ఉక్రెయిన్‌: అటు రాకెట్ల వర్షం.. ఇటు మాటల యుద్ధం

ఉక్రెయిన్ కు సంబంధించి రష్యా ఐక్యరాజ్యసమితిలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే రష్యా తన బలమైన వాదనలు వినిపించింది. ఉక్రెయిన్ తమ దేశం నుంచి స్వాతంత్రం పొందిన దేశమేనని కానీ అక్కడ 100% ప్రజల్లో 90 శాతం మంది రష్యా భాషను మాట్లాడతారని కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం వారిని అణచివేయాలని ఆయా పాఠశాలల్లో రష్యా భాషను చదవకుండా చేయాలని కంకణం కట్టుకుందని ఆరోపించింది.

రష్యా మాట్లాడుతూ నాలుగు ప్రాంతాలలోని జాపో జజరియా, డొమెస్టి, లుఫ్తాన్సా, కెర్కస్, లాంటి ప్రాంతాల్లో రష్యా భాష మాట్లాడే వాళ్ళు  ఎక్కువ ఉంటారని వారందరిని మాట్లాడకుండా చేయడమే ఉక్రెయిన్ లక్ష్యమని రష్యా ఆరోపించింది. ఇలాంటి అంతర్గత దాడులు చేస్తున్న ఉక్రెయిన్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదే తమ ప్రధాన లక్ష్యమని సమితిలో మాట్లాడుతూ హెచ్చరించింది. రష్యా ఉక్రెయిన్ పై తమ దాడిని కొనసాగిస్తామని చెప్ప కనే చెప్పినట్టు అయింది. అది సున్నితంగా  విశ్లేషణాత్మకంగా చెప్పింది.

గతంలో క్రిమియాపై పై యుద్ధం చేసిన సమయంలో కూడా ఇలాంటి వాదనే వినిపించింది. క్రిమియా లో 90 శాతం మంది రష్యా భాష మాట్లాడతారని  ఇది సరైన విధానం కాదని క్రిమియా రష్యాలో అంతర్భాగమని ప్రకటించి యుద్ధం చేసింది. అప్పుడు క్రిమియాను అని రష్యాలో కలిపేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని ముఖ్యమైన ప్రాంతాలను తమ దేశంలోని భాగాలేనని చెప్పుకొచ్చేస్తుంది.రష్యా ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిన విధానం ఒక రకమైన చర్చకు దారి తీసింది.

ఓ పక్క దాడులు చేస్తూనే మరొక పక్క తమ నుంచి స్వాతంత్రం పొందిన ప్రాంతాలు స్వేచ్ఛను అనుభవించాల్సి ఉండగా అక్కడ కేవలం ఉక్రెయిన్ భాషని ప్రజల్లో రుద్దాలని చూస్తున్నారు.. ఇది సరైన విధానం కాదని  రష్యన్ భాషలు మాట్లాడేవారిని ఎక్కడ అణచివేయాలని చూసినా తాము అడ్డుకుంటామని రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితిలో వాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: