టీడీపీ, జనసేన, బీజేపీ: ఈ పొత్తులు సాధ్యమేనా?

జనసేన పార్టీ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మేము బీజేపీతో పొత్తు లోనే ఉన్నామని ప్రకటించారు. దీనికి బీజేపీ కూడా సై అనే అంటోంది. కానీ సమస్యల్లా వచ్చింది. 2014 లాగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. కానీ దీనికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అసలు ఒప్పు కోవడం లేదు. ఎందుకంటే టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా పోటీ చేసినపుడే రాష్ట్రంలో మనం రెండవ అతిపెద్ద ప్రతిపక్ష స్థానంగా నిలుస్తాం. కానీ టీడీపీని కలుపుకొని పోతే మళ్లీ మొదటికే మోసం వస్తుందని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయాలన్నీ రాజకీయ నాయకులు, పొలిటికల్ అనలిస్టులు, జర్నలిస్టులు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరూ నోరు మెదపడం లేదు. కారణం ఎక్కడ ఏ మాత్రం నోరు తెరిచినా అక్కడ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పొత్తులు చిత్తయ్యేలా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు అంటే అది ఇక్కడి లోకల్ నాయకులు చూసేది కాదని, బీజేపీ అధిష్టానం కేంద్రం చూసుకుంటుందని అంటున్నారు. కానీ వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం అన్నది జరిగితే అది ఆ పార్టీకి లాభం చేకూరుతుంది తప్ప ఏ మాత్రం నష్టం జరగదని బీజేపీ వాళ్ల వాదన.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కల్యాణ్ కు కలిసి వస్తుందని జనసేన కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ వచ్చిందల్లా చిక్కు ఎక్కడంటే బీజేపీతో కలిసి ఉంటామంటన్న పవన్, టీడీపీని కూడా దగ్గర చేసుకుంటున్నారు. ఇదే అసలు సమస్య దీని వల్ల జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మొత్తంగా బీజేపీతో జనసేన పొత్తు, టీడీపీతో సఖ్యత ఆ రెండు పార్టీల అభిముఖత ప్రజలను గందర గోళానికి గురి చేస్తున్నాయి. మరి పవన్ కల్యాణ్ చేస్తున్న పొత్తుల రాజకీయం ఎన్నికల వరకు నిలబడుతుందా లేదా మధ్యలోనే ఊసురుమనిపిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: