తాలిబాన్లతో చేతులు కలుపుతున్న చైనా?

తాజాగా ఆఫ్గానిస్థాన్ లో బయట పడిన ఉదంతంలో ఐఎస్ఐఎస్ వాళ్లు చేసిన దాడిలో చైనా కు చెందిన 20 మంది సైనికులు చనిపోయారని తెలిసింది. కానీ చైనా ప్రభుత్వం తమ వారెవరూ లేరని చెబుతోంది. తాలిబాన్లకు డబ్బులు ఎరవేసి అమెరికన్లు విడిచిపెట్టిన ఆయుధాలను తీసుకెళ్లి అదే తరహాలో తమ దేశంలో వాటిని తయారు చేయాలని భావిస్తోంది. దీని కోసం చైనా ప్రత్యేక బృందాలు ఆఫ్గనిస్థాన్ కు వస్తున్నాయి.

ఇదే కాకుండా ఆఫ్గన్ లో ఉన్నటు వంటి మైనింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఈ మైనింగ్ వల్ల లక్షల కోట్ల రూపాయాలను సంపాదించవచ్చని డ్రాగన్ దేశం అనుకుంటుంది. మైనింగ్  తీసుకుపోవడంతో తాలిబాన్లు సహకరిస్తే, దానికి సహాయంగా ఆఫ్గన్ లో మంచి భవనాలు నిర్మించి ఇస్తామని, రాజమందిరాలను కట్టిస్తామని, ఇతరాత్ర సహాయాలు కూడా చేస్తామని చైనా చెబుతోంది. ఈ కారణంగానే  అక్కడ గొడవ పతాక స్థాయికి చేరింది.
 
ఎందుకంటే వీగర్ ముస్లింల వ్యవహారంలో చైనాలో వారి మసీదులను కూల్చివేయడం, అక్కడ ముస్లింలు ఉండకుండా చేయడం చేస్తోంది. కూల్చి వేసిన ప్రాంతాల్లో చైనా బిల్డింగ్ లు కట్టింది. వీగర్ ముస్లింల కాళ్లకు సంకెళ్లు వేసి తిప్పుతోంది. నిర్బంధ గృహాల్లో పెడుతుంది. ఉర్దూ మాన్పించేసి చైనా సబ్జెక్టు చదివిస్తోంది. మతాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే తాలిబాన్లు, ముస్లింలపై నిర్బంధ కాండ కొనసాగిస్తున్న చైనా ప్రభుత్వం, ఆ అధికారులతో కలిసి ఉండటం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆక్రోషానికి కారణం.

ఇందుకే ఆప్గన్ లో 20 మంది చైనీయులను చంపినట్లు తెలుస్తోంది. ఈ దమనకాండ ఎక్కడ వరకు సాగుతుందో చూడాలి. చైనా, తాలిబాన్ల సఖ్యత అన్యోన్యంగా ఉంటుందా. వీరిద్దరూ కలిసి ఉండటానికి ప్రయత్నించినా ఐఎస్ఐఎస్ నుంచి వీరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఇంకెన్ని దాడులు జరుగుతాయో కాలమే నిర్ణయిస్తుంది. అయినా చైనాను నమ్ముకున్న శ్రీలంక పరిస్థితి ఏమైంది. ఎంతటి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారో అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: