అమెరికా, చైనా మధ్య నిఘా బెలూన్‌ మంటలు?

విమానాల కన్నా పై ఎత్తులో ఎవరూ వాతావరణ పరిశోధనలు చేయరు. కానీ ఈ మధ్య అమెరికాలో అందరికీ ఒక బెలూన్ అనుమానాస్పదంగా ఇంకా ఆశ్చర్యకరంగా ఎగురుతూ కనపడింది.  దాన్ని చూసి కొంతమంది దాన్ని గ్రహాంతరవాసుల విమానం అని, అదని, ఇదని అనుకున్నారు. అది వాతావరణ బెలూన్ అయితే  ముందు సిగ్నల్  ఇస్తారు. ఆ తర్వాత అది వెళ్లి పల్లె ప్రాంతంలో పడిపోవడం, అక్కడ పల్లె ప్రాంతపు ప్రజలు దాని చుట్టూ తిరిగి, లోపల మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని చూడడం, లోపల కూర్చోవడానికి కూడా కుర్చీ ఉందని చూడడం, ఇవన్నీ టీవీల్లో అందరం చూసాం.

వాతావరణ బెలూన్లు అలా ఉంటాయి. అవి కనపడుతూ ఉంటాయి.  అలా కాకుండా విమానాల కంటే పైఎత్తులో  ఉన్నటువంటి బెలూన్ అనే సరికి ఒక అనుమానం వచ్చి కూపీ లాగితే అది వాతావరణ బెలూన్ అని చైనా చెప్పినా, అది నిఘా బెలూన్ అని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా ఆ బెలూన్ ని ఆకాశం మధ్యలో పేల్చగానే, దాని శిథిలాలు పడితే కింద ఉన్న ఇళ్ళకు ప్రమాదం కాబట్టి, వాటిని కింద పడకుండా ఆపుతూ వాటిని బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చాక దాన్ని యుద్ధ విమానాలతో ధ్వంసం చేశారు.

ఆ తర్వాత అందులో ఉన్న పరికరాలు నిఘా పరికరాలే అని తేలింది. కానీ ఇందులో తేలిన మరో విషయం ఏంటంటే దాంట్లో తీసిన ఫొటోస్ ఇంకా వీడియోస్ చైనాకి వెళ్ళిపోతున్నాయి అంటే దాన్ని ఎవరైతే వదిలిపెట్టారో అక్కడికి అది విజువల్స్ తీసి పంపుతుందన్నమాట. ఇదంతా చైనా యుద్ధ వ్యూహంలో భాగంగానే చేస్తుందని తేలింది. వీటిని అమెరికా గగనతలం కూడా కనిపెట్టలేదట. రేపు గనక యుద్ధం వస్తే బాంబులు ఎలా పేల్చవచ్చు అనేదానికి ఇదొక ట్రైలర్ అయి ఉండాలి.‌ అంటే అక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ అన్నింటిని ఫొటోస్ తీసుకుని  ఆ ప్రదేశాల్లో ఒక్కసారిగా దాడులు చేసే ప్రయత్నం ఇది అని సందేహ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: