ఇదెక్కడి న్యాయం: ఎన్‌కౌంటర్‌ చేస్తే.. సన్మానాలా?

నలుగురిని నిందితులుగా పేర్కొని రాత్రికి రాత్రి వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తే పోలీసులను సత్కరిస్తున్నారని... అలాంటి ఘటనలు తమ కుటుంబాల్లో జరిగితే ఏమిటని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. రూల్‌ ఆఫ్‌ లా అనేది అందరూ పాటించాలని... పోలీసులు వాటిని అతిక్రమించడం తగదని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. ఎవరైనా చట్టాన్ని, న్యాయాన్ని అతిక్రమించి వ్యహరించకుండా చూడాలని.. అలా కానిపక్షంలో సభ్య సమాజంలో కాకుండా అడవుల్లో ఉన్నట్టే అవుతుందని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు.

ఇతర వృత్తుల కంటే న్యాయవాద వృత్తి ఎంతో కీలకమైందన్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు  రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో వీరి పాత్ర ముఖ్యమైందన్నారు. కేసుల సత్వర విచారణలో కొంత ఆలస్యమవుతోన్నా అంతిమంగా న్యాయం జరుగుతుందని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. విదేశాల్లోని తీర్పులు, అక్కడి వ్యవస్థలు, పద్ధతులను మనం సరిపోల్చుకుని చూడలేమన్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు.. మన దేశంలో జనాభా ఎక్కువని, తమకు అన్యాయం జరిగిందని భావించిన ఎవరైనా సహాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారని అన్నారు.

జనాభాతో పోల్చుకుంటే అందుకు తగిన సంఖ్యలో న్యాయస్థానాలు, తీర్పులు ఇచ్చేందుకు న్యాయమూర్తులు లేరనేది అందరూ అంగీకరించాల్సిన విషమని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. సుప్రీంకోర్టులో రోజుకు 65 వాజ్యాలు పరిశీలించి విచారణ జరుపుతుంటే అమెరికా వంటి దేశాల్లో ఏడాదికి 130 కేసుల్లో తీర్పులు వస్తున్నాయని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వివరించారు. కారణాలు ఏమైనా ఇక్కడ న్యాయవాదులు ఎక్కువగా వాయిదాలు కోరుతుంటారని, ఇది కూడా కేసుల విచారణ పూర్తి కావడంలో జాప్యానికి ఓ కారణంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి న్యాయమూర్తి తమ సామర్ధ్యం మేరకు త్వరిగతగిన కేసుల విచారణ పూర్తి చేసేందుకు వీలుగా పనిచేస్తున్నారని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. ఆలస్యమైనా చివరికి న్యాయం జరుగుతోందా? లేదా? అనేది ఆలోచించాలని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

law

సంబంధిత వార్తలు: