ఎన్.హెచ్.పి.సి. నుండి .. ఉద్యోగాల భర్తీ ..

కరోనా నుండి కోలుకొని ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఉద్యోగాల భర్తీకి ముందుకు వస్తున్నాయి. ఆర్థికమాంద్యం తరహా పరిస్థితులు తెచ్చిపెట్టిన ఈ సంక్షోభం లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆచితూచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నాయి. తాజాగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్(ఎన్.హెచ్.పి.సి.) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ అకౌంటెంట్, మరియు అసిస్టెంట్ రాజ్ బాషా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 30 లోగ అర్హత గల అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎంపిక అయిన వారు దేశంలో సంస్థ నిర్ణయించిన చోట బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత అనుభవం బట్టి 180000 రూపాయల వరకు వేతనం ఉంటుంది.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ :
* ఎంబీబీఎస్ చేసి ఉండాలి. రెండేళ్ల పోస్ట్ ఇంటర్న్ షిప్ అర్హత, పోస్ట్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
* ఖాళీల సంఖ్య 13.
* వయోపరిమితి : 33
* వేతనం : 60000-180000
అసిస్టెంట్ రాజ్ బాషా అధికారి :
* గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్ డిగ్రీ మరియు డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టు గా కలిగి ఉండాలి.
* ఖాళీలు : 7
* వయోపరిమితి : 35
* వేతనం : 40000-140000
జూనియర్ ఇంజనీర్ (సివిల్) :
* ఆటో కాడ్ అదనపు ప్రయోగానం గా, గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి 60శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. రెగ్యులర్ డిప్లమా కలిగి ఉండాలి.
* ఖాళీలు : 68
* వయోపరిమితి : 30
* వేతనం : 29600-119500
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) :
* ఆటో కాడ్ అదనపు ప్రయోగానం గా, గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి 60శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
* ఖాళీలు : 34
* వయోపరిమితి : 30
* వేతనం : 29600-119500
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) :
* ఆటో కాడ్ అదనపు ప్రయోగానం గా, గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి 60శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
* ఖాళీలు : 31
* వయోపరిమితి : 30
* వేతనం : 29600-119500
సీనియర్ అకౌంటెంట్ :
* ఇంటర్మీడియట్ సిఏ లేదా సిఎంఏ, మరియు ఉత్తీర్ణులైన వారు అర్హులు.  
* ఖాళీలు : 20
* వయోపరిమితి : 30
* వేతనం : 29600-119500
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
జనరల్, ఓబీసీ, జనరల్-ఈడబ్ల్యూఎస్ వారు 250 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంది.
దరఖాస్తు చివరి తేదీ : 30, సెప్టెంబర్ 2021
ఇతర వివరాలకు : https://www.nhpcindia.com/writereaddata/Images/pdf/Advt_for_Recruitment_02-2021.pdf
https://www.nhpcindia.com/Default.aspx?id=128&lg=eng& చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: