ఆ యుద్ధాలతో బుద్దొచ్చింది.. లెంపలేసుకుంటున్న పాక్‌?

భారత్‌తో జ‌రిగిన యుద్ధాలతో గుణ‌పాఠం నేర్చుకున్నామని పాకిస్తాన్‌ లెంపలు వేసుకుంటోంది. అందుకే పొరుగు దేశంతో శాంతి కోరుకుంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెబుతున్నారు. కాశ్మీర్‌ సహా ఇరుదేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్నిసమస్యలపై భార‌త ప్రధాని మోదీతో నిజాయితీ చర్చలకు సిద్ధమని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. దీంతో చాలాకాలానికి పాకిస్థాన్‌  నాయకత్వానికి బుద్ధి వచ్చినట్లు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

భారత్‌తో జరిగిన యుద్ధాలతో ఎన్నో గుణ పాఠాలు నేర్చుకున్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. శాంతియుతంగా జీవిస్తూ అభివృద్ధి చెందడమా లేక పరస్పరం పోట్లాడుకుంటూ ఉండటమా అన్నది ఇరుదేశాలు తేల్చుకోవాల్సిన అంశమని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంటున్నారు. భారత్‌తో మూడు యుద్ధాలు చేయటం వల్ల.. పాకిస్థాన్‌ ప్రజలకు బాధ, పేదరికం, నిరుద్యోగం మిగిలిందంటూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిజాలు ఒప్పుకున్నారు.

భారత్‌తో శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. అప్పుడే నిజమైన సమస్యలను  పరిష్కరించుకోగలమని షెహబాజ్‌ షరీఫ్‌ అంటున్నారు.  భారత్‌తో పాక్‌ శాంతిని కోరుకుంటోందన్న షెహబాజ్‌ షరీఫ్‌ .. కాశ్మీర్‌లో జరుగుతుందో అది ఆగాలంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేం మా వనరులను బాంబులు, ఆయుధాల కోసం వృథా చేయాలని భావించటం లేదని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.  

అయితే.. కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఆహార, ఇంధన కొరతలు బాగా ఉన్నాయి. ఈ పరిస్థితులను గట్టేందుకు ప్రపంచ దేశాలు, ఆర్థిక సంస్థల ముందు పాకిస్తాన్‌ చేయి చాస్తోంది. అందుకే అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్‌....ఆర్థిక సాయం అడ్డుకోవాల్సి వస్తోందని ఇటీవల షెహబాజ్‌ షరీఫ్‌ వాపోయారు. ఇప్పటికే పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: