గుడ్ న్యూస్ : ఆటోమొబైల్ రంగంలో భారీగా ఉద్యోగాలు?

Purushottham Vinay
ఇక ఆటోమోటివ్ రంగంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC)..టయోటా కంపెనీ ఇంకా ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌(ASDC)తో చేతులు కల్పింది. వచ్చే మూడేళ్లలో దాదాపు 18వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రధానంగా ఆటోమోటివ్ రంగంలోని జనరల్ టెక్నీషియన్, బాడీ అండ్ పెయింట్ టెక్నీషియన్, సర్వీస్ అడ్వైజర్, సేల్స్ కన్సల్టెంట్స్ ఇంకా అలాగే కాల్ సెంటర్ స్టాఫ్ వంటి ఐదు జాబ్స్ రోల్స్‌లో శిక్షణ ఉంటుంది.ఇక టయోటా టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (T-TEP) ద్వారా విద్యార్థులు ఉపాధి పొందేలా వారు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంకా అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిపుణులుగా మార్చడమే ఈ ట్రైనింగ్ యొక్క లక్ష్యం. ఇందుకోసం గాను టీ- టీఈపీ(T-TEP) 21 రాష్ట్రాల్లోని 56 ఐటీఐ ఇంకా పాలిటెక్నిక్ కళాశాలలతో అసోసియేట్ అయిందని ఎన్ఎస్‌డీసీ తెలిపింది.


ఇప్పటి వరకు కూడా మొత్తం 10,000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారని..ఇంకా వీరిలో 70 శాతం మంది వివిధ ఆటోమొబైల్ కంపెనీలలో పనిచేస్తున్నారని ఎన్ఎస్‌డీసీ వెల్లడించింది.ఇంకా అలాగే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్‌లను ఏఎస్‌డీసీ(ASDC) కూడా గుర్తిస్తుంది. వీటికి ఎంపికైన ఇన్‌స్టిట్యూట్‌లలో ఆటోమొబైల్ ఫండమెంటల్స్, సేఫ్టీ ఇంకా వ్యాల్యూస్ అండ్ బేసిక్ సాఫ్ట్ స్కిల్స్‌ వంటి అంశాలు కవర్ అయ్యే విధంగా టయోటా కంపెనీ శిక్షణ అనేది ఇవ్వనుంది. ఇక అంతేకాకుండా ఇ-లెర్నింగ్ కంటెంట్, ఇంజన్లు, ట్రాన్స్‌మిషన్స్ ఇంకా ప్రాక్టీస్ కిట్‌లను సైతం అందించనుంది. ఇంకా అలాగే ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీకి కూడా శిక్షణ అనేది ఇస్తుంది. ఇక, ఇన్‌స్టిట్యూట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత  కూడా ఏఎస్‌డీసీ చూసుకుంటుంది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు అలాగే ఆటోమొబైల్ రంగం పై ఆసక్తి వున్న అభ్యర్థులు ఇందులో జాయిన్ అవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: