మావోయిజం మరణించదు .. రూపం మార్చుకుంటుందంతే !

LAXMAN
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( మావోయిస్టు ) అరణ్యాలకే పరిమితమై, సాయుధులై సామాజీక వివక్షతపై పోరాటాలు చేసేది! ప్రస్తుతం ట్రెండ్ మారి టెక్నాలజీ ఊపందుకోవడంతో అరణ్యాలలో మవోల పోరాటం కత్తిమీదసాములా మారింది. దీంతో గత దశాబ్ధ కాలంగా అభయారణ్యాలను వదలి జనారణ్యాలలో కార్యకలపాలను సాగించడంపై ప్రత్యేక దృష్టిసారించాయి నక్సల్ శ్రేణులు. ఒకపక్క కోవర్టులను అరెస్ట్ చేసి కోర్టుకీడుస్తున్నా.. మరోపక్క స్థావరాలపై నిఘా పెంచి, ఎరివేతలు ముమ్మరం చేస్తున్నా .. పోరాటం మాత్రం ఆగడంలేదు. దండకారణ్యం నుంచి పునారావస ఛాయల వైపు అడుగులు వేస్తూ.. తమ వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదునుపెడుతున్నారు అన్నది వాస్తవం!
అభయారణ్యాలను వీడుతున్నప్పటికీ .. జనరాణ్యాలలో ‘ప్లాన్ - బి’ అమలకు రంగసిద్దం చెయ్యక మానరు అన్న అనుమానాలు అధికార వర్గాల్లో లేకపోలేదు. మవోయిజం మరణించదు .. దాని రూపం మార్చుకుంటుందన్నది దాంట్లో వాస్తవం ఎంతుందో తాజాగా తెలంగాణలో జరిగిన సోదాలు, వరుస అరెస్టులు చూస్తే అర్థమౌతోంది. ఒక్కపక్క కరోనా, ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని దళాల నేతలు లొంగిపోతున్న తరుణంలో మరోపక్క తెలంగాణాలో ఎన్ఐఎ విస్తృత సోదాలు, యువకులు అరెస్టులు దేనికి సంకేతాలనిస్తున్నాయి?  అరణ్యాల నుంచి సాగే సాయుధ పోరాటాలు .. నేడు మారుతున్న పరిణామక్రమంలో అర్బన్ నక్సలిజం వైపు పయనిస్తోందన్న మాట వాస్తవం కాదా? అన్నది విశ్లేషకుల వాదనాలు.
ఎందురో ఉద్యమమే ఊపిరిగా భావించి .. అడవి బాటపట్టిన మావో మార్గాన్ని ఎంచుకున్నారు. ఎంతటి దుర్భర పరిస్థితుల్లోనైనా వారి ఉనికిని కాపాడుకునేందుకు చేసే యత్నాలు అన్నీఇన్నీ కావు. ఒక్కప్పటినాటి నిమ్న వర్గాల వివక్ష, బానిస సంకేళ్లతో బడుగు బలహీన, అనగారిన వర్గాలు అణచివేతలు నేడు కొంత సన్నగిల్లినప్పటికీ,  ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి, బంధుప్రీతి, అగ్రవర్ణాల ఆదిపత్యం, నిరుద్యోగ సమస్య వంటివి నేటికీ యువతను ఇంకా నక్సల్ బరుల వైపు ఆకర్షిస్తునే ఉన్నాయి. కొన్ని అసమానతలు తొలిగితే ఉద్యమాలతో పని ఉండదు. సమానత్వం బ్యాలెన్స్ తప్పితేనే తిరుగుబాటు అవసరతలు పురుడుపోసుకుంటాయి. ఈనేపథ్యంలోనే అర్బన్ స్లీపర్ సెల్స్ యాక్టీవ్ అయ్యాయి. పట్టణాలు, నగరాలను నక్సల్ కార్యకలపాలకు కేంద్రాలుగా మార్చుకుని యాక్టీవిటీస్ ప్రారంభించారు. దీనికి నిదర్శనమే ఆ మొన్న తెలంగాణలో ఎన్ఐఏ వరుస సోదాలు .. యువకుల అరెస్టులు! ఇలా అర్బన్ ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఎంత చురుగ్గా నక్సల్ కార్యకలపాలను సన్నగ్ధం చేస్తున్నాయో ఎన్ఐఏ సోదాల్లో బహిర్గతమౌతున్న వాస్తావాలు!  
తెలంగాణలోని ఐదు జిల్లాలో 9 చోట్ల ఎన్ఐఏ జరిపిన సోదాల్లో విస్తుపోయే నమ్మలేని నిజాలు వెలికిచూశాయి. మహబూబ్ నగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన సోదాల్లో భారీ పేలుడు పదార్ధాలతోపాటు తయారీకి సంబంధించిన పలు పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుమ్ముగూడెం మవోయిస్టు ఆయుధ, పేలుడు కేసు నుంచి లాగిన తీగ ఐదు జిల్లాల్లో కదలికలు మొదలయ్యాయి. ఈ పేలుడు పదార్ధాలను మావోయిస్ట్ నేత హిడ్మాకు పంపుతున్న ఎన్ఐఏ దర్యాప్తులో తెలింది. గతంలో ఏపిలో విశాఖ ముంచింగిపుట్టు కేసులోనూ ఎన్ఐఎ 36 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇలా మవోలు అర్భన్ లో సాంకేతికతను వినియోగించుకుంటూ .. కార్యకలపాలు గతంకన్నా ముమ్మరంగా సాగిస్తున్నారన్నది ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో బయటపడ్డ నిగూఢ రహస్యాలు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: