది తామే రానున్నది మేమే అని ఎవ్వరు అన్నా అదంతా విశ్వాసమే. అందలం అందుకున్నాక అన్నీ మారిపోతాయి. అంత వరకూ తమపై నమ్మకం ఉన్న లేదా ఉంచిన ప్రజలు, అంతవరకూ తమ ఖాతాలో లేని ప్రజలు అంతా ఒక్కటే అన్న భావన పాల కులకు రావడంతో మార్పులు తథ్యం. పాలనకు సంబంధించి ఏం మాట్లాడినా తప్పే అన్న భావనలో తప్పులు వెతకడం మనం చే యకూడదు. ఈక్రమంలోనే రాజకీయం తనని తాను నిలువరించుకునే శక్తిని వదులుకుని పాలనపై నియంత్రణ కొన్ని సార్లు కోల్పో యి ఏదో ఒక చోట తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తప్పులు చెప్పడం తలనొప్పి. చెప్పకుండా ఉండండి అదే మేలు. రాష్ట్ర విభజనలో కొన్ని తప్పులున్నాయి అని సోనియాకు వెళ్లి చెప్పండి ఒప్పుకుంటారా? ఆ రోజు విభజన చేయాలన్న తలంపు ఒక్కటే తమకు ఉన్న అధికారం అని భావిస్తే, ఇరు పక్షాలకు న్యాయం  చేయాలన్న డిమాండ్ కు మాత్రం ఆమె ఎందుకనో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ కారణంగా అప్పుడు ఓడిపోయామన్న ఆలోచన ఇప్పటికీ ఆమె కలగడం లేదు అని ఓ అనుమానం. కలిగితే మేలు. పూర్వ వైభవం అన్నది పెద్ద పదం. కానీ దక్కితే ఇంకా మేలు. పార్టీకీ సోనియాకూ అదే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: