ఆ చైనా కంపెనీలను ఇండియా టార్గెట్‌ చేస్తోందా?

చైనా సంక్షోభాన్ని సొమ్ము చేసుకోవాలని భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా  సెమీ కండక్ట్, బొమ్మల తయారీని ఇండియాలో అనేక ప్రాంతాల్లో చేపట్టారు. అలాగే ఈ సారి దీపావళికి వాడే బాణా సంచాను చైనా నుంచి దిగుమతి చేసుకోలేదు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మాత్రం ఇంకా మనం పూర్తిగా విజయం సాధించకున్నా చాలా వరకు మెరుగుపడ్డాం. మనమే కొత్త కంపెనీలను ప్రోత్సహించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇది మరింత మెరుగుపడి ఎక్కువ వాహనాలను మార్కెట్ లోకి తీసుకువస్తాం.

వీటికి తోడు బల్స్ డ్రగ్ ఇండస్ట్రీ, యుద్ధ పరికరాల తయారీ, మెడికల్ మ్యాన్ ప్యాక్చరింగ్, తోలు పరిశ్రమలు కూడా భారత్ కు రాబోతున్నాయి. దీనికి ఉదాహరణే అమెరికా, యూరప్ లెధర్ పరిశ్రమలు భారత్ లో తమ పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. 2025 నాటికి లెథర్ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ. 1.23 లక్షల కోట్ల ఉంటుందని అనుకుంటున్నారు. దీనికి తోడు కాటన్ పరిశ్రమను వెలుగులోకి తీసుకురావడం పత్తిని కొని వాటి ద్వారా వస్త్రాలను తయారు చేసి వివిధ దేశాలకు చైనా సరఫరా చేసిన విధంగా చేయడం.

మొత్తం మీద  చైనా ఏమేం తయారు చేస్తోంది. ఎలాంటి వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని ఏయే మార్కెట్లకు సప్లై చేస్తున్నారు. వీటి ద్వారా ఆదాయం ఎంత చేకూరుతుంది. ఏయే రంగాల్లో భారత్ వీక్ గా ఉంది. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలని మన దేశ అధికార యంత్రాంగం ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా చైనాలో ఉన్న కంపెనీలపై మన దేశం కన్నేసింది.

అక్కడ ఎలా తయారు చేస్తున్నారో ఇక్కడ కూడా చేయండి. ఆయా కంపెనీలకు ప్రభుత్వం తరఫున రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా కంపెనీలు మొత్తంగా భారత్ కు వచ్చేస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: