తెలంగాణ: నిరుద్యోగులకు చక్కటి శుభవార్త?

Purushottham Vinay
ఇక ఉద్యోగాలు లేక ఖాళీగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో చక్కటి శుభవార్త చెప్పింది. కొత్తగా మరో 175 ఉద్యోగాలకు టీఎస్‎పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అలాగే అర్బన్ డెలవప్‌మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్‎లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 175 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తెలుసుకోండి.మహిళా, శిశు సంక్షేమశాఖాధికారి పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో 23 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.


రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ స్పీడ్ గా సాగుతున్నది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ ప్రకటించగా కేవలం ఐదు నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 20,899 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి.ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే నెలలో గ్రూప్‌-4 పోస్టులకు కూడా ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: