మోదీ సంచలన నిర్ణయం..ఫ్రీగా కేబుల్‌ నెట్‌?

2024 ఎలక్షన్లకి ఇంకా ఒక సంవత్సరం పైనే టైం ఉన్నా ఇప్పుడు నుంచీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇదివరకు కరోనా టైంలో ఇచ్చిన ఉచిత రేషన్‌ను కూడా  ఈ ఏడాది డిసెంబర్ దాకా  పంపిణీ  చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఉచితంగా ఇచ్చే రేషన్ తో పాటుగా, కేబుల్ నెట్ ని కూడా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమవ్వబోతుందని తెలుస్తుంది. గతంలో 150 రూపాయలకే కేబుల్ నెట్ ఇవ్వడానికి  ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తే సక్సెస్ అవ్వలేదు గాని  దాని నుండి  లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయంగా ఉన్నారు.

కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేబుల్ నెట్ ను  దేశమంతా ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దేశంలో పబ్లిక్ సెక్టార్లైన దూరదర్శన్ రేడియో లాంటి వాటి వినియోగాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2539 కోట్లు కేటాయించాలన్న  నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తుంది. దీనికోసం సెంట్రల్ స్కీంకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం ఛానల్ కవరేజ్ ని 80 శాతం మంది జనాలకు విస్తరించాలని నిర్ణయించుకుంది.

8లక్షల ఉచిత డిటిహెచ్ లను సెట్టాప్ బాక్స్ లను కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.  మారుమూల ప్రాంతంలో నివసించే జనాలకు అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించిన జనాలకు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో ఉన్నవారికి ప్రధానంగా వీటిని అందించాలని నిర్ణయించుకున్నారు‌. వీటిలో దూరదర్శన్ ఛానల్ తో సహా కొన్ని న్యూస్ చానల్స్ కొన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా  వస్తాయి.

ఇప్పుడు డిటిహెచ్ ఎక్కువగా ప్రజాదరణ పొందింది కాబట్టి  దేశమంతా ప్రజలందరికీ ఈ డిటిహెచ్ నీ ఉచితంగా ఇచ్చేయాలని ఈ విధంగా డిటిహెచ్ ను విస్తరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. వీటితోపాటుగా పాత స్టూడియో, ఇంకా ఓపి పరికరాలను కూడా మార్చివేయడానికి తయారీ సేవలతో ఉపాధి కోసం ఉపయోగపడడానికి దూరదర్శన్ 28 ప్రాంతీయ చానల్స్ తో  కలుపుకొని 36 చానల్స్ నిర్వహిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: