CBSE విద్యార్థులు జాగ్రత్త.. ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయొద్దు?

Purushottham Vinay
ఇక CBSE విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు బాగా చెలరేగిపోతున్నారు. అవకాశం ఉన్న చోటల్లా అందినకాడికి ఆ నేరగాళ్లు దోచుకుంటున్నారు.సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్‌ ని తెరిచి కొత్త దందాకు ఆ సైబర్ దొంగలు తెరతీశారు.ఇక రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో డబ్బులు దారుణంగా వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) అప్రమత్తమైంది. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల విషయంలో ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాక్ట్‌చెక్‌ అలర్ట్‌ ని జారీ చేసింది.ఇక ప్రస్తుతం cbsegovt.com అనే ఓ నకిలీ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్ చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్‌కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ స్పష్టం చేయడం జరిగింది.కేవలం cbse.gov.in, cbse.nic.in మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్‌సైట్లు అని PIB తెలిపింది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు ఇంకా అలాగే పరీక్షా ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్‌సైట్లను సంప్రదించాలని కూడా తెలిపింది.


ఇంకా ఏదైనా సమాచారం  చెక్ చేసేటప్పుడు ఆ వెబ్‌సైట్ సరైందా? కాదా? అనేది ఖచ్చితంగా సరిచూసుకోవాలని కూడా పీఐబీ సూచించింది.ఇక ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. ఇక రెండు విడతల్లో కూడా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. మొదటి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని కూడా వెల్లడించింది.అలాగే రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే జనవరి 12 వ తేదీ వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు కూడా పేర్కొంది. ఇక పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కూడా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: