గుడ్ న్యూస్.. SBI లో ఉద్యోగాలు?

Purushottham Vinay
ఇండియాలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకులో ఉద్యోగం అంటే చాలా క్రేజ్ ఉంటుంది యువతకు. దీంతో ఈ బ్యాంకు లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అనేక మంది ప్రిపేర్ అయ్యి తెగ పోటీ పడుతుంటారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వరుసగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 10న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు https://bank.sbi/web/careers వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఖాళీల వివరాల విషయానికి వస్తే...ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఎంపికైన అభ్యర్థులు ముంబాయి/నేవీ ముంబాయిలో పని చేయాల్సి ఉంటుంది.


విద్యార్హతల వివరాల విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీఏ విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.ఇక ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలంటే? అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా అభ్యర్థులు https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/web/careers వెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రెజ్యూమే , ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్,విద్యార్హతల సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, లేటెస్ట్ ఫామ్-16/ఐటీ రిటర్న్, కరంట్ పే స్లిప్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: