బాబు దూకుడు: జగన్‌ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

ఉద్యోగ పదవీ విరమణ వయసు మరో ఏడాది పెంచబోతున్నారా ఏపీలో అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పెంచారు. జగన్ ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు పెంచారు. దీన్ని మరో ఏడాది పెంచేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినా వారి మీద ఉన్న ప్రేమతో కాదన్నది నిజం. ఎందుకంటే ఉద్యోగుల పదవీ విరమణ కాలం నాటికి వారికి ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

కాబట్టి దాని నుంచి తప్పించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు ఇలాంటి ఎత్తుగడలను వేస్తుంటాయి. దాంట్లోనే చంద్రబాబు, జగన్ వేసిన ఎత్తుగడలు. ప్రస్తుతం జగన్ మరోక ముందడుగు వేసి పదవీ విరమణ కాలాన్ని మరో ఏడాది పెంచాలని భావిస్తున్నారట.. ఇదే గనక జరిగితే నిరుద్యోగులకు ఆ నిర్ణయం ఆశనిపాతం లాంటిదే. ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటంటే ఒక పదవీ విరమణ పొందిన ఉద్యోగికి ఎక్కువ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో రాజకీయ పార్టీలు ఎత్తుగడలు ప్రదర్శిస్తున్నాయి. అటు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.

ఇటు నిరుద్యోగులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పదవీ విరమణ పొందే వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించాలో తెలియని ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనితో భవిష్యత్తు తరాల వారు తీవ్రంగా నష్టపోతారు. దానిని ఆలోచించకుండా ఈ సాహసం ఎన్నికలు వచ్చే ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. మొత్తంగా ఈ నిర్ణయం అనేది నిరుద్యోగులకు ఇబ్బందికరమైన కానీ ప్రభుత్వ పరంగా చూస్తే ఉద్యోగ విరమణ చేసేవారికి లాభమనే చెప్పాలి. ఇది అనుకూలంగా మారుతుందని ప్రభుత్వాలు బావిస్తుంటాయి. ఎన్నికలు నాటికి ఫలితాలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయో లేవో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: