ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : కొత్త పాఠం వ‌స్తుంది చ‌రిత్ర‌లో చ‌ద‌వండిక

RATNA KISHORE
ఓవ‌ర్ టు ఒలంపిక్స్  : కొత్త పాఠం వ‌స్తుంది చ‌రిత్ర‌లో చ‌ద‌వండిక
కాలం ఓడిపోతున్న ప్ర‌తిసారి కొత్త విజేత‌ను అందిస్తుంది.. చెమ‌ట చుక్క‌ల సంద్రాలు ఓట‌ముల‌ను తుడిచేస్తాయి.. మీకు మ‌రో గొప్ప విజ‌యం అందిస్తాను అనేంత శ‌క్తి కాలానికి కాదు సంక‌ల్పానికి ఉంది.. ఈ దేశం మ‌ట్టి అందుకు సిద్ధంగా ఉంది.. ఈ దేశం నుంచి విజేత‌ల పుట్టుక ఇక్క‌డి నేలల నుంచే ఉంది.. ఈ నేల‌కు ఆ లక్ష‌ణం ఉంది.. పాదాల‌కు ప‌రుగులు నేర్పిన కాలం ప‌స్తులున్న రోజుల‌కూ అన్నీ ఉన్న రోజుల‌కూ తేడా ప‌ట్టి చూపుతుంది.. ఇప్పుడొక అథ్లెట్ ప‌రుగుల రాణి రాయండి.. మ‌న‌కు త‌మిళ తీరాల‌లో దొరుకుతారు వెళ్లి క‌ల‌వండి ఆమె పేరు రేవ‌తి.. మిక్సిడ్ రిలేలో క‌నిపిస్తారు ఒలంపిక్స్ ప‌రుగులో  ఈ దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ..
ఆమెను ప‌ల‌క‌రించండి... ఇదిగో ఆమె క‌థ..
బిడ్డ‌ల‌కు చ‌దువు బిడ్డ‌ల‌కు వెలుగు
బిడ్డ‌ల‌కు ఆక‌లి బిడ్డ‌ల‌కు అనాథం అన్న భావ‌న
ఇవ‌న్నీ తెలిసిన‌ప్ప‌టికీ తెలియాల్సిందే ఏదో ఉంది
మ‌నం కేవ‌లం చ‌దువులు ఇచ్చి దేశానికి  నిరుప‌యోగ శ‌క్తుల‌ను ఇస్తున్నాం. ఆక‌లి లేని రోజు నిద్ర లేని రోజు వారికి లేకుండా చేయ‌డంలోనూ ఏదో ఒక ఆనందం ఉందేమో! ప్ర‌తిదీ అనుభవం.. రేవ‌తి వీర‌మ‌ణి జీవితం ఓ పాఠం.. పేదింట పుట్ట‌డంలో ఉన్న ఆనందం నుంచి ఈదేశం నీ కోసం రాసే పాఠం వ‌ర‌కూ ఆ ఆనందం ఉంది త‌ల్లీ! ఈ రోజు త‌మిళ నేల‌లు పుల‌కిస్తాయి నీ ప‌రుగుల వేగం  చూసి ఈ దేశం గాలులు పోటీ ప‌డ‌తాయి.. చెప్పానుగా కూలి జ‌నం స్వేదం నుంచి వ‌చ్చిన విజ‌యాలే ఈ దేశానికి గ‌ర్వ‌కార‌ణాలు.. రండి ఆమెను ప‌ల‌క‌రిద్దాం..
రెండు ముళ్ల కాలంపై రెండు కాళ్ల శిఖరం అని రాశాను హిమ‌దాసు గురించి.. ఇదే మాట ఈ బిడ్డ‌కూ వర్తిస్తుంది.  అమ్మ‌మ్మ
పెంపకం.. నాన్న లేరు.. ఇంకొంద‌రు అయిన వాళ్లు ఉన్నా ఆదాయం లేని కుటుంబాల్లో కూలి ప‌నులు త‌ప్ప ఏమీ లేవు.. నేను
రేవ‌తి ని చ‌దివిస్తాను ఆమె చెల్లెల‌ను చ‌దివిస్తాను ప‌నికి పంపాను.. అని ఆ కూలిఅమ్మాణ‌మ్మ చెప్పిన మాట ఈ రోజు ఈ దేశానికి
అవ‌స‌రం.. సామాజిక అంత‌రాల‌ను కొన్ని గెలుపులు తుడిచేస్తాయి.. అని చెప్ప‌లేను కానీ క‌నీసం ఆలోచింప‌జేసేలా చేస్తాయి...

కాళ్ల‌కు కొత్త శ‌క్తి
ప‌రుగుకు కొత్త శ‌క్తి
పాదాలు నేల‌ను ముద్దాడితే
రేవ‌తి ప‌రుగులు ఆశ‌లూ అన్నీ అన్నీ
అంతే వేగంతో  ప్ర‌త్య‌ర్థిని దాటేస్తాయి
స‌ర్ .. ఈ పాఠం రాయండి.. ఒలంపిక్స్ లో మిక్స్ డ్  రిలేలో ఆమె ప‌త‌కం తెచ్చుకున్నా తెచ్చుకోకున్నా గాయాలు వేధించిన వేళ
ఆమె ఏంట‌న్న‌ది చెప్పండి.. ఈ దేశానికి కొన్ని శ‌క్తుల ఆవాహ‌న అవ‌స‌రం.. పేదింటి బిడ్డ‌లకు ఇంకొన్ని క‌ల‌లు అవ‌స‌రం..క‌ల‌లే
నా దేశ విజ‌యాల‌కు ప్రాతిప‌దిక‌లు.. మంచి బిడ్డ‌లు మంచి క‌ల‌లు ఈ దేశం ఆడ బిడ్డ‌లు ఈ దేశం బంగ‌రు భ‌వితలు.. వంద‌నాలు
చెల్లించండి.. కూలి ఇంట ఇంకొంద‌రు ఉన్నారు.. వారికి చేయూత ఇవ్వండి.. నేల కు మ‌రింత తేజం వ‌స్తుంది .. నింగిని ముద్దాడే
విజ‌యాలే ఇవాళ్టి ఆశా రేఖ‌ల‌కు  గొప్ప జ్ఞాప‌కాలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: